HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Devotee Bitten By Snake In Tirumala

తిరుమలలో భక్తురాలికి పాము కాటు

  • Author : Vamsi Chowdary Korata Date : 23-02-2026 - 9:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tirumala, Snake Bite
Tirumala, Snake Bite
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్‌లో వేచి ఉన్న ఓ భక్తురాలు పాముకాటుకి గురవడంతో కలకలం రేగింది. వెంటనే స్పందించిన టీటీడీ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

వివరాల్లోకి వెళ్తే, తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాకు చెందిన మౌనిక (27) అనే భక్తురాలు ఈరోజు తెల్లవారుజామున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్‌లో వేచి ఉన్నారు. ఆ సమయంలో ఆమెను పాము కాటేసింది. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది ఆమెను హుటాహుటిన తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం మౌనిక ఆరోగ్యం నిలకడగా ఉందని, ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారాన్ని ఆమె కుటుంబసభ్యులకు అందించినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ సంఘటనతో టీటీడీ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భక్తులు వేచి ఉండే క్యూలైన్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు భక్తులకు హామీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap news
  • Ashwini Hospital
  • Bhoopalpally
  • mounika
  • Pilgrim
  • Snake bite
  • Srivari Darshanam
  • Swims Hospital
  • tirumala
  • ttd

Related News

Walking to Tirumala at the age of 116!

TTD: 116 ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!

తిరుమల శ్రీవారిపై ఉన్న అచంచల భక్తితో 116 ఏళ్ల వయసులో ఒక బామ్మ కాలినడకన కొండ ఎక్కింది. యువకులు సైతం ఆయాసపడే మెట్ల మార్గంలో ఆమె ఏ మాత్రం అలసట లేకుండా నడుస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. 116 ఏళ్ల వయసులోనూ కాలినడకన తిరుమల మెట్లు ఎక్కిన ఓ వృద్ధురాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. యువతకే సవాలుగా మారుతున్న ఈ ప్రయాణాన్ని ఆమె

    Latest News

    • Gas supply : గ్యాస్ సరఫరా పై అత్యవసర ఆంక్షలను ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం

    • Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

    • TTD : 116 ఏళ్ల భక్తికి టీటీడీ గౌరవం .. నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : బీఆర్‌ నాయుడు

    • YouTuber Ravan : యూట్యూబర్‌ రావణ్‌పై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదు

    • GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

    Trending News

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd