Andhra Pradesh Conistable : వినాయక నిమజ్జనం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన గంధం నరేంద్ర
వినాయక నిమజ్జనం బందోబస్తుకు వెళ్లిన గంధం నరేంద్ర అనే కానిస్టేబుల్ (Conistable)పై మద్యం మత్తులో ఆకతాయిలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
- Author : Prasad
Date : 02-10-2023 - 3:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఏలూరు జిల్లా ఆగిరిపల్లి వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం బందోబస్తుకు వెళ్లిన గంధం నరేంద్ర అనే కానిస్టేబుల్ (Conistable)పై మద్యం మత్తులో ఆకతాయిలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. నిమజ్జనం సందర్భంగా డీజే ఏర్పాటు చేసుకున్న యువకులు నిమజ్జనం పూర్తయిన తరువాత కూడా డీజే పాటలతో డ్యాన్సులు వేస్తుండటంతో కానిస్టేబుల్ నరేంద్ర ఆ డీజేని ఆపమని కోరగా మద్యం మత్తులో ఉన్న యువకులు కానిస్టేబుల్ (Conistable) నరేంద్రపై దాడికి యత్నించారు. తలపై కర్రతో కొట్టడంతో నరేంద్ర ఆపస్మారకస్థితిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న తోటి సిబ్బంది నరేంద్రని హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ప్రవేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. నిన్న రాత్రి చికిత్స పొందుతూ నరేంద్ర మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
We’re now on WhatsApp. Click to Join.
హైదరాబాద్ నుంచి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి నరేంద్ర మృతదేహాన్ని పోస్టుమర్టం కోసం తరలించారు. పోస్టుమర్టం అనంతరం నరేంద్ర స్వగ్రామం పోలిశెట్టిపాడుకు మృతదేహాన్ని కుటుంబసభ్యులు తీసుకువెళ్లనున్నారు. నరేంద్ర మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. నరేంద్ర స్వగ్రామం ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలంలోని పోలిశెట్టిపాడు గ్రామం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన నరేంద్ర కానిస్టేబుల్ (Conistable) ఉద్యోగం సాధించాడు. నరేంద్రకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేంద్ర మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నరేంద్రను కడసారి చూసేందుకు గ్రామస్తులు, బంధువులు,స్నేహితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
Also Read: Chiranjeevi Trust: నేటితో చిరంజీవి ట్రస్టుకు 25 ఏళ్లు, మెగాస్టార్ ఎమోషనల్ మెసేజ్ !