HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >A Diet That Helps You Lose Weight In Just One Week

వారం రోజుల్లోనే బరువు తగ్గించే డైట్.!

  • Author : Vamsi Chowdary Korata Date : 20-12-2025 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Diet And Nutrition
Diet And Nutrition

Diet and Nutrition :  బరువు తగ్గడం అనేది చాలా మంది గోల్. ఇది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది కొంతమందికి. వారంలో కిలో తగ్గాలని, పదిరోజుల్లో కనీసం 2 కేజీలు తగ్గాలని, నెలరోజుల్లో అంటూ ఇలా ఏవేవో లెక్కలు వేసుకుంటారు. అనుకున్నట్లుగా మొదటి ఒకటి, రెండు రోజులు ప్రయత్నిస్తారు. కానీ, ఆ తర్వాత అనేక కారణాల వల్లో, బోర్‌గా ఫీల్ అవ్వడం వల్లో మళ్లీ నార్మల్‌గా అయిపోతారు. అలా కాకుండా, సీరియస్‌గా బరువు తగ్గాలనుకున్నవారు స్ట్రిక్ట్‌గా ఫాలో అయితే కచ్చితంగా అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. దీనికోసం మంచి డైట్ ప్లాన్ కూడా షేర్ చేస్తున్నారు న్యూట్రిషనిస్ట్ నేహా పరిహార్.

బరువు తగ్గాలనుకోవడం వేరు, బరువు తగ్గడం వేరు. మనలో ఎక్కువ మంది బరువు తగ్గాలనుకుంటారు. కానీ, బరువు తగ్గరు. దీనికి కారణం వారు చేస్తున్న మిస్టేక్సే. అనుకోవడమైతే చేస్తున్నారు. కానీ, ప్రయత్న లోపం వల్ల బరువు తగ్గట్లేదు. దీంతో బరువు తగ్గాలనుకునేవారు కచ్చితంగా స్ట్రిక్ట్‌గా ఓ రొటీన్‌ని అనుకోవాలి. ఏం తినాలో, ఏం తినకూడదో అది కూడా ఏ టైమ్‌కి ఏం తినాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకుని స్ట్రిక్ట్‌గా ఫాలో అయితేనే, బరువు తగ్గడానికి ఈజీ అవుతుంది. దీనికోసం ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూట్రిషనిస్ట్ నేహా పరిహార్ మంచి డైట్‌ని సజెస్ట్ చేస్తున్నారు. ఆమె చెప్పినట్లుగా తింటే వారం రోజుల్లోనే కిలోకి పైగా బరువు తగ్గుతారు. అంతేకాదు, బెల్లీ ఫ్యాట్ కూడా ఉండదు. మరి, ఇంకేం కావాలి. ఎలాగూ క్రిస్మస్, న్యూ ఇయర్స్ ఉండనే ఉన్నాయి. ఆ టైమ్‌లోపు మీరు అనుకున్నట్లుగా బరువు తగ్గాలంటే ఆ డైట్ తెలుసుకోండి.

ఉదయాన్నే డీటాక్స్ డ్రింక్

ఉదయం లేవగానే ఏమైనా తాగాలనుకునేవారు డీటాక్స్ డ్రింక్‌తో మీ రోజుని మొదలుపెట్టండి. దీనికోసం మంచి హెర్బల్ డ్రింక్స్ అయినా ఉసిరి, పసుపు, నిమ్మరసం కలిపిన డ్రింక్ లేదా జీలకర్ర నీరు ఏదైనా తీసుకోవచ్చు. రెండు కూడా చక్కగా బాడీని డీటాక్స్ చేస్తాయి. దీంతో పాటు జీర్ణ సమస్యల్ని దూరం చేస్తాయి. బ్లోటింగ్‌ని తగ్గిస్తాయి.

బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తీసుకోవాలంటే

  • మూంగ్‌దాల్ చీలా 2 , పుదీనా చట్నీ అంటే పెసరపప్పుని మిక్సీ పట్టి దోశపిండిలా చేసి వాటిని దోశల్లా చేసుకుంటే చాలు. ఇలా కాకుండా ఆప్షన్ 2 కూడా ఉంది. అందులో..
  • బేసన్ చీలా, 100 గ్రాముల లో ఫ్యాట్ పనీర్‌ని స్టప్‌ని తీసుకోవచ్చు. దీనిని మీరు బ్లాక్ కాఫీ, అన్‌స్వీటెన్డ్ ఆల్మండ్ మిల్క్ టీతో తీసుకోవచ్చు. కేలరీలు అనేవి దీని వల్ల 250 నుంచి 300 గ్రాములు ఉంటాయి. ప్రోటీన్ 18 నుంచి 22 గ్రాములు ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. లో కార్బ్స్ ఉంటాయి. కడుపు నిండుగా ఉంటుంది.

మిడ్ మార్నింగ్‌లో ఏం తినాలంటే

  • ఓ ఆపిల్ లేదా కుకుంబర్, క్యారెట్ స్టిక్స్ 1 టీస్పూన్ చాట్ మసాలా వేసుకుని తినొచ్చు.
  • ఇందులో 50 కేలరీలు ఉంటాయి. నీరు అందుతుంది. ఫైబర్ కూడా దొరకుతుంది.
  • లంచ్‌లో తినాల్సిన ఫుడ్
  • 1 చిన్న గిన్నెలో మైసూర్ పప్పు లేదా కందిపప్పు
  • 1 మల్టీగ్రెయిన్ రోటీ లేదా అరకప్పు ఉడికించిన బ్రౌన్ రైస్
  • 1 కప్పు సాట్ చేసిన కూరగాయలు లేదా ఉడికించిన కూరగాయలు
  • 1 టేబుల్ స్పూన్ పెరుగు(ఆప్షనల్)
  • కేలరీలు 350 నుంచి 400 ఉంటాయి. దీని వల్ల గట్ హెల్త్ బాగుంటుంది.

ఈవెనింగ్ స్నాక్ టైమ్‌లో

  1. వేయించిన శనగలు 30 గ్రాములు, గ్రీన్ టీ
  2. ఆప్షన్ 2 : 150 గ్రాముల గ్రీక్ యోగర్ట్ కొద్దిగా దాల్చిన చెక్క పొడి చల్లి తినండి.
  3. ఇందులో కేలరీలు 150 నుంచి 180 కేలరీలు ఉంటాయి.
  4. ప్రోటీన్ 8 నుంచి 10 గ్రాములు ఉంటుంది.
  5. దీని వల్ల క్రేవింగ్స్, షుగర్ కంట్రోల్ కంట్రోల్ అవుతుంది.

డిన్నర్‌లో తినాల్సిన ఫుడ్

  • డిన్నర్ చాలా వరకూ 7 నుంచి 8లోపే చేయాలి.
  • దీనికోసం ఓట్స్, వెజ్ కిచిడి. లేదా క్వినోవా పనీర్ టిక్కి
  • ఇందులో మనకి 300 నుంచి 350 కేలరీలు, ప్రోటీన్ 20 గ్రాములు అందుతుంది.
  • కార్బ్స్ తక్కువగా ఉంటాయి. త్వరగా అరుగుతాయి. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.

డైట్‌తో బెనిఫిట్స్

  • ఈ డైట్ ఫాలో అయితే వారంలో కిలోకి పైగా తగ్గుతారు.
  • వారంలోపే బెల్లీ తగ్గుతుంది.
  • జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
  • కాన్పిడెన్స్ పెరుగుతుంది.
  • అన్నీ బట్టలు సూట్ అవుతాయి.
  • మెడిసిన్ లేకుండానే చాలా సమస్యలు తగ్గుతాయి.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Diet and Nutrition
  • Easy Weight Loss Tips
  • health tips
  • meal planning

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd