HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagananna Arogya Suraksha Second Phase Start From Tomorrow

Jagananna Arogya suraksha : రేపటి నుండి రెండో దశ ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్య‌క్ర‌మం

  • Author : Prasad Date : 01-01-2024 - 8:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YSR Aarogya Sri
YSR Aarogya Sri

ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని చేరువ చేసేందుకు జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష కార్య‌క్ర‌మాన్ని ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. గ‌తేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ కార్యక్రమం రెండో దశను జనవరి 2వ తేదీ నుండి నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సర్వ సన్నద్ధమయ్యింది. ఆరు నెల‌ల పాటు నిర్వహించే రెండోదశ కార్యక్రమంలో 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అన్ని ఏర్పాట్లూ చేసింది. తొలిదశలో నిర్వహించిన కార్యక్రమంలో 12,423 ఆరోగ్య శిబిరాలల్ని నిర్వహించడం ద్వారా 1,64,982 మంది పేషెంట్లను డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు తరలించి వారికి ఉచిత వైద్య సేవల్ని అందించారు. వైద్య ఆరోగ్యసేవల్ని అందించే విషయంలో ఏ ఒక్క గ్రామాన్నీ వదిలి పెట్టరాదన్న లక్ష్యాన్ని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష రెండోదశ కార్యక్రమానికి ఆరు నెలల వ్యవధిని నిర్దేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించేందుకు తొలిదశలో 50 రోజులకు పైగా నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో 60 లక్షల మందికి పైగా ప్రజలు ప్రయోజనం పొందారు. తొలిదశ కార్యక్రమంలో సిహెచ్వోలు/ఎఎన్ఎంలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలలో 1,45,35,705 ఇళ్ళను సందర్శించి రోగుల ఇంటి ముంగిటిలోనే 6,45,06,018 వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తొలిదశ కార్యక్రమంలో నిర్వహించిన 12,423 ఆరోగ్య శిబిరాలలో 60,27,843 మంది ప్రజలు ఓపి సేవలు అందుకోగా, 1,64,982 మంది పేషెంట్లను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి ఉచిత వైద్య చికిత్సను అందించారు. పేషెంట్లందరినీ ఆరోగ్య శిబిరాలనుండి సిహెచ్వోలు/ఎఎన్ఎంలు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులలోని ఆరోగ్యమిత్రల ద్వారా నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా అందించేలా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. దీంతో పాటు ఈ ప్రక్రియనంతా యాప్ ద్వారా పరిశీలించి పేషెంట్ల రవాణా, ఇతర ఖర్చుల నిమిత్తం రు.500 వైద్య ఆరోగ్య శాఖ అందజేసింది. జగనన్న ఆరోగ్య సురక్ష తొలిదశ కార్యక్రమం పూర్తి విజయవంతం కావటంతో రాష్ట్రంలోని అన్ని మండలాలు, పట్టణ ప్రాంతాలలో విస్తరించి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో రెండో దశ కార్యక్రమాన్ని ఆర్నెల్లపాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

Also Read:  Impregnating Cheat : ప్రెగ్నెంట్ చేస్తే రూ.13 లక్షల ఆఫర్.. మాఫియా గుట్టురట్టు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • andhra pradesh health department
  • AP CM Jagan
  • cm jagan
  • Jaganna arogya suraksha
  • JAS

Related News

The Largest International Airport in Amaravati

Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం

ఏపీ రాజధాని అమరావతిలో 4,618 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ప్లాన్ చేశారు. తాడికొండ మండలం రావెల సమీపంలో స్థలం గుర్తించినట్లు తెలుస్తోంది. అక్కడ గ్రామాల్ని తరలించకుండా స్థల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భూసమీకరణా, సేకరణా అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్‌ను తొలి దశలో రూ.3,409 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్నారు. అమరావతి ఔటర్ రింగ్

  • Mlc Anantha Babu Arrest

    MLC Anantha Babu: మరో వారంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి.. జగన్ స్నేహితుడు అనంతబాబు జైలుకి

  • Tdp

    TDP: రాజ్యసభకు టీడీపీ నుంచి భారీగా ఆశావహుల

  • Deputy CM to arrive in AP today

    Pawan Kalyan: నేడు ఏపీకి డిప్యూటీ సీఎం రాక

  • Minister Narayana inspected the MLA and MLC buildings in Amaravati.

    AP Government: అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను పరిశీలించిన మంత్రి నారాయణ

Latest News

  • Telangana: స్టార్‌ హోటళ్లలోనూ అందుబాటులోకి తాటి కల్లు : మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన

  • Pm Modi: ఇక గ్యాస్, పెట్రోల్ కష్టాలకు చెక్?

  • Gold Price: బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్

  • Stock Market: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

  • NEET UG 2026: నీట్ రీ ఎగ్జామ్ తేదీ ఖరారు

Trending News

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd