HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For Expatriates To Visit Srivari 100 Vip Break Darshan Tickets Available Daily

Tirumala : శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు శుభవార్త..రోజూ వంద వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌న టికెట్లు

ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరి నేతృత్వంలో ఉన్న ప్రతినిధి బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ప్రవాసాంధ్రులకు అందుతున్న వీఐపీ బ్రేక్‌ దర్శన కోటా 50 నుంచి కేవలం 10కి తగ్గించబడిందని, దీంతో విదేశాల నుండి తిరుమలకు వచ్చే తెలుగు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.

  • Author : Latha Suma Date : 21-07-2025 - 10:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for expatriates to visit Srivari..100 VIP break darshan tickets available daily
Good news for expatriates to visit Srivari..100 VIP break darshan tickets available daily

Tirumala: ప్రవాసాంధ్రులకు శ్రీవారి దర్శనం ఇక మరింత సులభం కానుంది. ఇప్పటి వరకు తక్కువ సంఖ్యలో అందుతున్న వీఐపీ బ్రేక్‌ దర్శన కోటా పెరిగిందని, ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ (APNRTS) ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రవాస భారతీయులలో ఆనందోత్సాహాలను కలిగిస్తోంది. ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరి నేతృత్వంలో ఉన్న ప్రతినిధి బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ప్రవాసాంధ్రులకు అందుతున్న వీఐపీ బ్రేక్‌ దర్శన కోటా 50 నుంచి కేవలం 10కి తగ్గించబడిందని, దీంతో విదేశాల నుండి తిరుమలకు వచ్చే తెలుగు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.

Read Also: Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. తజాకిస్తాన్, భారత్‌లోనూ ప్రకంపనలు

ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి వెంటనే స్పందించి, ఈ కోటాను 10 నుంచి 100కు పెంచాలని తీర్మానించారు. సీఎం ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ప్రతి రోజు వంద వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లను ప్రవాసాంధ్రులకు కేటాయించేందుకు సూచించారు. ఈ అవకాశాన్ని పొందాలంటే ప్రవాసాంధ్రులు ముందుగా ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌ (https://apnrts.ap.gov.in/) లో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. సభ్యత్వం పూర్తిగా ఉచితం. సభ్యత్వం పొందే సమయంలో ప్రవాసాంధ్రులు తమ వీసా, వర్క్‌ పర్మిట్‌ వంటి అవసరమైన వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. సభ్యత్వం నమోదు అనంతరం, వెబ్‌సైట్‌లో తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి మూడు నెలల విండోలో ఉన్న స్లాట్లు కనిపిస్తాయి. అందులో మనకు కావలసిన తేదీని ఎంపిక చేసుకుని స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఆ రోజున అందుబాటులో ఉన్న టికెట్లను టీటీడీ పరిపాలనా పరంగా పరిశీలించి కేటాయిస్తుంది.

టికెట్‌ కేటాయింపు అయిన వారికి తిరుమలలోని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ పీఆర్వో కార్యాలయం ద్వారా వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పించబడుతుంది. వివరాలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే, ప్రవాసాంధ్రులు ఏపీఎన్‌ఆర్‌టీ వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించవచ్చు. అదేకాకుండా, ఏపీలోని తాడేపల్లి లో ఉన్న ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించవచ్చు. సంబంధిత సమాచారాన్ని ఈ క్రింది ఫోన్‌ నంబరులో పొందవచ్చు.. 0863-2340678. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారు తిరుమల శ్రీవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకోవాలని సంస్థ ప్రతినిధి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇది ప్రవాసాంధ్రులకు ఎంతో గౌరవకరమైన మరియు ఆనందదాయకమైన పరిణామంగా భావించవచ్చు.

Read Also: Cesarean Deliveries : సిజేరియన్లలో తెలంగాణే టాప్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • APNRTS
  • CM Chandrababu
  • NRI
  • Ravi Vemuri
  • Srivari Darshanam
  • tirumala
  • ttd
  • Venkata Reddy
  • VIP Break Darshan

Related News

VVIP Break Darshan Tirumala Online Booking

టీటీడీ గుడ్ న్యూస్..శ్రీవారి ప్రోటోకాల్ దర్శనం..సేవలో తరించే ఛాన్స్, వెంటనే ఇలా చేయండి!

Tirumala Tirupati Devasthanams  టీటీడీ శ్రీవారి వైద్య సేవ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. శ్రీవారి వైద్యసేవలో భాగంగా చికిత్స, బోధన, పరిశోధన రంగాల్లో ఎక్స్‌పర్ట్ డాక్టర్లను టీటీడీ ఆహ్వానిస్తోంది. నెలలో సగటున వారం రోజులపాటు ఆసుపత్రుల్లో సేవలు అందించొచ్చు. వీరికి ప్రోటోకాల్ శ్రీవారి దర్శనం, వసతి, భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు టీటీడీ అధ

  • Jagan App

    AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

Latest News

  • మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

  • Boggula Srinivas : బొగ్గుల శ్రీనివాస్ మరణం.. వీడిన మిస్టరీ

  • Kalki 2 Shooting : కల్కి-2 షూటింగ్ షురూ?

  • కుమారుడి బ‌ర్త్ డే.. రూ. 4 కోట్ల కారును గిఫ్ట్‌గా ఇచ్చిన పాండ్యా!

  • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

Trending News

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

    • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd