HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Asks Bankers To Support Govt Schemes Programmes

AP CM: మాకు స‌హ‌క‌రించండి.. బ్యాంక‌ర్ల‌ను కోరిన సీఎం జ‌గ‌న్‌

ప్ర‌భుత్వం సంక్షేమ రంగంలో తీసుకువ‌స్తున్న విప్త‌వాత్మ‌క మార్పుల‌కు త‌మ మ‌ద్ద‌తు అందించాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ్యాంక‌ర్ల‌ను కోరారు. రాష్ట్రంలో టీచింగ్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు బ్యాంకులు రూ.9,000 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు.

  • Author : Hashtag U Date : 08-12-2021 - 10:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
cm jagan

ప్ర‌భుత్వం సంక్షేమ రంగంలో తీసుకువ‌స్తున్న విప్త‌వాత్మ‌క మార్పుల‌కు త‌మ మ‌ద్ద‌తు అందించాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బ్యాంక‌ర్ల‌ను కోరారు. రాష్ట్రంలో టీచింగ్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు బ్యాంకులు రూ.9,000 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో ఆంధ్రప్రదేశ్ 13.7% వృద్ధిని నమోదు చేసిందని… కానీ థర్డ్ వేవ్‌, ఓమిక్రాన్‌పై వేరియంట్ వ్యాప్తి ప్ర‌చారం కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మందగించిందని సీఎం జ‌గ‌న్ తెలిపారు. లేక‌పోతే ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పుంజుకునేదని…ఈ తరుణంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను, అభివృద్ధిని బలోపేతం చేయడానికి బ్యాంకులు ప్రణాళికలను రూపొందించాలని ఆయ‌న కోరారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా వారు తమ ప్రాధాన్యతలను, ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆయన తెలిపారు.

ప్రైమరీ హెల్త్ సెక్టార్ లో ప్రభుత్వం నిర్మాణాత్మక మార్పులు తీసుకువస్తోందని జగన్ తెలిపారు. ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహిస్తోందని… అలాగే, వైద్య, ఆరోగ్య రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాని ఆయ‌న పేర్కొన్నారు. దీనికి రూ.12,243 కోట్లు అవసరమ‌ని…. రాష్ట్రవ్యాప్తంగా 16 మెడికల్‌, 16 నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు.

వార్షిక క్రెడిట్ ప్లాన్‌ను ప్రస్తావిస్తూ…ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో సాధించిన విజయాలకు సీఎం జగన్ బ్యాంకర్లను అభినందించారు. వ్యవసాయ టర్మ్ రుణాలు పంపిణీ చేయడంపై దృష్టి సారించాలని… ఇంకా అందని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు అందించాలని బ్యాంకర్లను ముఖ్యమంత్రి కోరారు. కౌలు రైతులు రుణాలు పొందాలని, 4,240 రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) బ్యాంకింగ్ సేవలు ప్రారంభించాల్సిన అవసరం ఉందని… ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని బ్యాంకర్లను కోరారు.

గృహనిర్మాణ పథకం కోసం మహిళలకు 3% వడ్డీకి రూ.35,000 రుణంగా అందించాలని…టిడ్కో గృహాలకు రుణాలు అందించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ బ్యాంకర్లను కోరారు. MSMEలకు సంబంధించి 8.3 లక్షల ఖాతాలు ఉన్నాయని, వాటిలో 1.78 లక్షల ఖాతాలను పునర్నిర్మించామని…MSMEల రుణ ఖాతాలను ఒకేసారి పునర్నిర్మించడానికి బ్యాంకులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. జగనన్న తోడు పథకం కింద 9.1 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారని…దరఖాస్తుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జగన్ బ్యాంకులను కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chief Minister Y.S. Jagan Mohan Reddy
  • education
  • health
  • State Level Bankers Committee
  • women empowerment

Related News

    Latest News

    • Atchannaidu: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

    • Prakash Raj: కాక్‌రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!

    • Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు

    • APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

    • APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

    Trending News

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd