HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >If There Is Any Government That Has Wiped Away The Tears Of The Farmer It Is Tdp Farmer

TDP : రైతు కన్నీళ్లు తుడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే..అది టీడీపీనే : ఓ రైతు

కొంతమంది ఓర్వలేక నాకు కరెంటు లైన్ రానివ్వకుండా అధికారులపై ఒత్తిడి పెట్టి తొమ్మిది నెలలుగా వేధించారు. పొలం ఎండిపోతోంది పుష్కలంగా నీళ్లు పడ్డాయి ఏమి చేయలేని నిస్సహాయతతో నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.

  • By Latha Suma Published Date - 01:42 PM, Thu - 13 February 25
  • daily-hunt
If there is any government that has wiped away the tears of the farmer, it is TDP: farmer
If there is any government that has wiped away the tears of the farmer, it is TDP: farmer

TDP : అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండలం వెంకటాపల్లి గ్రామానికి చెందిన రైతు కొరకుటి శ్రీనివాసులు కరెంట్‌ సమస్యపై ఏపీ ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించింది. ఈ క్రమంలోనే రైతు శ్రీనివాసులు ప్రభుత్వం తీరుపై మాట్లాడుతూ.. అయ్యా నమస్కారం.. నేను ఒక రైతుని. నాది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పాల మండలం వెంకట్రాంపల్లి గ్రామం. నేను 11 ఎకరాల్లో దానిమ్మ తోట వేశాను. నీళ్ల కోసం 48 బోర్లు వేస్తే చుక్క నీరు పడలేదు… చివరగా నా ఇంటి ముందు బోరు వేస్తే పుష్కలంగా నీళ్లు పడ్డాయి. నా ఆనందానికి అవధులు లేవు. విద్యుత్ కనెక్షన్ కొరకు అధికారులకు మొరపెట్టుకున్నాను. కానీ నేను ఒకటి తెలిస్తే కాలం మరోలా కలిసినట్టు నా పైన కక్ష కట్టి కొంతమంది ఓర్వలేక నాకు కరెంటు లైన్ రానివ్వకుండా అధికారులపై ఒత్తిడి పెట్టి తొమ్మిది నెలలుగా వేధించారు. పొలం ఎండిపోతోంది పుష్కలంగా నీళ్లు పడ్డాయి ఏమి చేయలేని నిస్సహాయతతో నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.

Read Also: Mohan Babu : సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట

ఆ సమయంలో ఆ నోట ఈ నోట చేరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కొంతమంది నా సమస్యపై స్పందించారు. మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరుగుతుంది మంచి జరుగుతుంది మీరు వెంటనే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజావేదిక జరుగుతుంది. అక్కడికి వెళ్లి మీ సమస్యను తెలియపరచండి. నారా లోకేష్ గా దృష్టికి వెళుతుంది. వెంటనే అధికారులతో మాట్లాడతారు మీ సమస్యపై స్పందిస్తారు. మీ సమస్య తీరుతుందనీ నాకు ధైర్యం చెప్పారు. నేను వెంటనే విజయవాడ కేంద్ర కార్యాలయానికి బయలుదేరాను. అప్పటికే నాకు ధైర్యం చెప్పిన కొంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అక్కడి నాయకులతో మాట్లాడి నా సమస్యను వారి దృష్టిలో పెట్టారు. అక్కడ వెళ్ళగానే నా సమస్యపై స్పందించిన మంత్రిగారు కొండపల్లి శ్రీనివాస్ మరియు గండి బాబ్జి గార్లు నా సమస్య విని నాకు ధైర్యం చెప్పి వెంటనే మా అనంతపురం జిల్లా కలెక్టర్ గారికి ఫోన్లు చేసి ఈ రైతు సమస్య పైన వెంటనే మీరు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి, పలువురు అధికారులకు ఆదేశించారు. నాకు కొంత ధైర్యం వచ్చింది.

Read Also:Bird Flu Chickens: చేపలకు మేతగా బర్డ్‌ఫ్లూ కోళ్లు.. మనిషికీ సోకిన ఆ వైరస్

కానీ ఎక్కడో కొంత బాధ. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇక ఇంటికి వెళ్లడం కన్నా ఇటు నుంచే వెళ్లిపోవాలని నేను నా కుటుంబం అనుకున్నాం. కానీ నా వెనకాల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి నిమిషానికి ధైర్యం చెబుతూ నాలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. సరే అని తిన్నగా ఇంటికి వెళ్లాను. మర్నాడు కలెక్టర్ గారి దగ్గరకు వెళ్లాను. కింద అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఇచ్చి మీ సమస్య తీరుతుంది ధైర్యంగా ఉండండి అని చెప్పారు. సరిగ్గా నాలుగు రోజులకి పోలీస్ అధికారులతో రెవెన్యూ అధికారులు ఎలక్ట్రికల్ అధికారులు అందరూ వచ్చారు వెంటనే నా మోటార్ బోర్ కనెక్షన్ కి విద్యుత్ లైన్ లాగడం మొదలుపెట్టారు. అప్పుడు నాకు కొండంత ధైర్యం వచ్చింది బతుకు మీద ఆశ కలిగింది. నా పొలానికి ఊపిరి వచ్చింది నా పైరుకి పచ్చదనం వచ్చింది.

Read Also:Rs 6000 Crore Dump: ఈ చెత్తకుప్పలో రూ.6,500 కోట్ల బిట్‌కాయిన్లు.. కొనేందుకు టెకీ రెడీ

నా ఆనందానికి అవధులు లేవు నేను నా కుటుంబం ఎంతో సంతోషించాం… నన్ను నా కుటుంబాన్ని నా పంటనే కాపాడిన నా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారికి లోకేష్ గారికి, నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు గారికి కొండపల్లి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే బాబ్జి గారికి మా కలెక్టర్ గారికి మా ఎమ్మెల్యే గారికి అధికారులకు అందరికీ పాదాభివందనం చేసుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను… ఒక రైతు సమస్య తెలియగానే ఇంత తొందరగా స్పందించి రైతు కన్నీళ్లు తుడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే నా 60 ఏళ్ల వయసులో ఒక తెలుగుదేశం పార్టీని మాత్రమే చూశాను. ఇది పేదల పార్టీ రైతుల పార్టీ శ్రామికుల పార్టీ కర్షకుల పార్టీ….. నా పార్టీ కి నా నాయకులకి మా కార్యకర్తలకి ఆజన్మాంతం రుణపడి ఉంటాం నేను నా కుటుంబం అన్నారు. అంతేకాకుండా బోరు దగ్గర మంత్రి గారి ఫోటో పెట్టుకుని పూజ చేసి.. బోర్ ఆన్ చేసుకున్నాను..అంటూ ఆనందం వ్యక్తం చేశారు. రైతు సమస్యలో ఉంటె స్పందించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడికి ఉంది. ఈ విషయాన్ని సాక్షాత్తూ నిరూపించిన వ్యక్తి మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఓ రైతు ఆర్థిక కష్టాల కారణంగా క్షోభ అనుభవిస్తున్న విషయం తెలుసుకున్న వెంటనే ఆయన స్పందించి, అతని సమస్యను పరిష్కరించారు. “ఓ రైతు కన్నీరు పెడితే దేశానికే నష్టం” అని భావించి, ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులను ధైర్యం చెబుతూ, తన సహాయాన్ని అందించారు.

మంత్రి శ్రీనివాస్ (Kondapalli Srinivas) చేసిన ఈ సహాయం పట్ల ఆ రైతు కుటుంబం కన్నీళ్లు పెట్టుకుని కృతజ్ఞతలు తెలియజేసింది. ఇది కేవలం ఆ కుటుంబానికి మాత్రమే కాక, యావత్ జిల్లా ప్రజలకు స్ఫూర్తిగా మారింది. నిజమైన నాయకుడంటే ఇలానే ఉండాలని, ప్రజలకు దగ్గరగా ఉండి వారి సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం కలిగి ఉండాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. శ్రీనివాస్ చూపిన చొరవను చూసి ప్రజలు ఆయనను ప్రశంసిస్తూ, “ఇలాంటి నాయకుడే మాకు కావాలి” అని గర్వంగా అంటున్నారు. ప్రజాసేవ అంటే హోదా కోసం కాక, ప్రజల మేలు కోసం పనిచేయడమేనని ఆయన నిరూపించారు. రైతులను అండగా నిలబడి, వారి సమస్యలను పరిష్కరించే శ్రీనివాస్ వంటి నాయకులు మరింత ఎక్కువైతే రైతుల భవిష్యత్తు మెరుగవుతుందనే నమ్మకం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

Read Also: Kalvakuntla Kavitha: జగిత్యాల సీటుపై కవిత ఫోకస్.. టార్గెట్ అసెంబ్లీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anantapur District
  • Atchannaidu
  • CM Chandrababu
  • farmer Srinivas
  • Lokesh
  • MLA Babji
  • Singanamala Constituency
  • TDP Government

Related News

Vizag It Capital

Investments in Vizag : విశాఖలో పెట్టుబడికి మరో సంస్థ ఆసక్తి

Investments in Vizag : ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం విస్తరణకు కొత్త ఊపిరి అందించేలా ప్రముఖ నిర్మాణ సంస్థ కె. రహెజా కార్ప్ విశాఖపట్నంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది

  • AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

    CM Chandrababu London : నవంబర్లో లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు

  • Modi Ap

    PM Modi AP Tour : ప్రధానికి ఘన స్వాగతం పలికిన చంద్రబాబు , పవన్

  • Lokesh Google

    Nara Lokesh Interesting Tweet : ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ – లోకేశ్

  • Lokesh Google

    Google : రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు – మంత్రి లోకేశ్

Latest News

  • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

  • Pradeep Ranganathan : డ్యూడ్ మూవీ రివ్యూ.!

  • Mallujola Venugopal : తుపాకీ వదిలిన ఆశన్న

  • Australia Series: ఆసీస్‌తో వ‌న్డే సిరీస్‌.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?!

  • Telangana Bandh : రేపటి బంద్ లో అందరూ పాల్గొనాలి – భట్టి

Trending News

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

    • Bigg Boss : దివ్వెల నోటికి రీతూ బ్రేకులు..!

    • IT Employees : ఐటీ ఉద్యోగులకు మంచి రోజులు.. HCL సహా ఈ కంపెనీలో పెరిగిన ఎంప్లాయీస్..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd