HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For The Telugu States Fcra License Renewed For Rdt

Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్సు పునరుద్ధరణ

  • Author : Vamsi Chowdary Korata Date : 24-03-2026 - 11:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Central Government Resolve RDT Foreign Funding Issue
Central Government Resolve RDT Foreign Funding Issue

FCRA License  కేంద్రం నుంచి అనంతపురం ఆర్డీటీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏను పునరుద్ధరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఏడాది క్రితం ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద విదేశీ నిధులకు బ్రేకులు వేశారు. ఏపీ ప్రభుత్వం తరఫున కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో మళ్లీ పునరుద్ధరించారు. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

తెలుగు రాష్ట్రాలకూ, అనంతపురం జిల్లావాసులకూ కేంద్రం నుంచి తీపి కబురు అందింది. అనంతపురం ఆర్డీటీ (రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌) సేవలకు అనుమతి లభించింది. ఆర్డీటీ విదేశీ నిధులు పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆర్డీటీ విదేశీ నిధులు వినియోగించుకునేందుకు వీలుగా ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేసినట్లు ఆర్డీటీ ప్రతినిధులకు కేంద్ర హోంశాఖ నుంచి సమాచారం అందింది. ఆర్డీటీకి లైన్ క్లియర్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తెలిపారు.

దశాబ్దాలుగా పేదల కోసం అద్భుతమైన సేవలు అందిస్తున్న ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) కు విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించిన ప్రధాని మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్…

— N Chandrababu Naidu (@ncbn) March 24, 2026

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.
లక్షలాది మంది సంతోషించే సమాచారం.
ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)‌‌‌‌‌‌‌ సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో… pic.twitter.com/4JQyBtV7OW

— Lokesh Nara (@naralokesh) March 24, 2026

రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సంస్థ అనంతపురం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో విద్య, వైద్యం, స్వయం ఉపాధి వంటి సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఈ ఆర్డీటీకి విదేశాల నుంచి నిధులు వస్తుంటాయి. అయితే ఈ నిధుల వినియోగానికి అనుమతుల్ని కేంద్రం నిలిపివేసింది. ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌ (FCRA) కింద కేంద్రం ఈ చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి ఆర్డీటీకి సంబంధించి ఫారిన్ కాంట్రిబ్యూషన్ అకౌంట్‌లలో ఉన్న డబ్బుల్ని వినియోగించడానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి ఆర్డీటీ సేవా కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. ఏపీ ప్రభుత్వం ఆర్డీటీకి సంబంధించిన సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఢిల్లీ వెళ్లిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎంపీలు వినతిపత్రాలు సమర్పించారు. కేంద్రం సానుకూలంగా స్పందించి ఎఫ్‌సీఆర్‌ఏను రెన్యువల్‌ చేసింది. దీంతో ఆర్డీటీ సేవా కార్యక్రమాలను త్వరలోనే మళ్లీ ప్రారంభించనుంది.

ఆర్డీటీ విదేశీ నిధుల విషయంలో సమస్యను పరిష్కరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. ఆర్డీటీ తెలుగు రాష్ట్రాల్లోని గ్రామాల్లో ఎన్నో సేవలు అందిస్తోందన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్డీటీకి విదేశాల నుంచి వస్తున్న నిధులు వినియోగించేందుకు అంతరాయం కలిగిందని.. ఆర్డీటీ అందిస్తున్న సేవల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించామన్నారు. ఆయన స్పందించి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అడ్డంకులు తొలగిపోయాయన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి విన్నవించగానే సానుకూలంగా స్పందించిన కేంద్రానికి.. ఆర్డీటీ ద్వారా లబ్ధి పొందుతున్న లక్షలాది మంది పేద ప్రజల తరఫున చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

అనంతపురం ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని మంత్రి లోకేష్ అన్నారు. ‘తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.. లక్షలాది మంది సంతోషించే సమాచారం. పేద ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాను. పేదల ఇళ్లలో వెలుగు, నిరుపేద పిల్లల చదువు, ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీ గారికి, హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు, అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దశాబ్దాల సేవాస్ఫూర్తితో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారికి అభినందనలు’ తెలుపుతూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amit shah
  • Andhrapradesh
  • Education Minister Nara Lokesh
  • FCRA License
  • Foreign Contributions
  • Mancho Ferrer
  • Minister Nara lokesh
  • nara lokesh
  • narendra modi
  • RDT
  • Rural Development Trust
  • telugu states

Related News

Capital war reignites in AP... Amaravati versus Mavigan...

Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

ఏపీలో మావిగన్ గురించి చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి పనుల్లో వేగం పెంచడానికి ప్రయత్నిస్తుండగా.. జగన్ మాత్రం మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలిపి రాజధాని నిర్మిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మొదట జగన్ నోటి నుంచి ‘మావిగన్’ అనే మాట వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ జులై 1న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జగన్ మాట్లాడ

  • A new chapter in India-Japan relations

    India-Japan: భారత్-జపాన్ బంధంలో కొత్త అధ్యాయం

  • Date fixed for the release of 'Thalliki Vandanam' funds.

    Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్

  • AP EAPCET results released

    AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ ఫలితాల విడుదల

  • AP EAPCET 2026 results postponed again.

    AP EAPCET Results: ఏపీ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలు మళ్లీ వాయిదా

Latest News

  • Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?

  • CM Revanth: టూరిజం రంగంలో భారీ మార్పులు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • Skipping Dinner: రాత్రి భోజనం చేయలేదా? ఈ అనారోగ్య సమస్యలు తప్పవు.. జాగ్రత్త!!

  • Ravan: మరో కేసులో యూట్యూబర్‌ రావణ్‌ మళ్లీ అరెస్టు

  • Stress Management Tips: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ కోసం.. నిద్రలేమిని అరికట్టే 7 టిప్స్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd