HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Final Gazette Notification Issued For 26 Districts In Andhra Pradesh

New Districts In AP: ఏపీలో 26 జిల్లాలకు.. తుది నోటిఫికేషన్ విడుద‌ల‌..!

  • Author : HashtagU Desk Date : 03-04-2022 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
New Districts In Ap Ys Jagan
New Districts In Ap Ys Jagan

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు వ‌చ్చేశాయ్. 13 జిల్లాల న‌వ్యాంధ్ర‌, ఇప్పుడు 26 జిల్లాల ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారింది. ఈ క్ర‌మంలో కిత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం శనివారం అర్ధ‌రాత్రి తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఈ నెల 4వ తేదీ నుంచి కొత్త జిల్లాలు పాలనపారంగా అందుబాటులోకి వస్తాయని ఏపీ ప్ర‌భుత్వం తాజా ఉత్త‌ర్వులో తెలిపింది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది ప్ర‌భుత్వం. అయితే విస్తీర్ణం దృష్ట్యా అర‌కును మాత్రం రెండు జిల్లాలుగా విభ‌జించింది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య 26కు పెర‌గ‌గా, రెవెన్యూ డివిజ‌న్ల సంఖ్య 72కు చేరింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేష‌న్లు జారీ చేసింది రాష్ట్ర ప్ర‌భుత్వం.

కొత్త జిల్లాలను ప్రతిపాదిస్తూ జనవరి 25న ప్రభుత్వం తొలి నోటిఫికేషన్లు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే.
ఈ క్ర‌మంలోకొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. మండలాలు, డివిజన్ల మార్పు, కూర్పుతోపాటు పేర్లపై సుమారు 12 వేల 600 అభ్యంతరాలు వచ్చాయి. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది.

తిరుప‌తి మిగతా జిల్లాల పేర్లను ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న వాటినే రాష్ట్ర ప్ర‌భుత్వం కంటిన్యూ చేసింది. తిరుపతి కేంద్రంగా శ్రీ బాలాజీ జిల్లా ఏర్పాటు చేయాలని తొలుత ప్రతిపాదించారు. అయితే ఇప్పుడు దీనిని తిరుపతి జిల్లాగానే ఉంచారు. మ‌రోవైపు మన్యం జిల్లాకు బదులుగా పార్వతీపురం మన్యం అనే పేరు ఖరారు చేశారు. కొన్ని జిల్లాల పరిధిలోని మండలాల్లో కొన్ని సవరణలు జరిగాయి. కొత్త జిల్లాలకు కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక కొత్త జిల్లాలను సోమ‌వారం ఉద‌యం ప్రారంభించ‌నున్నారు. దీనికి సంబంధించి రేపు ఉద‌యం 9.45 గంటలకు ఈ కార్యక్రమం ముగిసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Cabinet approved
  • new districts
  • new districts in AP
  • Revenue divsion
  • ys jagan
  • ysrcp

Related News

Groundbreaking Ceremony for the AMCA Project in Puttaparthi

AMCA Fighter Jet Project: పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టు శంకుస్థాపన

రాయలసీమకు మరో భారీ ప్రాజెక్టు వచ్చింది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్‌ మీడియం కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మరికొన్ని ప్రాజెక్టులకు పుట్టపర్తి నుంచి

  • The Largest International Airport in Amaravati

    Amaravati: అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం

  • Accused Nithyananda Reddy

    YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Mlc Anantha Babu Arrest

    MLC Anantha Babu: మరో వారంలో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతి.. జగన్ స్నేహితుడు అనంతబాబు జైలుకి

  • YCP's Masterplan Behind the Kadapa Riots... A Conspiracy Against the Coalition Government!!

    కడపలో అల్లర్ల వెనుక వైసీపీ స్కెచ్…. కూటమి సర్కార్‌పై కుట్ర…!!

Latest News

  • Byreddy Shabari: వైసీపీ నేతలపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్

  • Udhayanidhi Stalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై ఉదయనిధి వివరణ

  • Online NEET Exam: వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో నీట్‌ పరీక్ష.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

  • AP Government: ట్రాన్స్‌జెండర్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుర్తింపు, రేషన్‌ కార్డులు: మంత్రి బాల వీరాంజనేయస్వామి

  • Bandi Bagheerath: బండి భగీరథ్.. స్పందించిన బాధితురాలి తల్లి సంచలన లేఖ

Trending News

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

    • Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

    • Work From Home: ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. చంద్రబాబు కీలక ప్రకటన..!

    • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

    • TVK విజయ్‌ అను నేను..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd