HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rains In These Districts Of Ap

Heavy Rains: ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

  • Author : Vamsi Chowdary Korata Date : 04-07-2026 - 9:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy rains in these districts of AP
Heavy rains in these districts of AP

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ, విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తున్నాయి. బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాబోయే రెండు, మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల మేఘావృతమైన వాతావరణంతో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది. తీరం వెంట ఈదురు గాలులు గంటకు 40-50 కిమీ వేగంతో వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

ఇటు తెలంగాణలో మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలిక నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.

విపత్తు నిర్వహణలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లాకు చెందిన 100 మంది నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) వాలంటీర్లకు ‘యువ ఆపదమిత్ర’లుగా విజయవంతంగా శిక్షణ ఇచ్చారు. ఫైర్ సేఫ్టీ (అగ్ని ప్రమాదాల నివారణ), విపత్తుల ముందస్తు జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై అవగాహన కల్పించారు. ఈ శిక్షణ ద్వారా వాలంటీర్లలో విపత్తు నిర్వహణ సంసిద్ధత, అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించే ప్రాక్టికల్ నైపుణ్యాలు గణనీయంగా పెరిగాయి. విపత్తుల సమయంలో తమ ప్రాంత ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఈ శిక్షణ ఈ యువ ఆపదమిత్రులకు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh heavy rains
  • heavy rains
  • Heavy Rains Alert
  • heavy rains Andhra Pradesh
  • Heavy rains in AP
  • Heavy rains in Telugu states
  • Heavy Rains In These States

Related News

Heavy rains in these districts of AP

Heavy Rains: ఏపీలో వారం రోజుల పాటు భారీ వర్షాలు

ఏపీలో మరో వారం రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల మూడో తేదీన అంటే శుక్రవారం నాటికి వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉత్తర కోస్తా జిల్లాలలో మోస్తరు వానల నుంచి భారీ వర్షాలు కురిసే అవ

  • Telangana Rain Alert, telangana heavy rain alert, Rain Alert Today, Rain Alert Telangana, rain alert, IMD Rain Alert, Hyderabad Rain Alert, Heavy Rain Alert, weather report, Telangana Weather Report,  IMD weather report, 

    Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం

  • Huge good news from the Revanth government for Telangana employees.

    Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

Latest News

  • కార్మిక శాఖ పేరులో మార్పు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. ఇకపై ‘శక్తి’ శాఖగా

  • Isakapatnam: ఓటీటీలోకి వచ్చేసిన మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఇసాకపట్నం’

  • vaibhav suryavanshi: నేడు భారత్-ఇంగ్లాండ్ రెండో టీ20లో.. వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం.!

  • Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

  • Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd