HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Dont Come To My Rescue Sivajis Sensational Comments On The Paytm Batch

Actor Sivaji : పేటీఎం బ్యాచ్ కు ఇచ్చిపడేసిన శివాజీ..!!

  • Author : Vamsi Chowdary Korata Date : 09-03-2026 - 2:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Actor Sivaji
Actor Sivaji

Actor Sivaji  టాలీవుడ్ నటుడు శివాజీ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన నటించిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాను​అడ్డుకునేందుకు కుట్ర చేశారని ఆరోపించారు. కొందరు నెగిటివ్ రివ్యూలతో టార్గెట్ చేశారని.. దీని వెనుక పేటీఎం బ్యాచ్ ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల గురించి పట్టించుకోకుండా.. తన పని తాను చేసుకుంటున్నానని.. అయినా సరే కొంతమంది తనను టార్గెట్ చేశారని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు శివాజీ.

నటుడు శివాజీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన సినిమా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని  అడ్డుకునేందుకు కొంతమంది కుట్రపన్నారని ఆరోపించారు. తాను అసలు రాజకీయాల గురించి పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటున్నానని.. అయినా సరే తన సినిమాపై జగన్ పేటీఎం బ్యాచ్‌తో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. ‘జగన్ గారు నా జోలికి రావొద్దు’ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తన సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ రివ్యూలు రాయించారని శివాజీ మండిపడ్డారు. తన సినిమాను ఆపగలరేమో.. కానీ తనను మాత్రం ఆపలేరన్నారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలోనే తనను ఏమీ చేయలేకపోయారని.. ఇప్పుడు తనను అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు.సీబీఐ కేసులున్న నేతల్ని రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరతానన్నారు శివాజీ. రాజకీయ నేతలపై ఉన్న కేసుల విచారణను వేగవంతం చేయాలని.. అప్పుడే సీబీఐ వంటి సంస్థలపై నమ్మకం కలుగుతుందన్నారు.

తాను రాజకీయాలు వద్దుకుని ఏమీ మాట్లాడటం లేదన్నారు నటుడు శివాజీ. కానీ అమరావతి విషయంలో మాత్రం తన వాయిస్‌ను వినిపిస్తానన్నారు. రాజధాని రైతుల కోసం ఎవరిపైనైనా పోరాడతానన్నారు. తానను ఎవరికి భయపడేది లేదని.. నిజాయితీగా బతుకుతున్నానని, తనను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తాను జనం కోసం బతుకుతానని.. ఎవరో ఇచ్చే డబ్బుల కోసం బతికేవాడిని కాదన్నారు. కనీసం 100మంది సబ్‌స్క్రైబర్లు లేని కొందరు తన సినిమాపై ఇష్టం వచ్చినట్లు రివ్యూలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని నెగిటివ్ రివ్యూలు రాసినా.. తన సినిమా వారం తర్వాతైనా కచ్చితంగా ప్రజలకు దగ్గరవుతుందన్నారు.

శివాజీ నటించిన సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాపై పనిగట్టుకుని కొందరు నెగిటివ్ రివ్యూలు రాయిస్తున్నారని శివాజీ అంటున్నారు. దీని వెనుక వైఎస్సార్‌సీపీ కుట్ర ఉందని శివాజీ ఆరోపిస్తున్నారు. అందుకే మాజీ సీఎం వైఎస్ జగన్ టార్గెట్‌గా శివాజీ ఓ వీడియోను విడుదల చేశారు.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • actor sivaji
  • actor sivaji comments
  • Sampradayini Suppini Suddapoosani
  • YS Jagan Mohan Reddy
  • YSR Congress Party

Related News

It is because of CM Chandrababu that it is not raining: Former Minister

Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వల్లే రాష్ట్రంలో వర్షాలు పడటం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నంద్యాలలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు పడకపోవడానికి పాలకుల మనస్తత్వమే కారణమంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఏలుకునే రాజు మనస్తత్వం బాగుంటే

  • YS Jagan pays tribute to YSR.

    YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

  • Shivaji on a roll... a string of exciting projects with young directors...

    Sivaji: శివాజీ దూకుడు.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్..

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Alcohol: మందు కొడితే మంచి నిద్ర వస్తుందా..? నిజమెంత?

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd