HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Investments In Ap Some People Seem To Be Burning Lokeshs Satires

Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 16-10-2025 - 12:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh Google Vizag
Nara Lokesh Google Vizag

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ పెట్టుబడుల్ని ప్రస్తావిస్తూ మంత్రి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ వంటకాలు ఘాటు ఎక్కువని అందరూ అంటారు. మన పెట్టుబడులు కూడా అంతే మరి. ఆంధ్రాకు వచ్చిన పెట్టుబడులకు కూడా కారం ఎక్కువే. ఇప్పటికే ఈ ఘాటు దెబ్బకు పొరుగువారికి ఆ సెగ తగులుతోంది అంటూ ట్వీట్ చేశారు.

 

మంత్రి లోకేశ్ పరోక్షంగా ఏపీకి పొరుగు రాష్ట్రమైన కర్ణాటకను ఉద్దేశించి ట్వీట్ చేసినట్లు చర్చ జరుగుతోంది. అలాగే మంత్రి లోకేష్ కర్ణాటక ప్రభుత్వ తీరుపైనా చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు. కర్ణాటకలో ప్రభుత్వ పనితీరు సరిగా లేకపోతే  తాను ఏమీ చేయగలనని.. అక్కడ మౌలిక వసతులు దారుణంగా ఉన్నాయని అక్కడి పారిశ్రామికవేత్తలే అంటున్నారని లోకేష్ చెప్పుకొచ్చారు. అక్కడి సమస్యల్ని పరిష్కరించుకుంటే మంచిది అన్నారు. అంతక ముందు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఏపీకి గూగుల్ డేటా సెంటర్ రావడంపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం గూగుల్ సంస్థకు భారీగా ప్రోత్సాహకాలు ఇచ్చిందని.. ఆ కంపెనీకి రూ.22,000 కోట్ల విలువైన సబ్సిడీలు, పన్నులు, యుటిలిటీ ఫీజుల మినహాయింపు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు.. అలాగే తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

 

They say Andhra food is spicy. Seems some of our investments are too. Some neighbours are already feeling the burn! 🌶️🔥 #AndhraRising #YoungestStateHighestInvestment

— Lokesh Nara (@naralokesh) October 16, 2025

 

విశాఖపట్నంను డేటా సెంటర్ల హబ్‌గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు మంత్రి లోకేశ్. ముఖ్యంగా, 6,000 మెగావాట్ల డేటా సెంటర్లను విశాఖకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. గూగుల్ సంస్థతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇది విశాఖ రూపురేఖలను మార్చబోతోందన్నారు. ఈ పెట్టుబడుల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థపై ఐదేళ్లలో రూ.48 వేల కోట్ల ప్రభావం ఉంటుందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రానికి 125 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని, కొత్త పెట్టుబడులపై మరింత దృష్టి సారిస్తున్నామన్నారు.

 

గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడి పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతోనే సాధ్యమైందని లోకేశ్‌ తెలిపారు. గత ఏడాది సెప్టెంబరులో గూగుల్ ప్రతినిధులు విశాఖపట్నం వచ్చినప్పుడు, డేటా సెంటర్ ఏర్పాటుకు తానే స్వయంగా స్థలాన్ని చూపించానని ఆయన చెప్పారు. ఆ తర్వాత, గూగుల్ బృందం భారత్‌లోని కొన్ని చట్టాలను సవరించాలని కోరగా, కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను పలుమార్లు కలిసి, గూగుల్ పెట్టుబడిపై ప్రధానితో రెండుసార్లు చర్చించిన తర్వాత చట్టాల్లో అవసరమైన సవరణలు జరిగాయని లోకేశ్‌ వివరించారు. గూగుల్ అనేక దేశాలు, రాష్ట్రాలను అధ్యయనం చేసి, ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తే బాగుంటుందని ఇక్కడికి వచ్చిందని, ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ఆయన పేర్కొన్నారు.

 

 

ఉత్తరాంధ్రలో భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. ఆర్సెలార్‌ మిత్తల్‌ వంటి పెద్ద ఉక్కు కర్మాగారాలు, గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్‌ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు, వైద్య పరికరాల ఉత్పత్తి, ఫార్మా కంపెనీలు వస్తున్నాయన్నారు. గ్రేటర్‌ విశాఖను ట్రిలియన్‌ డాలర్‌ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించి, సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తోంది. హైదరాబాద్‌ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే, విశాఖను పదేళ్లలోనే అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎంవోయూలు కాకుండా నేరుగా పనులు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aandhra pradesh
  • amaravathi
  • google
  • naralokesh
  • vizag
  • YsJagan
  • ysrcp

Related News

Chandrababu Naidu Lays Foun

Vizag : వైజాగ్ లో చంద్రబాబు శంకుస్థాపన చేసిన కంపెనీల వివరాలు

Vizag : విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలు రాష్ట్ర భవిష్యత్తుపై భారీ ఆశలు పెంచుతున్నాయి. కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.1,583 కోట్ల పెట్టుబడితో ఈ క్యాంపస్‌ను కాగ్నిజెంట్ సంస్థ నిర్మించనుంది

    Latest News

    • మీ కూరలో ఉప్పును తగ్గించే అద్భుతమైన చిట్కాలీవే!

    • కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?

    • ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • యువ ఆట‌గాళ్ల‌పై కాసుల వ‌ర్షం.. ఎవ‌రీ కార్తీక్ శ‌ర్మ‌, ప్ర‌శాంత్ వీర్‌?

    Trending News

      • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

      • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. ఏమిటీ ఆర్‌టీఎం కార్డ్? ఈ వేలంలో దీనిని వాడొచ్చా?

      • ఐపీఎల్ 2026 మినీ వేలం.. మరోసారి హోస్ట్‌గా మల్లికా సాగర్, ఎవ‌రీమె!

      • నేడు ఐపీఎల్ 2026 మినీ వేలం.. పూర్తి వివ‌రాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd