HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News From The Government For Those In Ap Backlog Posts Are Being Filled

Andhra Pradesh Government : ఏపీలో వారికి ప్రభుత్వం శుభవార్త.. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ!

  • By Vamsi Chowdary Korata Published Date - 11:15 AM, Sat - 15 November 25
  • daily-hunt
Andhra Pradesh Government
Andhra Pradesh Government

దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పురపాలక శాఖ చర్యలు చేపట్టింది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చిన కేసులో ముగ్గురు మాజీ కమిషనర్లతో సహా 43 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యా్తంగా వివిధ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తాజాగా గడువును ప్రభుత్వం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి గతేడాది మార్చి 31తో ఈ గడువు ముగియగా.. తాజాగా దాన్ని 2026 మార్చి 31 వరకు పొడిగించారు. అంటే పోస్టుల భర్తీకి కాలపరిమితి మరో ఏడాది పెంచారు. ఈ మేరకు ఖాళీల భర్తీకి ప్రత్యేక నియామక డ్రైవ్‌ చేపట్టాలని అన్ని శాఖల్ని ఆదేశించింది. ఈ బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఉత్తర్వులు. రిజర్వేషన్‌ నిబంధనలు, నియామక మార్గదర్శకాలకు కట్టుబడి భర్తీ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఏపీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై చర్యలు చేపట్టింది. ముగ్గురు మాజీ మున్సిపల్ కమిషనర్లు, 43 మంది ఇతర అధికారులపై అభియోగాలు నమోదు చేస్తూ 63 ఉత్తర్వులు జారీ చేసింది. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 2019-24 మధ్య కాలంలో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి చెందిన ఉచిత అన్నదాన కేంద్రానికి స్థలం కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఫిర్యాదుతో ప్రభుత్వం విచారణ కమిటీని నియమించగా, ఆ కమిటీ సిఫారసుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.

ఈ కేసులో ప్రొద్దుటూరు పురపాలక సంఘం కమిషనర్లుగా పనిచేసిన చంద్రమౌళీశ్వరరెడ్డి, రాధా, వెంకటరమణయ్య, పట్టణ ప్రణాళిక విభాగం సహాయక కమిషనర్ మునిరత్నం, ఇద్దరు విశ్రాంత అధికారులు, ముగ్గురు ఏఈలు, ఇద్దరు ఎకౌంట్స్ సెక్షన్ సిబ్బంది, 24 మంది సచివాలయ వార్డు కార్యదర్శులు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వానికి సిఫారసులు పంపిన విచారణ బృందం, ఈ అక్రమాలపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ నివేదిక ఆధారంగానే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిణామాలతో పురపాలక శాఖలో అలజడి నెలకొంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • andhra pradesh government
  • AP CM Chandrababu
  • Backlog posts
  • disabled persons

Related News

Ap Govt

Andhrapradesh Govt : ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ..డైరెక్టుగా ఇంటర్‌లో జాయిన్ త్వరలో లాస్ట్ డేట్!

వివిధ కారణాల వల్ల చదువు మధ్యలో ఆపేసిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నేరుగా పది, ఇంటర్ చదివే అవకాశాన్ని కల్పిస్తోంది. గడువు ముగిసినా రూ. 600 అదనపు ఫీజుతో డిసెంబర్ 6 వరకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ కార్యక్రమంలో చేరితే ఉచిత పుస్తకాలు ఇస్తారు. యూట్యూబ్, వెబ్‌సైట్‌లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వివ

  • Apsrtc

    APSRTC : ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నెరవేరిన కల..!

  • Cbn

    Andhrapradesh : ఏపీ సమగ్రాభివృద్ధి కోసం కొత్త స్కెచ్.. చంద్రబాబు మాస్టర్ ప్లాన్.!

Latest News

  • HILT Policy : హిల్ట్ పాలసీపై విమర్శలు.. కేటీఆర్ పై మంత్రి పొంగులేటి ఆగ్రహం

  • Financial Crisis: మీ అరచేతిలో భాగ్య రేఖ.. ఆర్థిక భవిష్యత్తు ఎలా ఉంటుంది?

  • India-Russia : భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

  • Akhanda 2 Postponed : అఖండ-2 వాయిదా..నిర్మాతల పై బాలయ్య తీవ్ర ఆగ్రహం?

  • 14 Reels : అప్పుల ఊబిలో అఖండ నిర్మాతలు.. మెడకు చుట్టుకున్న ఆ 90 కోట్లు!

Trending News

    • Virat Kohli Records: వైజాగ్‌లో రేపే నిర్ణయాత్మక పోరు.. కోహ్లీని ఊరిస్తున్న 3 భారీ రికార్డులీవే!

    • Akhanda 2 New Release Date : ఈరోజు రాత్రికే ‘అఖండ 2’ ప్రీమియర్ షోలు!

    • Putin India Visit: మోదీ-పుతిన్ ఒకే కారులో ఎందుకు కూర్చున్నారో తెలుసా?

    • Putin Religion: ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పాటించే మతం ఏమిటి? ఆయనకు దేవుడిపై విశ్వాసం ఉందా?

    • Putin Personal Toilet: పుతిన్‌కు బుల్లెట్‌ప్రూఫ్ కారు, వ్యక్తిగత టాయిలెట్.. ఎందుకంత పకడ్బందీ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd