HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >He Will Be Cm Again In 2029 Kodali Nani Issues A Mass Warning To The Alliance

Kodali Nani: 2029లో మళ్లీ ఆయనే సీఎం.. కూటమికి కొడాలి నాని మాస్ వార్నింగ్

  • Author : Vamsi Chowdary Korata Date : 23-03-2026 - 12:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kodali Nani
Kodali Nani

Kodali Nani  కూటమి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్ జగన్ విలువ ఏపీ ప్రజలకు తెలుస్తుందని.. 2029లో జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కూటమి సహా ఎవరూ దీన్ని ఆపలేరన్నారు. 2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేమని చెప్పిన విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు.

2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విలువ ఏంటో తెలిసిందని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. జగన్‌ను అనవసరంగా వదులుకున్నామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారని.. ఆయన ఉంటేనే తమకు మంచి జరుగుతుందని పేద వర్గాలు భావిస్తున్నాయని చెప్పుకొచ్చారు. 2029 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునే సత్తా కూటమికి లేదని.. వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడానికి చెల్లెళ్లను రోడ్డుపైకి తీసుకొచ్చి అనవసరమైన నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి చనిపోతే ఆస్తిలో వాటాలు ఇచ్చేవారిని ఇప్పటి వరకు చూశామని.. కానీ తన సొంత ఆస్తిలో కూడా వాటాలు ఇచ్చిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ ప్రశంసించారు. జగన్ తన చెల్లెళ్ల గురించి ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని.. కానీ వారు మాత్రం జగన్ గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి మొట్టికాయలు వేశాడని.. కూటమి నేతల పరువు పోయిందని నాని అన్నారు. కానీ ఆ దేవుడి దయ, ప్రజల సహకారంతో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని.. కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారని.. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎన్నికల హామీలు కాకపోయినా, మేనిఫెస్టోలో లేకపోయినా అమలు చేశారన్నారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తామంటూ.. 2014 ఎన్నికల్లో మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాయ మాటలు చెప్పారన్నారు.

2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని.. తాను, పేర్ని నాని మనం కూడా రుణాలు మాఫీ చేద్దామని జగన్‌ను కోరామని కొడాలి నాని అన్నారు. కానీ తమ మాట వినలేదని.. చంద్రబాబు చెప్పే హామీలు నెరవేర్చాలంటే ఏకంగా రూ.1.25 లక్షల కోట్లు కావాలని వైఎస్ జగన్ తమతో చెప్పారని.. ఆ హామీలు అమలు చేయడం కుదరదని అప్పుడే తేల్చి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రూ.1.25 లక్షల కోట్లతో రుణాలు మాఫీ చేసేంత ఆదాయం ఎక్కడ ఉందని ఆ రోజే జగన్ తమను ప్రశ్నించారన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇస్తే, మోదీ తాను చూసుకుంటానని చెప్పారు, పవన్ కళ్యాణ్ తాను ప్రశ్నిస్తాను అన్నారు.. జనాలు కూడా నమ్మి ఓటు వేశారన్నారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, డ్వాక్రా మహిళల్ని మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు మాత్రం ఐదేళ్లు అధికారాన్ని అనుభవించారని.. 2019 ఎన్నికల్లో ఆయన చేసిన మోసాన్ని తెలుసుకుని వైఎస్ జగన్‌కు ఓటేశారని మాజీ మంత్రి నాని అన్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్ అంటూ కొడాలి నాని ప్రశంసించారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా వైఎస్ జగన్ పేద ప్రజలకు అండగా నిలబడ్డారన్నారు. 2024లో జగన్‌ను ఓడించడానికి దొంగలంతా కలిశారని.. జగన్ కంటే ఎక్కువ హామీలు అంటూ సూపర్ సిక్స్ పేరు చెప్పి కూటమి అధికారంలోకి వచ్చిందన్నారు. జగన్ చేసిన కార్యక్రమాల వల్ల జనాలు 2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని ఓడించారని ప్రచారం చేస్తున్నారని.. కానీ చంద్రబాబు ఇచ్చిన దొంగ హామీల వల్ల జగన్ ఓడిపోయారన్నారు.

జగన్ చేసిన మంచి పనుల వల్ల వైఎస్సార్‌సీపీలో ఉన్న ప్రతీ కార్యకర్త కాలర్ ఎగరేసుకుని ఇప్పటికీ తిరుగుతున్నారని అన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అడ్డగోలు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని ధ్వజమెత్తారు. అయితే 2024 ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నారని కూటమి పార్టీల నేతలే చంద్రబాబును విమర్శించే పరిస్థితులు వచ్చాయని కొడాలి నాని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh CM Chandrababu Naidu
  • andhra pradesh politics
  • AP Deputy CM Pawan kalyan
  • Ex minister Kodali nani
  • Kodali Nani Strong Counter
  • Kutami Government
  • ys jagan
  • YSR Congress Party

Related News

Roja Energetic Dance in Perambur Gaana Song from Tamil Movie

Roja: తమిళ సాంగ్‌లో మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రోజా!

Roja తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పుడు సీనియర్ నటీమణుల రీ-ఎంట్రీ ట్రెండ్ నడుస్తోంది. శోభన వంటి నటీమణుల బాటలోనే, ఇప్పుడు మాజీ మంత్రి రోజా కూడా మళ్లీ మేకప్ వేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూ తమిళ సినిమాలకు దూరమైన రోజా… 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో తమిళ తంబీలను అలరించేందుకు సిద్ధమయ్యారు. Perambur Gaana from #AnbeDianapic.twitter.com/wM3Vk0yqPL — Timelessvoice (@Timelessvoice81) March 21, 2026 ప్రస్తుతం కోలీవుడ్‌ల

  • Ustaad Bhagat Singh Collection

    Ustaad Bhagat Singh: 2వ రోజు భారీగా పడిపోయిన ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్స్

  • Vijayasai Reddy Organic Farming

    Vijayasai Reddy Organic Farming: ‘జీవామృతం’ తయారు చేసి ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించాలి : విజయసాయిరెడ్డి

  • Nara Devansh Birthday

    Chandrababu Naidu Family Tirumala Darshan: శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం

  • Nara Lokesh Tweet

    Nara Lokesh: పూజ గదిలో బొమ్మపై క్లారిటీ ఇచ్చిన మంత్రి నారా లోకేశ్‌

Latest News

  • యుద్ధంపై ప్ర‌ధాని మోదీ కీల‌క వ్యాఖ్య‌లు!

  • ఐపీఎల్ 2026.. ఉచితంగా మ్యాచ్‌లు చూసేందుకు సిద్ధమవ్వండి!

  • Madhira: మధిర కోల్డ్‌ స్టోరేజ్‌లో రెండో ఛాంబర్‌కు వ్యాపించిన మంటలు

  • Putta Sudhakar Yadav: నా కొడుకు మహేష్ కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్

  • Income Tax: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుంది.

Trending News

    • Gold Price: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. పడిపోతున్న బంగారం ధరలు

    • మ‌రోసారి లాక్ డౌన్ త‌ప్ప‌దా?!

    • భారీగా పెర‌గ‌నున్న ఉద్యోగుల జీతాలు?!

    • ఎల్‌పీజీపై కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌!

    • Mumbai: ముంబై బీచ్‌లో వింత బిజినెస్.. చిన్న బాధలైతే రూ.250.. వెయ్యిస్తే కలిసి ఏడుస్తా..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd