HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Discussion Around The Meetings Of Telugu States Chief Ministers In Davos

AP TG CMs Davos Tour: దావోస్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఏం చర్చించారంటే?

రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్‌)లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి దావోస్‌ చేరుకున్నారు.

  • Author : Vamsi Chowdary Korata Date : 20-01-2025 - 5:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Tg Cms Davos Tour
Ap Tg Cms Davos Tour

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు ఈరోజు (సోమవారం) దావోస్‌ వెళ్లారు. జ్యూరిచ్‌ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, కింజారపు రామ్మోహన్ నాయుడు అధికారుల బృందానికి యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. పెట్టుబడిదారులతో జ్యూరిచ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సమావేశం కానున్నారు. అయితే అంతకముందు జ్యూరిచ్‌ విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది.

దావోస్ లో భేటీ అయిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి #ChandrababuNaidu #RevanthReddy meet in #Davos #HashtagU pic.twitter.com/a0g0uFYEq9

— Hashtag U (@HashtaguIn) January 20, 2025

చంద్రబాబు ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో తెలుగు సంతతికి చెందిన పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. అక్కడి నుంచి దావోస్‌కు వెళ్తారు. అనంతరం, పారిశ్రామిక వేత్తలతో ఆర్సెలర్స్ మిట్టల్ సంస్థ యజమాని లక్ష్మీ మిట్టల్‌తో డిన్నర్ మీట్ ఉంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రెండో రోజు దావోస్‌లో గ్రీన్ హైడ్రోజన్‌ పై జరుగుతున్న ప్రత్యేక సెషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. అలాగే, కోకాకోలా, ఎల్‌జీ మరియు ఇతర ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులు ఆకర్షించడం మాత్రమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్‌లో పర్యటిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మరియు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. రాష్ట్రాలలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తున్నారు. ఈ మేరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు కూడా దావోస్‌లో పర్యటిస్తున్నారు.

దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు, జ్యూరిచ్ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు మరియు అధికారుల బృందానికి జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు #APatWEF #ChandrababuNaidu #AndhraPradesh #NaraLokesh #HashtagU pic.twitter.com/PLw2hHT5i2

— Hashtag U (@HashtaguIn) January 20, 2025

యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్‌తో భేటీ అవబోతున్నారు.. ఎనర్జీ ట్రాన్సిషన్‌, ది బ్లూ ఎకానమీ అంశాలపై జరిగే సెషన్లలో చంద్రబాబు ప్రధాన ఉపన్యాసం ఉంటుంది. దావోస్ టూర్‌లో నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వూలు ఇవ్వనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ సదస్సులో భాగంగా మూడోవ రోజు పలువురు వ్యాపారవేత్తలు, వాణిజ్య సంస్థల యజమానులు, మరియు ప్రతినిధులతో సమావేశం అవుతారు. చంద్రబాబు అండ్ టీమ్ నాలుగోవ రోజు జ్యూరిచ్‌ చేరుకుని అక్కడి నుంచి భారత్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Davos Tour
  • AP TG CMs Davos Tour
  • CM Chandrababu Naidu
  • CM Revanth Reddy
  • Kinjarapu Ram Mohan Naidu
  • Minister Sridhar Babu
  • nara lokesh
  • TG CM Davos Tour

Related News

CM Revanth Reddy's meeting cancelled.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్‌కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధిర నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగ

  • Balayya's NBK 112th film launched...

    బాలయ్య NBK 112వ చిత్రం ప్రారంభం..

  • Ram Charan's shocking reaction to being compared with Nara Lokesh; comments at the Republic Summit go viral.

    Nara Lokesh – Ram Charan: నారా లోకేష్‌తో పోలికపై రామ్ చరణ్ షాకింగ్ రియాక్షన్.. రిపబ్లిక్ సమిట్‌లో కామెంట్స్ వైరల్

  • CM Revanth Reddy's meeting cancelled.

    Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

Latest News

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

  • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

  • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

  • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd