AP Bandh : ఈ నెల 24న ఏపీ రాష్ట్ర బంద్..
- Author : Sudheer
Date : 22-01-2024 - 9:26 IST
Published By : Hashtagu Telugu Desk
అంగన్వాడీల ఆందోళనకు మద్దతుగా ఈనెల 24వ తేదీన ఏపీ బంద్ (AP Bandh)కు విపక్షాలు (Employees Union) పిలుపునిచ్చాయి. అంగన్వాడీల (Anganwadi Workers Protest)పై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బంద్ కు ప్రజా సంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు కూడా మద్దతును ప్రకటించాయి. గత 42 రోజులుగా అంగన్వాడీలు తమ డిమాండ్స్ ను నెరవేర్చాలంటూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో వారు తమ ఆందోళనను మరింత ఉదృతం చేసారు. ఈరోజు చలో విజయవాడ కు పిలుపునివ్వడంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసారు. వెంటనే అంగన్వాడీలు ఆందోళలన విరమించి విధుల్లో చేరాలని..లేదంటే వారిని తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 20 శాతం మంది అంగన్వాడీలు విధుల్లో చేరారు. విధుల్లో చేరని వారిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా, ఈ నెల 24న అంగన్వాడీల టెర్మినేషన్ పై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 25న కొత్త సిబ్బందిని చేర్చుకునేలా రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వనుంది. ఈ నిర్ణయంపై అంగన్వాడీలు మరింతగా జగన్ సర్కార్ పై మండిపడుతున్నారు.
ఇదే తరుణంలో అంగన్వాడీలకు మద్దతు ప్రకటిస్తూ..ఏపీ బంద్‌కు ఏపీ ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ నెల 24 తేదీన అందరూ బంద్ పాటించాలని ట్రేడ్ యూనియర్లు పిలుపునిచ్చాయి. పోరాడుతున్న అంగన్వాడి టీచర్లు, ఆయాలకు మద్దతుగా ఈ పిలుపునిచ్చారు. వైసీపీ మినహా రాజకీయ పార్టీలన్నీ బంద్‌కు మద్దతు ఇచ్చేఅవకాశాలు ఉన్నాయి. ఈ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు, ఏఐటీయూసీ, ఐఎఫ్టియు , టీఎన్టియుసి , ఐ.ఎన్. టి.యు.సి నేతలు పిలుపునిచ్చారు.
Read Also : Sweet Carrot Crackers: వెరైటీగా ఉండే స్వీట్ క్యారెట్ క్రాకర్స్.. ఇలా చేస్తే కొంచెం కూడా మిగల్చరు?