HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Dondu Donde Is A Big Fan Of Deceiving Auto Drivers Ys Sharmila

YS Sharmila: ఆటో డ్రైవర్లను మోసగించడంలో దొందు దొందే: వైఎస్ షర్మిల

అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీలు ఇచ్చి, పథకంలో కోత పెట్టేందుకు 18 నిబంధనలు ఎందుకు పెట్టారని షర్మిల ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

  • Author : Gopi Date : 05-10-2025 - 8:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Sharmila
YS Sharmila

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీల అమలులో ఘోరంగా విఫలమైందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ‘బారెడు’ ఉంటే వాటి అమలు మాత్రం ‘మూరెడు’ మాత్రమే ఉందని ఆమె ఎద్దేవా చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లను మోసగించడంలో ఎలాంటి తేడా లేదని ఆమె ఆరోపించారు.

‘వాహన మిత్ర’ పథకంలో ఘరానా మోసం

ఆటో డ్రైవర్లకు ఏటా రూ. 15 వేలు ఇస్తామన్న హామీని అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని షర్మిలా రెడ్డి మండిపడ్డారు. “ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, ఎన్నికల ప్రసంగాలకు, ఇప్పుడు అమలు చేసిన రూ. 15 వేల పథకానికి ఎక్కడా పొంతన లేదు. ఖాకీ చొక్కాలు వేసుకుని, ఆటోల్లో తిరిగినట్లు ఫోటోలకు ఫోజులిచ్చి, వారి కుటుంబాలను ఉద్ధరించినట్లు కాకమ్మ కబుర్లు చెప్పి, డ్రైవర్ అన్నలకు మసి పూసి మారేడుకాయ చేశారు” అని ఆమె ధ్వజమెత్తారు.

Also Read: HYDRAA: రూ. 3,600 కోట్ల విలువ గ‌ల ప్ర‌భుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా!

రాష్ట్రంలో ఆర్టీఏ లెక్కల ప్రకారం సుమారు 15 లక్షల మంది బ్యాడ్జ్ కలిగిన డ్రైవర్లు ఉంటే కూటమి ప్రభుత్వం కేవలం 2.90 లక్షల మందికే ఈ పథకాన్ని అందించింది. గత వైసీపీ ప్రభుత్వం 2.60 లక్షల మందికి ఇస్తే చంద్రబాబు కేవలం 30 వేల మందికి మాత్రమే అదనంగా ఇచ్చి 13 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలను విస్మరించారని మండిపడ్డారు. “ఆటో డ్రైవర్లను మోసగించడంలో గత వైసీపీ ప్రభుత్వానికి నేటి కూటమి ప్రభుత్వానికి తేడా లేదు. ఇద్దరూ దొందు దొందే” అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

నిబంధనలతో కోతలే

అర్హతలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని హామీలు ఇచ్చి, పథకంలో కోత పెట్టేందుకు 18 నిబంధనలు ఎందుకు పెట్టారని షర్మిల ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఓనర్ కమ్ డ్రైవర్ విధానాన్ని ఎందుకు ఎంచుకున్నారని, ఆటో తోలుకొని బ్రతికే పేద డ్రైవర్లను ఎలా విస్మరించారని నిలదీశారు. అన్ని మాటలు చెప్పి కేవలం 10 శాతం మందికి మాత్రమే పథకం ఇవ్వడం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిలా రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొన్ని డిమాండ్లు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 13 లక్షల మంది డ్రైవర్లకు పథకాన్ని వర్తింపజేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ. 15 వేల చొప్పున వారి అకౌంట్లలో వేయాలి. ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ వెహికల్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్క డ్రైవర్‌కు కూడా రూ. 15 వేలు అందించాలి. అన్ని వర్గాల డ్రైవర్లతో కూడిన సాధికార సంస్థను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • Auto Drivers
  • CM Chandrababu
  • ys jagan
  • ys sharmila

Related News

YS Jagan pays tribute to YSR.

YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ స్మరణ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి వైఎస్ విజ

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd