Ear Pain: చెవి నొప్పి భరించలేకపోతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!
చెవి నొప్పి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వారు కొన్ని రకాల సింపుల్ టిప్స్ ని ఫాలో అయితే ఆ నొప్పి నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 03:30 PM, Wed - 13 November 24

మామూలుగా కొందరికి చెవి నొప్పి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ చెవి నొప్పి కారణంగా కొందరు సరిగా తినలేరు తాగలేరు కూడా. కొన్ని కొన్ని సార్లు ఈ నొప్పి భరించలేని విధంగా ఉంటుంది. అప్పుడప్పుడు చెవిలో చీము వంటిది వచ్చి చెవి నొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే దీనికి వెల్లుల్లి మంచి సహజ ఔషధంగా పనిచేస్తుందట.వెల్లుల్లిలో ఉండే బలమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ తో పోరాడి చెవి నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చని చెబుతున్నారు. మరి ఇందుకోసం ఏం చేయాలి అన్న విషయానికొస్తే..
ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొబ్బరి నూనె లో వేసి నూనె ఎర్రగా అయ్యేవరకు వేడి చేయాలి. ఇప్పుడు కొద్దిగా చల్లబడిన తర్వాత చెవి నొప్పిని వదిలించుకోవడానికి ఈ నూనెను ఒకటి రెండు చుక్కలు చెవిలో వేయాలి. ఇది ప్రాచీన కాలం నుంచి ఉపయోగిస్తున్న పద్ధతి. ఇప్పటికీ చెవి నొప్పి వచ్చినప్పుడు పల్లెటూర్లలో ఈ వైద్యాన్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. అలాగే మరొక పద్ధతిలో ఒక రోకలితో ఒక వెల్లుల్లి రెబ్బని చూర్ణం చేయాలి. ఆ చూర్ణాన్ని ఒక కాటన్ లో చుట్టాలి. ఏ చెవి అయితే నొప్పి పెడుతుందో ఆ చెవిలో ఈ కాటన్ బాల్ ని మెల్లగా లోపలికి చొప్పించి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ చూర్ణం రసం చెవి లోపలికి వెళ్ళింది అని మీకు అనిపించిన వెంటనే ఆ కాటన్ బాల్ ని తీసేయాలి.
ఇలా చేయటం వలన చెవి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చును. అలాగే ఒక వస్త్రంలో దంచిన వెల్లుల్లి రెబ్బలు మూడు, చిటికెడు ఉప్పు వేసి నొప్పిగా ఉన్న చెవి మీద ఉంచాలి. ఇలా చేయడం వలన చెవి పోటు, చెవి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఇవి తాత్కాలికమైన చెవి నొప్పులకి మాత్రమే. నొప్పి తీవ్రతను బట్టి మీరు వైద్యుడిని సంప్రదించడం మంచిది. నొప్పి మరింత ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే సంబంధిత డాక్టర్ ని సంప్రదించడం మంచిది అని చెబుతున్నారు.