Govt Royal Seal : పాసు పుస్తకాల పై ప్రభుత్వ రాజముద్ర ఉండాలి: సీఎం చంద్రబాబు ఆదేశం
పాసు పుస్తకం చూడగానే రైతుల్లో భరోసా కలగాలి.. భూ ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశం.
- Author : Latha Suma
Date : 29-07-2024 - 6:17 IST
Published By : Hashtagu Telugu Desk
Govt Royal Seal: ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఈరోజు రెవెన్యూ శాఖ(Revenue Department) పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో రెవెన్యూ శాఖ ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. భూ యజమానులకు ఇచ్చే పట్టాదారు పాసు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాటిపై పార్టీల రంగులు, నేతల ఫొటోలు ఉండకూడదన్నారు. ప్రభుత్వ రాజముద్రతో పాసు పుస్తకాల నమూనాను విడుదల చేశారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం లాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా? ఎటువంటి చట్టాలు తేవాలి? అనే అంశాలపై చర్చించారు.
We’re now on WhatsApp. Click to Join.
అనంతరం మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రైతులకు కొత్త పాస్ పుస్తకాలు వస్తాయని తెలిపారు. కొత్త పాస్ పుస్తకాల్లో క్యూ ఆర్ కోడ్ ముద్రణ ఉంటుంది. యజమాని, భూమి వివరాలతో కొత్త పాస్ పుస్తకాలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు రూ.20కోట్ల ఖర్చుతో కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా భూములపై అత్యధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ ల్యాండ్ ల అక్రమాలు చోటు చేసుకున్నాయి. భూసర్వే పేరుతో 77 లక్షల రాళ్లు పాతారని అదికారులు చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎన్నివేల ఎకరాల వరకు వెళ్లిందని ఆరా తీస్తున్నాం. ఐదేళ్లలో తీసుకొచ్చిన చట్టాలు.. అవి దుర్వినియోగం అయిన తీరుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షలో చర్చించినట్టు వెల్లడించారు మంత్రి అనగాని. కొత్త పాస్ పుస్తకం చూడగానే రైతుల్లో భరోసా కలగాలని సీఎం చంద్రబాబు తెలిపినట్టు మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
Read Also: Dog Meat : హమ్మయ్య..బెంగుళూర్ వాసులు ఊపిరి పీల్చుకోవచ్చు