Amrit Bharat Stations : కొత్తగా ఏపీలో 34, తెలంగాణలో 15 ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు
Amrit Bharat Stations : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది.
- By Pasha Published Date - 06:20 PM, Sun - 25 February 24

Amrit Bharat Stations : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 34 అమృత్ భారత్ రైల్వే స్టేషన్‌లను నిర్మించనున్నట్లు వెల్లడించింది. అమృత్ భారత్ స్టేషన్ల రీడెవలప్‌మెంట్‌లో భాగంగా ఏపీలో 34, తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను డెవలప్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఫిబ్రవరి 26న ( సోమవారం) వీటికి శంకుస్థాపన చేయనున్నారు. రూ.843.54 కోట్లతో ఈ రైల్వే స్టేషన్‌లను ఆధునీకరణ చేయనున్నారు. ఇక సోమవారం రోజు దేశవ్యాప్తంగా 500కుపైగా అమృత్ భారత్ స్టేషన్లకు(Amrit Bharat Stations) వర్చువల్ విధానం ద్వారా ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. 1500 రైల్వే ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణ పనులకు భూమిపూజ కూడా చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join
అమృత్ భారత్ స్టేషన్స్ స్కీమ్‌లో భాగంగా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతారు. ఇందులో భాగంగా ఏపీలో మొత్తం 72 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తారు. తొలి దశలో అనకాపల్లి, భీమవరం, ఏలూరు, కాకినాడతో పాటుగా, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని రైల్వే స్టేషన్లను కేంద్రం గుర్తించింది. వీటి అభివృద్ధికి రూ.270 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం ఈ స్టేషన్‌లలో పనులు జరుగుతున్నాయి. తాజాగా మరో 34 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఆ లిస్టు వివరాలు కింద ఉన్నాయి.
Also Read : Landlord Vs Tenant : 11 నెలల అద్దె అగ్రిమెంటులో ఆ ట్విస్ట్.. మీకు తెలుసా ?
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, అనపర్తి, ఆదోనీ, బాపట్ల, చీరాల, చిత్తూరు, కంభం, ధర్మవరం, డోన్, ఎలమంచిలి, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గుణదల, గుంటూరు, కడప, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లె స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపిక చేశారు. అలాగే మంగళగిరి, మంత్రాలయం, మార్కాపురం, నడికుడి, నంద్యాల, నర్సరావుపేట, పాకాల, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, సామర్లకొట, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తాడిపత్రి, వినుకొండ రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి కోసం రూ.610.30 కోట్లు ఖర్చు పెట్టనున్నారు.