HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Increase In Assembly And Lok Sabha Seats In Ap

Andhra Pradesh Assembly And Lok Sabha Seats: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపు..?

  • Author : Vamsi Chowdary Korata Date : 26-03-2026 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Andhra Pradesh Govt Set To Increase Assembly And Lok Sabha Seats
Andhra Pradesh Govt Set To Increase Assembly And Lok Sabha Seats

Andhra Pradesh Assembly And Lok Sabha Seats  ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల పెంపు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కేంద్రం 2029 ఎన్నికల నాటికి సీట్ల సంఖ్యను 50 శాతం పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ఢిల్లీలో సోమవారం జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఈ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ సీట్లు పెరిగితే ఏపీలో అసెంబ్లీ స్థానాలు 263, లోక్‌సభ స్థానాలు 38కి పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పెంపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా కేంద్రం అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలను ఏకంగా 50 శాతం పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సీట్ల పెంపునకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒకవేళ అదే జరిగితే లోక్‌సభ స్థానాలు 534 నుంచి 816కు చేరతాయంటున్నారు. ఇక అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం 4,123గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 6,185కు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

ఒకవేళ కేంద్రం అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచితే, ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే తెలంగాణలో ప్రస్తుతం 119 ఉన్న అసెంబ్లీ స్థానాలు 179కి చేరతాయని అంటున్నారు. ఇక లోక్‌సభ స్థానాల విషయానికి వస్తే, ఏపీలో ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలు ఉంటే, అవి 38కి పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా, అవి 26కు పెరిగే అవకాశం ఉంది. ఢిల్లీలో సోమవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో కేంద్రం ఈ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీతో కూడా ఈ అంశంపై కేంద్రం చర్చించబోతున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లు – జిల్లా వారీగా (ఇది ప్రస్తుత అంచనాల ఆధారంగా సిద్ధం చేసిన సమాచారం)

గ్రేటర్ రాయలసీమ (6 జిల్లాలు)

అనంతపురం 14➝21 (+7)

కర్నూలు 14➝21 (+7)

కడప 10➝15 (+5)

చిత్తూరు 14➝21 (+7)

నెల్లూరు 10➝15 (+5)

ప్రకాశం 12➝18 (+6)

మొత్తం: 74➝111 (+37)

గుంటూరు – కృష్ణా

గుంటూరు 17➝25 (+8)

కృష్ణా 16➝24 (+8)

మొత్తం: 33➝49 (+16)

గోదావరి జిల్లాలు (ఈస్ట్–వెస్ట్)

ఈస్ట్ గోదావరి 19➝28 (+9)

వెస్ట్ గోదావరి 15➝22 (+7)

మొత్తం: 34➝50 (+16)

ఉత్తరాంధ్ర

విశాఖ 15➝23 (+8)

విజయనగరం 9➝15 (+6)

శ్రీకాకుళం 10➝15 (+5)

మొత్తం: 34➝53 (+19)

ముఖ్య గణాంకాలు

మొత్తం సీట్లు: 175➝263 (+88)

మ్యాజిక్ ఫిగర్: 132

ప్రతిపక్ష హోదా: ~26

మంత్రివర్గంప్రస్తుతం: 26

పెంపు తర్వాత: 39 వరకు

పెరుగుదల: +13

ఎమ్మెల్సీలుప్రస్తుతం: 58

పెంపు తర్వాత: 87–88 వరకు

పెరుగుదల: +29/+30

ఎంపీలు (లోక్‌సభ)ప్రస్తుతం: 25

పెంపు తర్వాత: 37–38 (అంచనా)

పెరుగుదల: +12/+13

రాజ్యసభ ప్రస్తుతం: 11

అసెంబ్లీ సీట్లు పెరిగినా వెంటనే మార్పు ఉండదు

భవిష్యత్తులో జనాభా/డిలిమిటేషన్ ఆధారంగా మారే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి పెరుగుతూ మొత్తం 88 సీట్లు అదనంగా రానున్నాయి… ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 132 సీట్లు అవసరం… మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎంపీ సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది.

అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి వీలుగా కొన్ని సవరణలు చేయాల్సి వస్తోంది. అందుకే ముందుగా పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ చట్టం, డీలిమిటేషన్‌ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్రం డీలిమిటేషన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి సీట్ల పెంపుపై దృష్టి పెడుతుందంటున్నారు. 2029 నాటికి అన్ని పనులు పూర్తి చేసి.. వచ్చే ఎన్నికల నుంచి పెరిగిన సీట్లను అమలు చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ నియోజకవర్గాల సంఖ్య పెరిగితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి.

కేంద్రం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం 2023 సెప్టెంబరులో బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు 2034 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే నిబంధన ఉంది. కానీ 2027 మార్చి నాటికి జనగణన పూర్తి కానుండటంతో జనాభా లెక్కల వివరాలు ప్రాథమికంగా ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మొదలు పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.

అయితే జనగణన తర్వాత వచ్చే లెక్కల ఆధారంగా సీట్లను పెంచితే దక్షిణాది ప్రాంతానికి అన్యాయం జరుగుతుందనే వాదన కూడా ఉంది. అందుకే కేంద్రం అలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను 50 శాతం పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడు అన్ని రాష్ట్రాలకూ ఇబ్బందులు ఉండవనేది కేంద్రం సరికొత్త ఆలోచన. అందుకే అన్ని పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని సమాచారం. ఈ ప్రతిపాదనలపై చర్చించేందుకు ఇవాళ విపక్ష నేతలు సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సీట్ల పెంపు అంశంపై కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కసరత్తు మొదలు పెట్టినట్లు మాత్రమే సమాచారం అందుతోంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2029 Elections
  • andhra pradesh assembly
  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • Andhra Pradesh Goverment
  • AP election commission
  • Assembly And Lok Sabha Seats
  • Increase
  • narendra modi

Related News

Markapuram Road accident pm modi

Pm Modi: మార్కాపురం బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి

Markapuram ఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. “ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమా

  • CM Revanth Reddy, Nara Lokesh Visits Dhulipalla Narendra Daughter Wedding

    Dhulipalla Narendra Daughter Wedding: ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహానికి హాజరైన సీఎం రేవంత్, మంత్రి లోకేశ్

  • Central Government Resolve RDT Foreign Funding Issue

    Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరణ

  • Arcelor Mittal Steel Plant Foundation

    CM Chandrababu Naidu: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ బెస్ట్: సీఎం చంద్రబాబు నాయుడు

  • Kodali Nani

    Kodali Nani: 2029లో మళ్లీ ఆయనే సీఎం.. కూటమికి కొడాలి నాని మాస్ వార్నింగ్

Latest News

  • Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Anna Konidela: మెగా బ్రదర్స్ పై పవన్ భార్య ఎమోషనల్ కామెంట్స్!

  • BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

  • Bank Holidays: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్… నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌

  • Electricity Charges : విద్యుత్ ఛార్జీల విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Trending News

    • War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?

    • Petrol Shortage : సైకిళ్లకు ఫుల్ గిరాకీ !!

    • Balakrishna: బాలకృష్ణకు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

    • ఆట‌గాడిపై లైంగిక ఆరోప‌ణ‌లు.. ఆర్సీబీ ఏం చేసిందంటే?

    • ఐపీఎల్ 2026.. ఆట‌గాళ్ల‌కు కొత్త నిబంధ‌న‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd