All about Anuja : ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘అనూజ’.. ఏమిటీ సినిమా స్టోరీ ?
ఆ నిర్ణయంతో అనూజ, పాలక్ జీవితాలు ఎలా మారుతాయి ? అనేది ఈ సినిమా స్టోరీలో(All about Anuja) ఉంటుంది.
- By Pasha Published Date - 06:54 PM, Sun - 26 January 25

All about Anuja : భారతీయ కథ ఆధారంగా తెరకెక్కిన ‘అనూజ’ అనే లఘు చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయింది. ఈ మూవీ నిడివి 23 నిమిషాలే. అయినా ఆస్కార్ రేంజు ఉందని నిరూపించుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘అనూజ’ ఆస్కార్‌కు నామినేట్ అయింది. ప్రియాంకా చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఆడమ్ జె. గ్రేవ్స్ డైరెక్టరుగా వ్యవహరించిన ఈ మూవీతో ముడిపడిన విశేషాలను తెలుసుకుందాం..
Also Read :Budget 2025 Expectations : ఉద్యోగులు, చిరువ్యాపారులు, ప్రొఫెషనల్స్.. కేంద్ర బడ్జెట్‌లో ఏమున్నాయ్ ?
‘అనూజ’ కథ ఇదీ..
అనూజ సినిమా కథ భారతదేశ రాజధాని నగరం ఢిల్లీ కేంద్రంగా సాగుతుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒక టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు. అనూజ వయసు తొమ్మిది సంవత్సరాలు. ఆమె చిన్నారి సోదరి పేరు పాలక్. అనూజ పాత్రను సజ్దా పఠాన్ పోషించింది. పాలక్ పాత్రలో అనన్య నటించింది. బాల కార్మికులకు విముక్తి కల్పించి విద్యావకాశాలు, వసతి కల్పించడంపై ‘సలాం బాలక్ ట్రస్ట్’ సెంటర్ పనిచేస్తుంటుంది. ఇందులోనే అనూజ, పాలక్ ఆశ్రయం పొందుతారు. వారిద్దరూ జీవితంలో చాలా సవాళ్లను ఎదుర్కొంటారు. వాటి గురించి అక్కాచెల్లెళ్ల మధ్య సంభాషణ సాగుతుంటుంటే.. సినిమా కథ ముందుకు నడుస్తుంటుంది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా తొమ్మిదేళ్ల అనూజకు ఓ పేరున్న పాఠశాలలో చదువుకునే అవకాశం లభిస్తుంది. ఆ సమయంలో అనూజ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? ఆ నిర్ణయంతో అనూజ, పాలక్ జీవితాలు ఎలా మారుతాయి ? అనేది ఈ సినిమా స్టోరీలో(All about Anuja) ఉంటుంది.
ప్రతి 10 మంది బాలికలలో ఒకరు..
యూనిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మంది బాలికలలో ఒకరు బాల కార్మికులుగా ఉన్నారు. ఈ గణాంకాలను చూసిన తర్వాతే తాను ‘అనూజ’ సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు దర్శకుడు ఆడమ్ జె. గ్రేవ్స్ తెలిపారు. బాలిక కార్మికులుగా ఉన్న అమ్మాయిల సామర్థ్యాలను చూసి తాను ముగ్ధుడిని అయినట్లు చెప్పారు.
2023లో మనకు వచ్చిన ఆస్కార్‌లు ఇవే..
2023లో ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్రానికి డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో గునీత్ మోంగా, కార్తికి గోన్సాల్వేస్‌లు ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. 2023లోనే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు-నాటు’ పాటకు ‘ఒరిజినల్ సాంగ్’ విభాగంలో సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ గెలుచుకున్నారు.