AP Volunteers: ఎన్నికల వేళ వాలంటీర్లకు ఈసీ బిగ్ షాక్
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాకిచ్చింది.
- By Praveen Aluthuru Published Date - 07:11 PM, Sat - 30 March 24

AP Volunteers: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాకిచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) దృష్ట్యా లబ్ధిదారుల ఇంటి వద్దకు ప్రభుత్వ సహాయ పథకాల పంపిణీని ఉపసంహరించుకోవాలని భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. పింఛన్లు వంటి సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా అందకుండా చూడాలని ఈసీ ఏపీ ప్రభుత్వానికి సర్క్యులర్ జారీ చేసింది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నంత వరకు గ్రామ వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు మరియు పరికరాలను తిరిగి తీసుకోవాలని ఈసీ ప్రభుత్వాన్ని కోరింది. పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు సహాయాన్ని పంపిణీ చేయకుండా ఈసీ నిలిపివేసిన విధంగానే ఈ నిర్ణయం ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వాస్తవానికి, వివిధ రాష్ట్రాల నుండి సానుకూల స్పందన అలాగే అంతర్జాతీయ గుర్తింపు పొందిన గ్రామ వాలంటీర్ వ్యవస్థ కోవిడ్ 19 మహమ్మారి సమయంలో పథకాలను ప్రజలకు అందజేయడానికి ప్రభుత్వానికి ఉపయోగపడింది. అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై తీవ్ర విమర్శలు చేయడంతో పాటు కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలిన తర్వాత వారు వెనక్కి తగ్గారు. దీన్తహో ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఎప్పటికీ కొనసాగనుంది.
Also Read: Lemon Price Hike: క్షీణించిన నిమ్మ, రూ.10 కి చేరిన నిమ్మ ధరలు