HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >It Is The Opposition That Makes The Voice Of The People Heard Botsa Satyanarayana

AP Assembly : ప్రజల గొంతుకను వినిపించేది ప్రతిపక్షమే : బొత్స

ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

  • Author : Latha Suma Date : 24-02-2025 - 12:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
It is the opposition that makes the voice of the people heard: Botsa Satyanarayana
It is the opposition that makes the voice of the people heard: Botsa Satyanarayana

AP Assembly : ఏపీ బడ్జెట్ సమావేశాలను వైసీపీ వాకౌట్ చేసింది. గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ సభ్యులందరూ సభ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ…ప్రజల గొంతుక వినిపించాలంటే అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వా‍ల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. ఏపీ ప్రజాస్వామ్యం ప‌రిరక్షించబడాలంటే ప్రధాన ప్రతిపక్షం ఉండాల్సిందేనని ప‌ట్టుబ‌ట్టారు.

Read Also: Marriage For Buffaloes : గేదెల కోసం మహిళ రెండో పెళ్లి.. షాకిచ్చిన అత్తామామలు

సభలో ఉన్నది రెండే పక్షాలని ఒకటి అధికారపక్షమైన కూటమి, రెండోది ప్రతిపక్షమని చెప్పారు. ప్రజల గొంతుకను సభలో వినిపించేది ప్రతిపక్షమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి ఎంతో విలువ ఉంటుందని, అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదా ఇవ్వాల‌ని కోరితే ఇటు గవర్నర్‌ నుంచి, అటు స్పీకర్‌ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. గవర్నర్‌ ప్రసంగాన్ని వైసీపీ బాయ్‌కాట్‌ చేసింద‌ని బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నార‌ని ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు. రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవ‌ని మండిప‌డ్డారు.

ప్రతిపక్ష హోదాపై ప్రభుత్వ స్పందన చూసిన తర్వాతే తమ తదుపరి చర్య ఉంటుందని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజాక్షేత్రంలోకి వెళతామని, ప్రభుత్వ చొక్కా పట్టుకుంటామని తెలిపారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న తమపై కేసులు పెడుతున్నారని బొత్స మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు గడిచినా సూపర్ సిక్స్ హామీలపై ఎలాంటి చర్యలు లేవని విమర్శించారు. కాగా, ఈరోజు ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గవర్నర్‌ ప్రసంగం మొదలైన కాసేపటికే వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రజా సమస్యలు వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, రెడ్‌బుక్‌ రాజ్యాంగం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నినాదాలు చేశారు. అయినా స్పందన లేకపోవడంతో వైసీపీ నిరసనకు దిగింది. ఈ క్రమంలో వైయ‌స్‌ జగన్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా స‌భ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు.

Read Also: AMGEN : హైదరాబాద్‌లో అమ్జెన్ ఇన్నోవేషన్ సైట్ ప్రారంభం

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap assembly
  • AP Assembly Session
  • botsa satyanarayana
  • Opposition status
  • ys jagan
  • ysrcp

Related News

Amaravati Inner Ring Road Case

Amaravati Inner Ring Road Case: ఏపీ హైకోర్టులో చంద్రబాబుకు ఊరట

Chandrababu  ఏపీ హైకోర్టు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను కోర్టు కొట్టేసింది. సీబీఐకి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసు దర్యాప్తును అప్పగించాలని, ఈ కేసులో చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని, ఈ కేసు విచారణను ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

  • Pawan Speech Assembly

    AP Assembly : లోకేష్ వ్యాఖ్యలను తప్పు పట్టిన పవన్ కళ్యాణ్

  • Amaravati Bill Set

    Nara Lokesh: జగన్ కు నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!!

  • Amaravati Capital

    AP Assembly: అమరావతికి చట్టబద్ధత

  • Speaker Ayyanna Patrudu

    AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం : అయ్యన్నపాత్రుడు

Latest News

  • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

  • Peddi : ‘పెద్ది’ చిత్ర యూనిట్ కు క్షమాపణలు చెప్పిన మెగా ప్రొడ్యూసర్

  • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..

  • Gold Price : మళ్లీ దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

  • Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం

Trending News

    • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd