AP DGP Transfer: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీ బదిలీ
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని తెలిపింది.
- Author : Praveen Aluthuru
Date : 05-05-2024 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
AP DGP Transfer: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఉల్లంఘనలను ఏ మాత్రం సహించడం లేదు. అక్కడ ఏ మరో 8 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం జగన్ కు షాక్ ఇస్తూ ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని తెలిపింది.
రేపు ఉదయం 11 గంటల లోపు కొత్త డీజీపీని నియమించేలా నియామకపత్రాలు పంపాలని సీఎస్ జవహర్ రెడ్డికి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే డీజీ ర్యాంక్ అర్హత కలిగిన ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్‌ను మే 6వ తేదీలోపు సమర్పించాలని, అలాగే వారి గత ఐదు సంవత్సరాల APAR గ్రేడింగ్ మరియు ఎలక్షన్ కమిషన్ కి విజిలెన్స్ క్లియరెన్స్‌ను అందించాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ లో ఏకకాలంలో అసెంబ్లీ, లోకసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అధికార పార్టీ వైసీపీ, ఎన్డీయే కూటమి అయిన టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కోనసాగుతోంది. అయితే ఈ క్రమంలోనే డీజీపీ వీ రాజేంద్రనాథ్ రెడ్డిపై పలుమార్లు ఫిర్యాదులు చేసింది రాజేంద్రనాథ్ రెడ్డి జగన్ సర్కార్ కు ఫెవర్ గా పనిచేస్తున్నారంటూ ఈసీ కి అనేక మార్లు కంప్లైంట్ లు ఇచ్చారు. దీంతో ఎన్నికల సంఘం కఠిన నిర్ణయం తీసుకుని వేటు వేసింది.
Also Read: Lok Sabha Poll : ప్రధాని మోడీ ఫై అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు