HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Dont Fall Into The Trap Of Those Who Create Discord Between People Pawan Kalyan

Pawan Kalyan: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు: పవన్ కళ్యాణ్

కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన, కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ సూచించారు.

  • Author : Gopi Date : 13-09-2025 - 5:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రజలను, పార్టీ శ్రేణులను కోరారు. రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగిస్తూ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందిస్తున్న తరుణంలో ఇలాంటి కుట్రలు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ కుట్రదారుల కుయుక్తులను పదేళ్లుగా చూస్తున్నామని, వారి ఉచ్చులో పడి ఆవేశాలకు లోనై ఘర్షణలకు తావీయవద్దని సూచించారు.

కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ ఛానెళ్ల పేరుతో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల్లో అశాంతి, అభద్రత కలిగించే వారి నైజాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. ఆవేశాలకు లోనైతే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయని హెచ్చరించారు.

Also Read: Kia Seltos: ఈ కియా కారుపై ఏకంగా రూ. 2 ల‌క్ష‌ల డిస్కౌంట్‌!

సమస్యను జటిలం చేయవద్దు

ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటనను ఉదాహరణగా పేర్కొంటూ, ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష వాడడం వెనుక ఉన్న కుత్సిత ఆలోచనను గమనించాలని అన్నారు. ఇలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు పెట్టాలని, తొందరపడి ఘర్షణలకు దిగి సమస్యను జటిలం చేయవద్దని సూచించారు.

చట్ట ప్రకారం చర్యలు

కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన, కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ సూచించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్, విశ్లేషకుల ముసుగులో రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకరంగా మాట్లాడే వారిని భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలబెట్టాలని కోరారు. వీరి వెనుక ఉన్న వ్యవస్థీకృత కుట్రదారులపై కూడా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలని స్పష్టం చేశారు. మచిలీపట్నం వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ జరిపించాలని, ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని నాయకులకు ఆదేశాలు జారీ చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • Deputy CM Pawan
  • Janasena
  • nda govt
  • Pawan Kalyan

Related News

'Made in Jonnagiri' gold enters the market.

Jonnagiri Gold Mine: మార్కెట్లోకి ‘మేడిన్ జొన్నగిరి’ బంగారం

మేడిన్ ఆంధ్ర బంగారం అందుబాటులోకి వచ్చింది. కర్నూలు తుగ్గలి మండలం జొన్నగిరి గోల్డ్‌మైన్స్‌ నుంచి గోల్డ్ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. జియో మైసూర్‌ సంస్థ తయారుచేసిన 50 గ్రాములు, 100 గ్రాములు, 500 గ్రాముల బిస్కెట్లు షాపుల్లో కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మ్యాప్‌తో పాటుగా జొన్నగిరి గోల్డ్‌మైన్స్ పేరుతో ముద్ర వేశారు. ప్రస్తుతం కర్నూలులోని షరాబ్‌ బజారుకు చెందిన కొందరు వ్యాపా

    Latest News

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd