‘‘ఇకపై నా భవిష్యత్తు వ్యవసాయమే’’ అంటూ విజయసాయి రెడ్డి ట్విట్టర్ (ఎక్స్) వేదికగా రాసుకొచ్చారు. వాస్తవానికి ఆయన వ్యవసాయం చేయాల్సిన అవసరమేదీ లేదు. రాజకీయాల్లోకి రాకముందు విజయసాయి రెడ్డి(Vijayasai Reddy Plan) ఆడిటర్‌గా చాలా ఫేమస్. ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు కావడంతో, జగన్‌పై అభిమానంతో వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్‌తో కలిసి దాదాపు 16 నెలలు జైలులో కూడా ఉన్నారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత వైఎస్సార్ సీపీలో రాజకీయంగా చక్రం తిప్పడం మొదలుపెట్టారు. 2022 సంవత్సరం జులై నెలలో విజయసాయి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబుకు నాకు దూరపు బంధుత్వం ఉంది. చంద్రబాబు వరసకు నాకు అన్నయ్య అవుతారు’’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. అదే నిజమైతే.. చంద్రబాబుతోనూ విజయసాయికి సాన్నిహిత్యం ఉందన్న మాట. అటువంటి వ్యక్తి వ్యవసాయం చేసుకునే పరిస్థితి దాదాపుగా ఉండకపోవచ్చు. మరేం చేస్తారు.. విజయసాయి రెడ్డి ?
Vijayasai Reddy Plan : వ్యవసాయం కాదు.. విజయసాయిరెడ్డి ఫ్యూచర్ ప్లాన్ అదేనా ?
రాజకీయాల్లోకి రాకముందు విజయసాయి రెడ్డి(Vijaysai Reddy Plan) ఆడిటర్‌గా చాలా ఫేమస్.
- By Pasha Published Date - 07:39 PM, Sun - 26 January 25

Vijayasai Reddy Plan : వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫ్యూచర్ ప్లాన్ ఏమిటి ? వైఎస్సార్ సీపీకి, ఆ పార్టీ వల్ల వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన నెక్ట్స్ ఏం చేయబోతున్నారు ? అనే దానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక కొత్త అంశం ఈ చర్చలోకి వచ్చింది. వివరాలివీ..
Also Read :All about Anuja : ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘అనూజ’.. ఏమిటీ సినిమా స్టోరీ ?
విజయసాయిరెడ్డికి పెద్ద ఫ్యూచర్ ప్లానే ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మీడియా రంగంలోకి ప్రవేశించేందుకే ఆయన పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. ‘‘నేను ఒక న్యూస్ ఛానల్ పెట్టాలని ప్లాన్ చేసినా, జగన్ వద్దన్నారు.ఈసారి మాత్రం ఆయన చెప్పినా వినబోను’’ అని కొన్ని నెలల కిందట విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్సార్ సీపీలో ఉండి న్యూస్ ఛానల్ పెడితే.. దానిపై పార్టీ ముద్ర పడే ఛాన్స్ ఉంటుందని విజయసాయి భావించి ఉండొచ్చు. న్యూట్రల్‌గా ఉంటూ న్యూస్ ఛానల్‌ను నడిపితేే మంచి క్రెడిబిలిటీ, స్వేచ్ఛ దక్కుతాయని ఆయన అనుకొని ఉండొచ్చు. ఒకవేళ ఈ ఊహాగానాలే నిజమైతే తెలుగు మీడియా ప్రపంచంలోకి మరో న్యూస్ ఛానల్ వస్తుంది.