Sankranti Special Trains : సంక్రాంతి స్పెషల్.. తెలుగు రాష్ట్రాలకు 52 అదనపు రైళ్లు
అందుకే ఏపీలోని కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలను(Sankranti Special Trains) కనెక్ట్ చేసేలా ఈ అదనపు రైళ్లను ప్రకటించారు.
- Author : Pasha
Date : 05-01-2025 - 3:29 IST
Published By : Hashtagu Telugu Desk
Sankranti Special Trains : సంక్రాంతి పండుగ సందర్భంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరగనుంది. ఇందుకోసం ఇప్పటికే వందలాది స్పెషల్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అనౌన్స్ చేసింది. అయితే తాజాగా మరో 52 అదనపు రైళ్లను నడుపుతామని ప్రకటించింది. ఈ రైళ్లు హైదరాబాద్ మహా నగరంలోని సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి రైల్వేస్టేషన్ల నుంచి కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలకు నడుస్తాయని వెల్లడించింది. జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఈ 52 అదనపు రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎక్కువ సంఖ్యలో నివసిస్తుంటారు. సంక్రాంతి పండుగ సెలవులు ఉండటంతో వారంతా రైళ్లలో సొంతూళ్లకు తరలి వెళ్తుంటారు. అందుకే ఏపీలోని కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలను(Sankranti Special Trains) కనెక్ట్ చేసేలా ఈ అదనపు రైళ్లను ప్రకటించారు.
Also Read :Prashant Kishor : తేజస్వి పెద్ద నేత.. ఆయనొస్తే నేను తప్పుకుంటా.. పీకే కీలక వ్యాఖ్యలు
అదనంగా నడపనున్న 52 రైళ్ల వివరాలివీ..
- జనవరి 6న చర్లపల్లి-తిరుపతి రైలు
- జనవరి 7న తిరుపతి-చర్లపల్లి రైలు
- జనవరి 8,11,15 తేదీల్లో చర్లపల్లి -తిరుపతి రైలు
- జనవరి 9, 12, 16 తేదీల్లో తిరుపతి-చర్లపల్లి రైలు
- జనవరి 13న వికారాబాద్-కాకినాడ టౌన్ రైలు
- జనవరి 14న కాకినాడ టౌన్-చర్లపల్లి రైలు
- జనవరి 9, 16 తేదీల్లో కాచిగూడ – తిరుపతి రైలు
- జనవరి 10, 17 తేదీల్లో తిరుపతి-కాచిగూడ రైలు
- జనవరి 11, 18 తేదీల్లో చర్లపల్లి-నర్సాపూర్ రైలు
- జనవరి 12,19 తేదీల్లో నర్సాపూర్-చర్లపల్లి రైలు
- జనవరి 12, 19 తేదీల్లో కాకినాడ టౌన్-సికింద్రాబాద్ రైలు
- జనవరి 12, 19 తేదీల్లో కాకినాడ టౌన్-సికింద్రాబాద్ రైలు
- జనవరి 7,9, 13, 15, 17 తేదీల్లో చర్లపల్లి-నర్సాపూర్ రైలు
- జనవరి 8, 10, 14, 16, 18 తేదీల్లో నర్సాపూర్- చర్లపల్లి రైలు
- జనవరి 8, 10, 12, 14 తేదీల్లో చర్లపల్లి-కాకినాడ టౌన్ రైలు
- జనవరి 9, 11, 13, 15 తేదీల్లో కాకినాడ టౌన్ – చర్లపల్లి రైలు
- జనవరి 6, 13 తేదీల్లో నాందేడ్ – కాకినాడ టౌన్ రైలు
- జనవరి 7, 14 తేదీల్లో కాకినాడ టౌన్ – నాందేడ్ రైలు
- జనవరి 9, 12, 14 తేదీల్లో చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్ రైలు
- జనవరి 10, 13, 15 తేదీల్లో శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి రైలు
- జనవరి 7న కాచిగూడ – శ్రీకాకుళం రోడ్ రైలు
- జనవరి 8న శ్రీకాకుళం రోడ్ – కాచిగూడ రైలు