AP Assembly : అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన కూటమి ప్రభుత్వం
బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాల అమలకుకు నిధులు కేటాయించలేదని.. కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు.
- By Latha Suma Published Date - 03:34 PM, Wed - 13 November 24

Ap government : కూటమి ప్రభుత్వం ఏపీ అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఏపీ పంచాయతీ రాజ్ బిల్లు-2024, ఏపీ మున్సిపల్ బిల్లు-2024 బిల్లులను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఇక శాసన మండలిలో బడ్జెట్ పై చర్చించారు. బడ్జెట్ లో సూపర్ సిక్స్ పథకాల అమలకుకు నిధులు కేటాయించలేదని.. కనీసం స్పష్టత కూడా ఇవ్వలేదని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని అడిగితే లక్ష కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని చెబుతున్నారని పేర్కొన్నారు.
అంతేకాక..సూపర్ సిక్స్ పథకాల ప్రకటనలు చేసేటప్పుడు అప్పులు గుర్తుకు రాలేదా..? అని ప్రభుత్వాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. అయితే శాసనమండలిలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీల ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామిని నిలబెట్టుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి 15వేల కోట్ల గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ మండలిలో ప్రకటించారు. 15వేల కోట్ల రూపాయలు లోన్ కాదని.. కేంద్ర ప్రభుత్వం లోన్ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్ గా ఇస్తుందని స్పష్టం చేసారు. మరో వైపు శాసనమండలి రేపటికి వాయిదా పడింది.