Independence Day 2023 : వైజాగ్ బీచ్ లో చంద్రబాబు
Independence Day 2023 : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పీ 4 ఫార్ములా ద్వారా విజన్ 2047ను అమలు చేయాలని చూస్తున్నారు.
- Author : CS Rao
Date : 15-08-2023 - 1:35 IST
Published By : Hashtagu Telugu Desk
Independence Day 2023 : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పీ 4 ఫార్ములా ద్వారా విజన్ 2047ను అమలు చేయాలని చూస్తున్నారు. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను తయారు చేశారు. పూర్ టూ రిచ్ అనే కాన్సెప్ట్ తో రాష్ట్రంలోని పేదలను కోటీశ్వరులుగా మార్చే ప్రక్రియను ఎంచుకున్నారు. ఇదే విషయాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ లో ఏర్పాటు చేసిన వేదిక న ఉంచి వివరించారు.
చంద్రబాబు విజన్ 2047 (Independence Day 2023)
ఇటీవల చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల కోసం మినీ మానిఫెస్టోను విడుదల చేశారు. అదో ట్రైలర్ మాత్రమే అంటూ టీడీపీ క్యాడర్ చెబుతోంది. రాబోయే రోజుల్లో ఫుల్ మేనిఫెస్టోలో చాలా అంశాలు ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే మహిళలను ఆకర్షించేందుకు పలు ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మూడు సిలెండర్లు, 18ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 వందలు, తల్లికి వందనం పేరుతో ఏడాదికి రూ. 15వేలు ప్రకటించారు. రైతుల కోసం ఏడాదికి రూ. 20వేలు ప్రకటించారు. బీసీల కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. పూర్ టూ రిచ్ ప్రోగ్రామ్ లో పీ 4 ఫార్ములాను (Independence Day) పరిచయం చేశారు. వీటి మీద విస్తృతంగా చర్చ జరిగేలా క్యాడర్ కు దిశానిర్దేశం చేయడం జరిగింది.
రూ. 500లు కూడా రద్దు చేయాలని డిమాండ్
ఇటీవల ఆజాదీకా అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ రోజున విజన్ 2047 గురించి ప్రస్తావించారు. అంతేకాదు, జీ 20దేశాల ప్రతినిధుల సభ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన అధిపతులను మోడీ ఆహ్వానించారు. ఆ సందర్భంగా చంద్రబాబు హాజరయ్యారు. అప్పుడు కూడా విజన్ 2047 గురించి మోడీతో చర్చించారు. రూ2వేల నోటును రద్దు చేయాలని పలుమార్లు చంద్రబాబు కోరారు. అంతేకాదు రాబోవు రోజుల్లో రూ. 500లు కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిజిటల్ కరెన్సీ ద్వారా అవినీతి, అక్రమాలు, బ్లాక్ మనీ లను తగ్గించడానికి (Independence Day) అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read : 77th Independence Day : ఎర్రకోట స్వాతంత్య్ర వేడుకుల్లో ఆ ఖాళీ కుర్చీ పైనే అందరి చూపు..
దేశంలో ఉండే వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే అంశం మీద చంద్రబాబు విజన్ 2047 రూపుదిద్దుకుంది. ప్రపంచంలోని ఏ దేశానికి లేనంత యువత ఉందని పదేపదే ఆయన చెబుతుంటారు. రాబోవు రోజుల్లో యువశక్తిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మార్చడానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందుకోసం ఏపీని మోడల్ గా తీసుకునేలా 2029 విజన్ ను రాష్ట్రానికి రూపొందించారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అడుగులు వేస్తేనే ప్రగతి అంటూ ఆయన చెబుతుంటారు. ఆ దిశగా అడుగులు వేసే చంద్రబాబు (Independence Day) ఇప్పుడు విజన్ 2047 దేశానికి విజన్ 2029 రాష్ట్రానికి రూపొందించడం చర్చనీయాంశంగా మారింది.
Also Read : Indian National Anthem : బ్రిటీష్ గడ్డపై మారుమోగిన భారత జాతీయ గీతం