Budget 2025 Expectations : ఉద్యోగులు, చిరువ్యాపారులు, ప్రొఫెషనల్స్.. కేంద్ర బడ్జెట్‌లో ఏమున్నాయ్ ?
ఆదాయపు పన్ను(Budget 2025 Expectations) కనీస మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉంది.
- By Pasha Published Date - 06:21 PM, Sun - 26 January 25

Budget 2025 Expectations : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే జనవరి 31న ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సెషన్, ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుంది. రెండోవిడత బడ్జెట్ సెషన్ మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనుంది. ఈసారి కేంద్ర బడ్జెట్ ఎలా ఉండబోతోంది? సామాన్యులకు ఏమేం ఇవ్వబోతోంది ? చిరు వ్యాపారులకు ఎలాంటి శుభవార్తలను వినిపించబోతోంది ? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Uniform Civil Code : జనవరి 27 నుంచి యూసీసీ అమల్లోకి.. కీలక రూల్స్ ఇవీ
కేంద్ర బడ్జెట్‌పై కీలక అంచనాలివీ..
- ఆదాయపు పన్ను(Budget 2025 Expectations) కనీస మినహాయింపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల వేతన జీవులు/ఉద్యోగ వర్గాలకు ప్రయోజనం దక్కుతుంది.
- ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా ఆదాయపు పన్ను శ్లాబ్‌లలో మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది.
- ఆదాయపు పన్ను చట్టంలోని 44ఏడీ, 44ఏడీఏ సెక్షన్లకు సవరణలను ప్రతిపాదించే అవకాశం ఉంది. ప్రిజంప్టివ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే చిన్న వ్యాపారులు, ప్రొఫెషనల్స్ వార్షిక టర్నోవర్ పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తోంది. ఏటా రూ.2 కోట్లలోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపారులు, ప్రొఫెషనల్స్ ప్రస్తుతం ఈ కేటగిరిలో ఉన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆర్జించే అవకాశమున్న అంచనా ఆదాయం ఆధారంగా ప్రిజంప్టివ్ ట్యాక్స్‌ను విధిస్తారు.
Also Read :Rain Free In Cafe : ఈ కేఫ్‌లో వర్షం ఫ్రీ.. కాఫీని సిప్ చేయగానే జోరువాన
- ఆదాయపు చట్టంలోని సెక్షన్ 24(బీ) కింద గృహ రుణాలపై వడ్డీ మినహాయింపును క్లెయిమ్ చేసుకునే పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచే అవకాశం ఉంది.
- గృహ రుణాలు తీసుకున్న వారికి సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.50 లక్షలకు పెంచే ఛాన్స్ ఉంది.
- 1961లో అమల్లోకి తెచ్చిన ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ‘‘నూతన ఆదాయపు పన్ను బిల్లు’’ను అమల్లోకి తేవాలని కేంద్రం యోచిస్తోంది. దీని గురించి కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. 2025 సంవత్సరం చివర్లోగా ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది.