HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ex Mla Pedda Reddy Arrest In Tadipatri

Pedda Reddy: ఏపీలో ఉద్రిక్త‌త‌.. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి అరెస్ట్‌!

పెద్దారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను తాడిపత్రిలోని నివాసంలోనే అరెస్టు చేసిన పోలీసులు అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించినట్లు స‌మాచారం.

  • Author : Gopi Date : 29-06-2025 - 10:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pedda Reddy
Pedda Reddy

Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తత మరోసారి ఉస్సురుమంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Pedda Reddy) గత ఏడాది కాలంగా తన సొంత నియోజకవర్గమైన తాడిపత్రిలోని ఇంటికి రాకుండా ఉంటూ వచ్చారు. ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్లు, శాంతిభద్రతల సమస్యల నేపథ్యంలో పోలీసులు ఆయనను తాడిపత్రిలోకి అనుమతించలేదు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ శాంతిభద్రతల పేరుతో పెద్దారెడ్డిని అడ్డుకుంటూ వచ్చిన పోలీసులు, ఈ రోజు ఉదయం ఆయన తాడిపత్రిలోని సొంత ఇంటికి చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు.

పెద్దారెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను తాడిపత్రిలోని నివాసంలోనే అరెస్టు చేసిన పోలీసులు అనంతపురం జిల్లా కేంద్రానికి తరలించినట్లు స‌మాచారం. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. నిన్న మున్సిపల్ సిబ్బంది పెద్దారెడ్డి ఇంటిని కొలతలు వేసినట్లు, అలాగే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తన ఇంటిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితుల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Also Read: Stampede: మ‌రో తొక్కిస‌లాట‌.. ముగ్గురు భ‌క్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!

తాడిపత్రిలో గతంలో జరిగిన హింసాత్మక సంఘటనలు, ఎన్నికల అనంతర గొడవల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పెద్దారెడ్డి హైకోర్టు బెయిల్ పొందినప్పటికీ శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ఆయనను అనుమతించలేదు. పెద్దారెడ్డి తన నియోజకవర్గంలోకి రావడానికి అనుమతి కోరుతూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తాడిపత్రిలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పట్టణంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.

పోలీసుల రియాక్ష‌న్ ఇదే

పెద్దారెడ్డి తాడిపత్రి రాకపై పోలీసుల తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేశారు. తాడిపత్రిలోకి వస్తే పోలీసులకు చెప్పి రావాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయ‌ని అన్నారు. కానీ పోలీసులకు చెప్పకుండా తాడిపత్రి పట్టణంలోకి పెద్దారెడ్డి రావ‌డంతో పోలీసులు తీవ్ర అభ్యంతరం వ్య‌క్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ పెద్దారెడ్డి పై పోలీసుల సీరియస్ అవుతున్నారు. ఇవాళ జరిగిన పరిణామాలపై పోలీసులు హైకోర్టుకు నివేదించే అవకాశం ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • ap politics
  • Ex MLA
  • Pedda Reddy
  • Tadipatri
  • ysrcp

Related News

TDP

TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలు పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినప్పటికీ, నిరుద్యోగ యువతలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. డీఎస్సీ నియామకాలపై అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు, ఎక్కడ తప్పు జరిగిందో ఆధారాలతో నిరూపించాలని స

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd