HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Harsh Punishment For Ravi The Housewife What Did His Father Say

iBOMMA : ఇమ్మడి రవికి కఠిన శిక్షలు..? అతని తండ్రి ఏమన్నాడంటే..!

  • Author : Vamsi Chowdary Korata Date : 17-11-2025 - 3:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Immadi Ravi Father Apparao
Immadi Ravi Father Apparao

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవి అరెస్ట్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవిని ఇటీవల అరెస్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ కింద అతనిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్నారు. మరోవైపు ఇమ్మడి రవి సొంతూరు విశాఖపట్నం. అతని తండ్రి అప్పారావు బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి అరెస్ట్ మీద ఆయన స్పందించారు. బంధువులు చెప్తేనే తనకు విషయం తెలిసిందన్నారు. 15 ఏళ్ల కిందట రవి విశాఖ నుంచి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు.

ఇమ్మడి రవి .. ఈ పేరంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ ఐబొమ్మ ఓనర్, బప్పమ్ టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవి అంటే అందరికీ తెలిసిపోతుంది. పైరసీ సినిమాలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయ్యింది ఐబొమ్మ . అయితే ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నం.. బీఎస్సీ కంప్యూటర్స్ వరకూ చదివారు. ఇమ్మడి రవి తండ్రి పేరు అప్పారావు. బీఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి. ఇమ్మడి రవి నేపథ్యంలో.. ఆయన తండ్రి అప్పారావు స్పందించారు. తనను అరెస్ట్ చేసిన సంగతి బంధువులు చెప్తే తెలిసిందన్నారు.

“15 ఏళ్ల క్రితం విశాఖపట్నం నుంచి వెళ్లిపోయాడు. అయితే ఇలాంటి వెధవ పనులు చేస్తాడని అనుకోలేదు. డిగ్రీ వరకూ చదివించాను. ఆ తర్వాత తన బ్రతుకు తాను బతుకుతున్నాడని అనుకున్నా. ఆస్తులు ఎక్కువగా లేవు. అతని బతుకు అతనిది.. నా బతుకు నాది. నాకు వచ్చే పెన్షన్ డబ్బులతో బతుకున్నా. విశాఖ నుంచి వెళ్లిపోయిన తర్వాత ఏ దేశాలకు వెళ్లాడనేది తెలియదు. హైదరాబాద్‌లో ఉన్నాడని తెలుసు. కొన్ని రోజులకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఏమైందో విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకునేటప్పుడు చెప్పారు. అంత వరకే తెలుసు. రవి చేసింది వెధవ పని.. రవి చేసిన పనికి బాధపడటం తప్ప ఇంకేం చేయగలం.” అంటూ అప్పారావు తన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఇమ్మడి రవికి చట్టం ప్రకారం శిక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్మడి రవికి విధించే శిక్షల గురించి అతని తండ్రి అప్పారావు స్పందించారు. ” మావాడు చేసిందే తప్పు. ప్రభుత్వాన్ని సవాల్ చేస్తే.. వాళ్లు కళ్లు మూసుకుని ఉంటారా.. మావాడు చేసిన తప్పుకు చట్టం ప్రకారం రూల్స్ ఎలా ఉంటే అలా శిక్ష వేస్తారు.. నేను శిక్షించమని చెప్పను. వదిలేయమని కోరను. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ మా వద్దకు రాలేదు. రెండేళ్ల కిందట ఓసారి వచ్చాడంతే” అని అప్పారావు చెప్పారు. మరోవైపు తనకు వచ్చే పెన్షన్ డబ్బులతోనే తాను బతుకుతున్నట్లు ఆయన చెప్తున్నారు.

మరోవైపు ఇమ్మడి రవి మీద ఐటీ యాక్ట్‌, కాపీ రైట్‌ యాక్ట్‌ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు ఇమ్మడి రవి పైరసీ ద్వారా సినీ ఇండస్ట్రీకి నష్టం చేయడంతో పాటుగా.. బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్నాడని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. మొత్తం 65 మిర్రర్‌ వెబ్‌సైట్లను ఇమ్మడి రవి రూపొందించినట్లు తెలిపారు. 21 వేల సినిమాలు ఇమ్మడి రవి హార్డ్ డిస్కులో ఉన్నాయని.. పైరసీ ద్వారా రూ.20 కోట్లు సంపాదించాడన్నారు. అతని వద్ద 50 లక్షల మంది సమాచారం ఉందని వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Apparao
  • iBOMMA
  • Immadi Ravi
  • tollywood
  • Visakhapatnam

Related News

Launch of Ram Pothineni's new movie as hero and director.

RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన 23వ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. RAPO23 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ ఈ కార్యక్రమానికి హాజరై క్లాప్ కొట్టగా, రామ్ తండ్రి మురళీ పోతినేని కెమెరా స్విచ్ ఆన్ చేసి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ చిత్రాన్ని రామ్ సోదరుడు కృష్ణ

  • Good news for NTR fans: Time fixed for the 'God of War' announcement.

    NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

Latest News

  • Spirituality: లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మీకు తెలుసా?

  • ప్రాణం తీసిన కొబ్బరి బొండం

  • Relationship: శృంగారం చేసిన తర్వాత పురుషులు ఏమనుకుంటారో తెలుసా?

  • Owaisi college: ఒవైసీ విద్యాసంస్థపై హైకోర్టు సీరియస్!

  • Prakash Raj: రావణ్ మళ్ళీ మళ్ళీ అరెస్ట్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd