HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Eo Posts To Be Filled Through Appsc Minister Anam

APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

  • Author : Vamsi Chowdary Korata Date : 22-05-2026 - 3:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Filling of EO Posts through APPSC: Endowments Minister Anam Ramanarayana Reddy
Filling of EO Posts through APPSC: Endowments Minister Anam Ramanarayana Reddy

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి క్షేత్రంలో కొత్తగా నిర్మించిన వసతి గదుల్ని ప్రారంభించారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మరో 116 ఆలయాలకు విస్తరిస్తామని అన్నారు. రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో ఖాళీగా ఉన్న 106 ఈవో పోస్టులను ఏపీపీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ఆలయాల్లో ఈవో పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించారు దేవాదాశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. ఏపీపీఎస్సీ ద్వారా మొత్తం106 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆలయ ఉద్యోగుల వేతనాల మంజూరుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 980 ఆలయాలకు కొత్త పాలకమండళ్లను నియమించామని.. మరో 438 ఆలయాలకు త్వరలో నియమిస్తామని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 52 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ చేస్తున్నారని.. రాబోయే రోజుల్లో మరో 116 ఆలయాలకు విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీటీడీ భక్తులకు జారీ చేసే శ్రీవాణి టికెట్ల జారీలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేదన్నారు ఆనం.. కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో తిరుమలతో పాటుగా ప్రముఖ ఆలయాల్లో ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు విక్రయిస్తున్నామని.. అక్రమాలకు తావు ఉండదన్నారు.

మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో భక్తుల కోసం నిర్మించిన వసతి గదుల్ని ప్రారంభించారు. మొత్తం రూ.16.5 కోట్లతో 108 వసతి గదులు నిర్మించగా మంత్రి ఆనం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఆలయాలు అభివృద్ధి చెందాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీవాణి భజన మందిరాల కార్యక్రమాన్ని టీటీడీ సహకారంతో అమలు చేస్తామని ప్రకటించారు. అలాగే గిరిజన తండాలు, దళితవాడల్లో భజన మందిరాలను నిర్మిస్తామన్నారు. స్థానికులు కోరితే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు. 691 ఆలయాలకు రూ.812.67 కోట్లతో కామన్‌ గుడ్‌ ఫండ్‌ కింద జీర్ణోద్ధరణ పనులు చేపట్టామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన వసతి కల్పిస్తామన్నారు మంత్రి ఆనం. వినాయక సదన్‌లో రూ.14.74 కోట్లతో ఆధునాతన వసతులతో భక్తులకు వసతిని ప్రారంభించామన్నారు. ఫర్నిచర్‌ సహా ముఖ్యమైన సౌకర్యాల కోసం రూ.2.10 కోట్లు కేటాయించామన్నారు. వినాయక సదన్‌లోని ప్రతి గదిలో దేవుడి ఫోటో పెట్టడం మంచి నిర్ణయమన్నారు. కాణిపాకం పుష్కరిణిలో పనులు చేపడతామన్నారు. బస్టాండ్‌ నిర్మాణానికి రూ.16 కోట్లు, డోనర్‌ గెస్టు హౌస్‌కు రూ.4 కోట్లతో పనులు ప్రారంభమవుతాయన్నారు. అర్ధగిరి, మొగిలి ఆలయాలను టూరిజం హబ్‌గా.. పూతలట్టు నియోజకవర్గంలోని అరగొండ చౌడేశ్వరి ఆలయాన్ని దాతలు, దేవదాయశాఖ సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anam ramanarayana reddy
  • Andhra Pradesh Endowments Department
  • andhra pradesh govt
  • APPSC
  • Eo Posts
  • Minister Anam Ramanarayana Reddy
  • notification

Related News

    Latest News

    • Prakash Raj: కాక్‌రోచ్ జనతా పార్టీలోకి ప్రకాశ్ రాజ్.. మోదీపై సెటైర్.. వీడియో వైరల్!

    • Kamal Haasan: ప్రధాని మోదీకి కమల్ హాసన్ మద్దతు

    • APSFTVTDC: ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..

    • APPSC: ఏపీపీఎస్సీ ద్వారా ఈవో పోస్టుల భర్తీ: దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

    • Ram Charan: ‘పెద్ది’ స్పెషల్‌ సాంగ్‌ వచ్చేసింది..

    Trending News

      • Oil Crisis: సంక్షోభం రాబోతుంది.. ‘రెడ్‌ జోన్‌’లోకి చమురు మార్కెట్‌

      • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

      • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

      • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

      • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd