HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Dokka Manikya Vara Prasad Quit Ycp

Dokka Manikya Varaprasad : వైసీపీకి మాజీ మంత్రి డొక్కా రాజీనామా

గత కొంతకాలంగా పార్టీలో తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని , పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, కొద్ది రోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్ర కు సైతం పిలుపు రాలేదని..ఇంతకన్నా అవమానం ఏముంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

  • Author : Sudheer Date : 26-04-2024 - 4:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dokka Resign
Dokka Resign

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి షాకులు మరింత ఎక్కువుతున్నాయి. వరుస పెట్టి కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ జగన్ (Jagan) కు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు , ఎమ్మెల్యేలు కిందిస్థాయి నేతలు పార్టీకి గుడ్ బై చెప్పగా..తాజాగా మరో సీనియర్ నేత సైతం పార్టీని వీడారు.

తాడికొండ సీటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ (Dokka Manikya Varaprasad
) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను వైసీపీ అధినేత ,సీఎం జగన్ కు పంపారు. గత కొంతకాలంగా పార్టీలో తనకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని , పార్టీ కార్యక్రమాలకు పిలవడం లేదని, కొద్ది రోజుల కిందట జరిగిన సామాజిక బస్సు యాత్ర కు సైతం పైపులు రాలేదని..ఇంతకన్నా అవమానం ఏముంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. అతి త్వరలో ఈయన టీడీపీ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

2004లో కాంగ్రెస్‌ తరపున గుంటూరు జిల్లాలో రిజర్వుడు నియోజక వర్గమైన తాడికొండలో డొక్కా విజయం సాధించారు. అప్పుడు వైఎస్‌ క్యాబినెట్‌లో చోటు కూడా దక్కించుకున్నారు. 2009లో రెండోసారి ఎన్నికైన తర్వాత కూాడా ఆయన మంత్రి పదవిలో కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత కొన్నాళ్లు స్తబ్దుగా ఉన్నా.. కొద్ది రోజులకే టీడీపీ టీడీపీ గూటికి చేరారు. డొక్కా రాజకీయ గురువైన రాయపాటి ఆశీస్సులు ఉండటంతో టీడీపీలో చేరడం సులువైంది. టీడీపీలో చేరిన తర్వాత డొక్కా మాణిక్య వరప్రసాద్‌కు ఎమ్మెల్సీ పదవిని కూడా కట్టబెట్టారు.

2014-19 మధ్య కాలంలో వైసీపీ మీద రాజకీయ దాడి చేయడంలో దళిత నేతలైన డొక్కా మాణిక్యవరప్రసాద్, జూపూడి జూపూడి ప్రభాకర్‌లు దూకుడుగా వ్యవహరించేవారు. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవని, టీడీపీ రెండోసారి అధికారంలోకి వస్తుందని డొక్కా సవాళ్లు చేస్తూ వచ్చారు. కానీ 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే జూపూడి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ తర్వాత కాలంలో ఆయనకు ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.

సామాజిక సమీకరణల నేపథ్యంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ కూడా రాజకీయ అస్తిత్వాన్ని వెదుక్కునే క్రమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. వైసీపీలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. వైసీపీ తరపు తాడికొండలో గెలిచిన ఉండవల్లి శ్రీదేవి స్థానంలో తనకు అవకాశం దక్కుతుందని డొక్కా భావించారు. తాడికొండ అభ్యర్ధిగా మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితకు అవకాశం దక్కింది. ఈ క్రమంలో రాజకీయంగా తనకు భవిష్యత్తు ఉండదనే ఆందోళన డొక్కాలో నెలకొంది. దీంతో గత కొద్దీ రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇక ఇప్పుడు టీడిపి లో చేరేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తుంది.

Read Also : Delhi Excise Case: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP Elections 2024
  • Dokka Manikya Vara Prasad
  • guntur
  • ycp

Related News

Amaravati Billu

Amaravati Bill: పార్లమెంట్ లో ‘అమరావతి బిల్లు’ కు గ్రీన్ సిగ్నల్ ..వైసీపీ వాకౌట్

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని శాశ్వతంగా ఖరారు చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో చారిత్రాత్మకమైన సవరణ బిల్లును ప్రవేశపెట్టింది

    Latest News

    • Prabhas : ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ ..!

    • Vijay – Trisha Relationship : విజయ్ భార్యను ఉద్దేశించే త్రిష ఆ పోస్ట్ చేసిందా ?

    • Minister Sridhar Babu: మహిళలకు గుడ్ న్యూస్.. తులం బంగారం హామీ అమలుపై మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

    • సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై ఆ అధికారుల‌కే ప్రోత్సాహ‌కాలు!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    Trending News

      • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

      • హైవేలపై ప్ర‌యాణించేవారికి బిగ్ అల‌ర్ట్.. ఏప్రిల్ 10 నుంచి!

      • ఒకటి కంటే ఎక్కువ సార్లు వివాహం చేసుకున్న హీరోయిన్స్ వీరే!

      • బీహార్ రాజకీయాల్లో పెను మార్పు.. జాతీయ రాజకీయాల వైపు నితీష్ అడుగులు!

      • అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం.. 2,076 మంది మృతి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd