YS Jagan : కూటమి కంటే జగనే బలంగా ఉన్నాడా..?
పొత్తు ప్రకటన వచ్చిన తర్వాత మాత్రం జగన్ వైపే గాలి వీస్తోందని అంటున్నారు.
- Author : Sudheer
Date : 18-03-2024 - 12:05 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫై రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ రోజు రోజుకు ఎక్కువుతుంది. పొత్తు ముందు వరకు కూడా గెలుపు ఎవర్ని వరిస్తుందో అని అంత మాట్లాడుకున్నారు. కానీ పొత్తు (Kutami) ప్రకటన వచ్చిన తర్వాత మాత్రం జగన్ (Jagan) వైపే గాలి వీస్తోందని అంటున్నారు. దీనికి కారణం కూడా పొత్తు పార్టీలలో రోజు రోజుకు ఎక్కువ అవుతున్న అసమ్మతి సెగలే. జగన్ ను గద్దె దించాలనే కసితో చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లు బిజెపి (BJP) తో పొత్తు పెట్టుకున్నారు. బిజెపి పొత్తు కారణంగా ఇరు పార్టీలు పలు స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది.
దీంతో ఆయా స్థానాలను నమ్ముకొని ఉన్న పార్టీల నేతలు ఇప్పుడు పార్టీ అధినేతల ఫై ఆగ్రహం తో వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ లోని నేతలు , కార్యకర్తలైతే ఇక పవన్ వదిలేస్తాం అంటూ చెప్పకనే చెపుతున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ మాకోసం ఆలోచిస్తారని అనుకున్నాం కానీ ఇప్పుడు బాబు ను గెలిపించడం కోసమే ఆలోచిస్తున్నారని..అందుకే బాబు చెప్పిందల్లా చేస్తూ..వదులుకోమన్న సీట్లను వదిలేసుకుంటూ వెళ్తున్నారని అంటున్నారు. అందుకే నిన్న జరిగిన ప్రజాగళం సభ కు చాలామంది జనసేన కార్యకర్తలు దూరంగా ఉన్నారు. విజయవాడ నుండి కీలక నేతలు , కార్యకర్తలు ఎవ్వరు కూడా హాజరు కాలేదు. అంతే కాకుండా పలు చోట్ల టీడీపీ అభ్యర్థులు జనసేన కార్యకర్తలను , నేతలను చాల చులకనగా చూస్తున్నారట..టీడీపీ కిందనే మీరు ఎప్పటికైనా అన్నట్లు వారంతా హేళన చేస్తున్నారని పలువురు చెప్పుకొని బాధపడుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇలా రాష్ట్రంలోని చాల నియోజకవర్గాల్లో జనసేన శ్రేణులు..టీడీపీ నేతలు, శ్రేణులు చేస్తున్న మాటలకు బాధపడుతూ.. అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం తో ఊగిపోతున్నారు. ఇలా మాటలు పడే బదులు వైసీపీ లో చేరితేనే బెటర్ అని… కష్టమో, నష్టమో జగన్ తోనే అంటూ వారంతా వైసీపీ కండువాలు కప్పుకుంటున్నారు. దీంతో జగన్ బలం రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. బయటకు మీమే గెలుస్తున్నాం అని టీడీపీ నేతలు చెపుతున్న లోలోపల మాత్రం పొత్తు వల్ల చేజేతులా ఓటమి చూడబోతున్నాం అని బాధపడుతున్నారట. అంతే ఎందుకు పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే అనుకుంటున్నాడని రీసెంట్ గా ఆయన చేసిన కామెంట్స్ చూస్తే అర్ధం అవుతుంది. ఏది ఏమైనప్పటికి మరోసారి జగన్ గెలవబోతున్నాడని అనేక సర్వేలు చెపుతున్నాయి.
Read Also : Rahul: మోడీకి అవినీతిపై గుత్తాధిపత్యం.. రాహుల్ గాంధీ