kakinada : బియ్యం యదేచ్చగా తరలిపోతుంటే ఏం చేస్తున్నారు?..మీకు బాధ్యత లేదా?.. పవన్ కళ్యాణ్
ఇక ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Author : Latha Suma
Date : 29-11-2024 - 3:14 IST
Published By : Hashtagu Telugu Desk
Illegally Transport : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు నుండి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్‌లో పవన్ కళ్యాణ్ వెళ్లారు. సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణా కు సిద్ధమైన 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూసారు. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను పవన్ ఆరా తీశారు.
కాకినాడ పోర్టులో ఇటీవల 640 టన్నుల బియ్యాన్ని పట్టుకున్న ప్రాంతానికి నౌకలో వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ బియ్యం అక్రమ రవాణాపై స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, పోర్టు అధికారులపై మండిపడ్డ పవన్.#PawannKalyan #AndhraPradesh #janasenaparty #TDP #HashtagU pic.twitter.com/QlWuzqfjmZ
— Hashtag U (@HashtaguIn) November 29, 2024
పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. అక్రమ రేషన్ బియ్యం యదేచ్చగా తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా అధికారులను పోర్టు అధికారులను పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా, రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న వారు ఎంత వారైనా చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.
ఇకపోతే..కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రధాని మోడీకి, రాష్ట్ర హోంమంత్రి అనితకు, దర్యాప్తు సంస్థలకు లేఖలు సిద్ధం చేయాలని తన వ్యక్తిగత కార్యదర్శిని ఆదేశించారు. ఇక్కడ ఎన్నో జాతీయ సంస్థలు, పెద్ద కంపెనీలు ఉన్నాయని… అక్రమ రవాణా మార్గాల్లో ప్రమాదకర శక్తులు వస్తే ఆయా సంస్థలు, కంపెనీల రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు అక్రమ రవాణా జరగవని గ్యారంటీ ఏంటి? ఈ అక్రమ మార్గాల్లో కసబ్ వంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం ఉండదా? దీనిపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించాలి అని పవన్ అన్నారు. కాగా, పోర్టు నుండి పేదల బియ్యం(పీడీఎస్) విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యలో పవన్ తనిఖీలకు చేపట్టారు.
Read Also: Notices : వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు