Mohan Babu : సుప్రీంకోర్టులో మోహన్‌బాబుకు ఊరట
హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో మోహన్‌బాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
- By Latha Suma Published Date - 12:10 PM, Thu - 13 February 25

Mohan Babu : సుప్రీంకోర్టులో నటుడు మోహన్‌బాబుకు ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడి కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జర్నలిస్ట్‌పై దాడి వ్యవహారంలో తెలంగాణ పోలీసులు మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు. దీంతో మోహన్‌బాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో మోహన్‌బాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది.
Read Also: PM Modi : అమెరికా చేరుకున్న ప్రధాని..ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
మోహన్ బాబు హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం వద్ద 2024 డిసెంబర్ 10న జర్నలిస్టుపై మైక్ తో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి మోహన్ బాబుపై పహాడిషరీఫ్ పోలీసులకు బాధిత జర్నలిస్టు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొదట ఆయనపై బీఎన్‌ఎస్ 118(1) సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత 109 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి.. హత్యాయత్నం కేసుగా మార్చారు.
ఈ క్రమంలోనే మోహన్ బాబు ఈ దాడి ఘటనలో గాయపడ్డ జర్నలిస్ట్‌కు క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు ఓ లేఖ కూడా విడుదల చేశారు. ఈ ఘటన తర్వాత అనారోగ్యం కారణంగా 48 గంటల పాటు ఆసుపత్రిలో చేరడంతో వెంటనే స్పందించలేకపోయా. ఆ రోజు నా ఇంటిగేటు విగిరిపోయింది.. దాదాపు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి చొచ్చుకొచ్చారని.. ఆ సమయంలో సహనాన్ని కోల్పోయినట్లు లేఖలో వివరించారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్ట్ సోదరుడు గాయపడటం నాకు బాధ కలిగించిందన్నారు. గాయపడ్డ జర్నలిస్ట్ త్వరగా కోలుకోవాలని మోహన్‌బాబు కాంక్షించారు. అతడికి, ఆయన కుటుంబానికి కలిగిన బాధకు తాను తీవ్రంగా చింతిస్తున్నట్లు చెప్పారు.
Read Also: Ranga Rajan : రంగరాజన్‌పై దాడి కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు