JC Prabhakar Reddy : ‘‘నేను మాట్లాడింది తప్పే..’’ నటి మాధవీలతకు జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణలు
డిసెంబరు 31వ తేదీన తాడిపత్రిలోని జేసీ పార్కు(JC Prabhakar Reddy)లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవీలతతో పాటు, బీజేపీ నాయకురాలు సాధినేని యామిని తొలుత కామెంట్స్ చేశారు.
- Author : Pasha
Date : 05-01-2025 - 4:44 IST
Published By : Hashtagu Telugu Desk
JC Prabhakar Reddy : అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వెనక్కి తగ్గారు. సినీనటి మాధవీలతపై ఇటీవలే తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యల అంశంలో ఇవాళ కీలక ప్రకటన చేశారు. ‘‘నేను ఆవేశంలో అలా మాట్లాడటం తప్పే. మాధవీలతకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నా’’ అని జేసీ ప్రభాకర్‌రెడ్డి వెల్లడించారు. ‘‘నేను మాధవీలతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా. సారీ చెబుతున్నా’’ అని ఆయన తెలిపారు. ఇవాళ తాడిపత్రిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేసీ ప్రభాకర్ మాట్లాడారు. ‘‘మాధవీలత, సాధినేని యామినిలను కించపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు’’ అని ఆయన తేల్చిచెప్పారు.
Also Read :Vijay Hazare Trophy : విజయ్ హజారే ట్రోఫీ.. హైదరాబాద్ టీమ్‌కు మరో విజయం
‘‘నేను పార్టీ మారాలని కొంతమంది విమర్శిస్తున్నారు. పార్టీ మారమని నాకు చెప్పే హక్కు ఎవరికీ లేదు. డిసెంబరు 31న నన్ను నమ్మి 16 వేల మంది అక్కచెల్లెళ్లు జేసీ పార్క్‌కు వచ్చారు. నాగురించి మాట్లాడిన రాజకీయ నాయకులంతా ఫ్లెక్సీ గాళ్లే’’ అని జేసీ వ్యాఖ్యానించారు. ‘‘మా తాడిపత్రి కోసం ఎంత దూరమైనా వెళ్తా. రెండు సంవత్సరాల్లో తాడిపత్రి రూపురేఖలు మార్చి తీరుతా. గత మున్సిపల్ ఎన్నికల్లో గెలవడమే.. ప్రజలు నావైపు ఉన్నారని చెప్పడానికి ప్రూఫ్’’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇంతటితోనైనా ఈ వివాదం ముగుస్తుందా లేదా అనేది వేచిచూడాలి.
Also Read :Sankranti Special Trains : సంక్రాంతి స్పెషల్.. తెలుగు రాష్ట్రాలకు 52 అదనపు రైళ్లు
అసలేం జరిగింది అంటే..
డిసెంబరు 31వ తేదీన తాడిపత్రిలోని జేసీ పార్కు(JC Prabhakar Reddy)లో మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవీలత తొలుత కామెంట్స్ చేశారు. ఈ వేడుకలకు మహిళలు వెళ్లొద్దంటూ మాధవీ లత పిలుపునిచ్చారు. ‘‘గంజాయి బ్యాచ్‌లు ఉంటాయి. దాడులు చేస్తే ఎవరిది బాధ్యత ?’’ అని ఆమె ప్రశ్నించారు. దీనిపై అప్పట్లో జేసీ ప్రభాకర్‌రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘‘మాధవీలత ఒక వ్యభిచారి.. ఆమెను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై తదుపరిగా మాధవీలతతో పాటు బీజేపీ నాయకురాలు సాధినేని యామిని స్పందించారు. జేసీ అసభ్యంగా మాట్లాడారంటూ మాధవీలత భగ్గుమన్నారు. “వయసైపోయిన మనిషి మాట్లాడిన భాషకు ధన్యవాదాలు. ఆయనకు సపోర్ట్ చేస్తున్నవారికి సంతాపం” అని ఆమె ఎద్దేవా చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడినందుకు జేసీపై చర్యలు తీసుకోవాలన్నారు.