HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Fake Ips In Pawans Tour Who Is He

Fake IPS: ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న‌లో న‌కిలీ ఐపీఎస్.. ఆయ‌నెవ‌రో కాదు?

ఏజెన్సీ పర్యటనలో నకిలీ ట్రైనీ ఐపీఎస్ సూర్య ప్రకాష్ కలకలం సృష్టించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై డొల్లతనం బ‌య‌ట‌ప‌డింది. పవన్ కళ్యాణ్ భద్రత విషయాల్లో పోలీసుల అలసత్వంపై రాజ‌కీయం దుమారం చెలరేగుతోంది.

  • Author : Gopichand Date : 29-12-2024 - 9:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Fake IPS
Fake IPS

Fake IPS: ఏపీలో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. సీఎంగా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టారు. ఈ ఇద్ద‌రూ ఏపీని అభివృద్ధి దిశ‌గా న‌డిపేందుకు క‌స‌ర‌త్తులు చేస్తోన్నారు. అయితే ఇటీవ‌ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో నకిలీ ట్రైనీ ఐపీఎస్ అధికారి (Fake IPS) సూర్య ప్రకాష్ క‌ల‌క‌లం సృష్టించాడు. డిప్యూటీ సీఎం పర్యటన జరిగిన వారం రోజుల తర్వాత నకిలీ ట్రైనీ ఐపీఎస్ ని పోలీసులు గుర్తించ‌డం గ‌మ‌నార్హం.

ఏజెన్సీ పర్యటనలో నకిలీ ట్రైనీ ఐపీఎస్ సూర్య ప్రకాష్ కలకలం సృష్టించడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై డొల్లతనం బ‌య‌ట‌ప‌డింది. పవన్ కళ్యాణ్ భద్రత విషయాల్లో పోలీసుల అలసత్వంపై రాజ‌కీయం దుమారం చెలరేగుతోంది. పోలీసుల బాధ్యతారాహిత్యంపై హోం శాఖ, ఇంటిలిజెన్స్ బాధ్యత వహించాల‌ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ప‌ష్టం చేశారు.

Also Read: Plane Explosion : రన్‌వేపై ల్యాండ్ అవుతూ.. విమానం పేలి 47 మంది మృతి

అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు పోలీసులు ఉన్నారా లేరా అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమ‌ర్శ‌లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో పోలీసుల వ్యవహార శైలి వెనక జగన్ కారణమని కూటమి నేతలు చెప్పాల్సిందంటూ బొత్స‌ వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఇప్పటికే నకిలీ ట్రైనీ ఐపీఎస్ సూర్యప్రకాష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు విజయనగరం పోలీసులు తెలిపారు.

పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత ట్రైనీ ఐపీఎస్ సూర్యప్రకాష్ బ‌య‌ట‌కు వచ్చాడని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్ర‌క‌టించారు. డిప్యూటీ సీఎం పర్యటనలో సభా వేదిక వద్ద అటు ఇటు తిరుగుతూ నకిలీ ఐపీఎస్ సూర్యప్రకాష్ క‌నిపించాడు. తన భూమి వివాదాన్ని పరిష్కరించుకోవడానికి పోలీస్ అవతారం ఎత్తినట్లు సూర్య ప్రకాష్ చెప్పిన‌ట్లు స‌మాచారం. లోకల్ గా ఉన్న ప్రజలు నమ్మకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు హాజరై ఫోటోలు తీసుకుని తమ ఊరు వాళ్లను మోసం చేయడానికి ప్రయత్నం చేసిన సూర్య ప్రకాష్ ఏకంగా చిక్కుల్లో ప‌డ్డారు.

ఎవ‌రీ సూర్య ప్ర‌కాష్‌?

విజయనగరం జిల్లా మెరకముడిదాం గ్రామానికి చెందిన బలివాడ సూర్య ప్రకాశ్ మాజీ సైనికుడ‌ని స‌మాచారం. ప్రస్తుతం ఆయ‌న‌ గరివిడి పట్టణంలో ఉంటున్నాడు. సూర్య ప్ర‌కాష్‌ తండ్రి తూనికలు, కొలతల శాఖలో పనిచేసి రిటైర్ అయ్యారు. సైన్యంలో పనిచేసి వచ్చిన తర్వాత సూర్యప్రకాశ్ నకిలీ పోలీస్ అవ‌తారం ఎత్తిన‌ట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా తాను ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటూ స్థానికంగా సూర్య ప్ర‌కాష్‌ తిరుగుతున్నాడు. మాజీ సైనికుడు కావడంతో స్థానికులు కూడా ఐపీఎస్ వచ్చిందేమోనని నమ్మారు. ఇంకా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డ‌టంతో స్థానికులు సైతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • bjp
  • DCM Pawan Kalyan
  • Fake ips
  • JSP
  • Suryaprakash
  • tdp
  • telugu news

Related News

Ap Sports Infrastructure And Construct Indoor Hall

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ జిల్లాలకు రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు..

Ap Sports Infrastructure And Construct Indoor Hall  ఏపీకి కేంద్రం తీపికబురు వినిపించింది. ఖేలో ఇండియా పథకం కింద రాష్ట్రంలో క్రీడారంగం అభివృద్ధికి నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పనులు చేపట్టేందుకు రూ.60 కోట్లు నిధులు మంజూరు చేసింది. వీటి సాయంతో శ్రీకాకుళం జిల్లాలో ఇండోర్ స్పోర్ట్స్ హాల్, కుప్పంలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ బ్లాక్, రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం నిర్మించనున్నారు. అలాగే విజ

  • sri Kanipakam Varasiddhi Vinayaka laddu

    కాణిపాకం ఆలయంలో వినాయకుడి లడ్డూ ప్రసాదం తయారీలో మార్పులు

  • tsrtc special buses sankranti

    తెలంగాణ RTC సంక్రాంతికి స్పెషల్ బస్సులు

  • Amith Sha Tvk

    విజయ్ పార్టీ తో బిజెపి పొత్తు?

  • CM Chandrababu On Krishna, Godavari River Water

    కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నేను ఎప్పడు అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి సీఎం చంద్రబాబు

Latest News

  • వాల్ నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

  • జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

  • జియో ఐపీఓ: 2.5% వాటా విక్రయించే యోచనలో రిలయన్స్‌!

  • ఉక్రెయిన్ పై మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడ్డ రష్యా

  • రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలివే..!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd