Madvi Hidma : ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ, అగ్రనేత హిడ్మా హతం.!
- By Vamsi Chowdary Korata Published Date - 12:02 PM, Tue - 18 November 25
మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ గుప్తా హిడ్మా మరణాన్ని ధ్రువీకరించారు. ఆయనపై దాదాపు రూ. కోటి రివార్డు ఉంది. హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.
నక్సల్ కంచుకోట కూలిపోయింది. భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మావోయిస్టు అగ్రనేత మాడ్వి హిడ్మా హతం అయ్యారు. ఈ మేరకు ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ కూడా చనిపోయారు. హిడ్మా మరణ వార్తను ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ధ్రువీకరించారు. పోలీసులు ధైర్యంగా ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని తెలిపారు. హిడ్మాపై దాదాపు రూ. కోటి రివార్డ్ ఉంది.
మంగళవారం (నవంబర్ 18) ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు అడవుల్లో మావోయిస్టుల కదలికలు పెరిగినట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. కూంబింగ్ నిర్వహించారు. అనంతరం మావోయిస్టులు కాల్పులు జరపగా.. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో హిడ్మా, హేమతో పాటు వీరికి సెక్యూరిటీగా ఉన్న నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు సమాచారం.
DEATH OF HIDMA!
Hidma carried a reward of ₹ One crore on his head and escaped many times.
Hidma’s wife also was gunned in this operation
In at least 5/6 instances police announced that Hidma was encountered and every time, the news turned out to be fake!
Hidma apparently… https://t.co/bYE5Axghfw pic.twitter.com/kBCaSCFM1Z
— Revathi (@revathitweets) November 18, 2025
BIG BREAKING!
HIDMA ENCOUNTEREDMaoist leader Madvi Hidma was killed in an encounter today morning
Police forces shot dead Hidma in an encounter in Maredumilli, Alluri district, Andhra Pradesh
The alleged encounter took place between police and Maoists around 6 am and… pic.twitter.com/EZoFXMFOZ4
— Revathi (@revathitweets) November 18, 2025
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన మాడ్వి హిడ్మా మురియా తెగకు చెందిన ఆదివాసీ. బాలసంఘం ద్వారా మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. విప్లవ భావాలను నరనరాన ఎక్కించుకున్న హిడ్మా.. మావోయిస్టులు నడిపే పాఠశాలలో విప్లవ అక్షరాలు దిద్దారు. కిషన్ జీ ఆలియాస్ భద్రన్న నేతృత్వంలో సాయుధ పోరులో అడుగులు వేశారు. ఆపై జేగురుగొండ ప్రాంత దళ కమాండర్‌గా ఉన్న సమయంలో, మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు.. ఆధ్వర్యంలో జరిగిన చింతల్నార్ –టేకుమెట్ల దాడిలో ముందుండి నడిచారు. ఈ దాడిలో 76 మంది సీర్‌ఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోయారు. దీంతో మావోయిస్టు పార్టీలో హిడ్మాకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత మరో అగ్రనేత చలపతి దగ్గర విప్లవ పాఠాలు నేర్చుకున్నారు మాడ్వి హిడ్మా. దాదాపు 25 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన హిడ్మా.. అప్పట్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడిగా ఉన్నాడు.
పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగానూ మాడ్వి హిడ్మా పనిచేశారు. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుపొందారు. ఇక మావోయిస్టు దళాల్లోకెల్లా అత్యంత శక్తిమంతమైన దళంగా హిడ్మా దళం పేరుపొందింది. భారీ దాడుల్లో పాల్గొంటూ భద్రతా దళాలకు మోస్ట్ వాంటెడ్ అయ్యారు. అనేక సార్లు భద్రతా దళాలకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నారు. అంతేకాకుండా మాడ్వి హిడ్మాకు తెలుగుతో పాటు మరి కొన్ని భాషలపై పట్టు ఉంది.