HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Congress To Field Candidates From All 175 Assembly Constituencies In A P

YS Sharmila: 175 స్థానాల్లో పోటీకి దిగుతున్నాం: ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు షర్మిల రాకతో ఊపందుకున్నాయి. అక్కడ ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకు ధీటుగా షర్మిల పేరు వినిపిస్తుంది. ఇక తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.

  • Author : Vamsi Chowdary Korata Date : 22-01-2024 - 5:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Sharmila
Ys Sharmila

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు షర్మిల రాకతో ఊపందుకున్నాయి. అక్కడ ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీలకు ధీటుగా షర్మిల పేరు వినిపిస్తుంది. ఇక తాజాగా ఆమె తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు.

ఆంధ్ర రత్న భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షర్మిల మాట్లాడుతూ.. జనవరి 24 నుంచి టికెట్‌ ఆశించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణను అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ఇన్‌చార్జి మాణికం ఠాగూర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా షర్మిల జనవరి 23 నుండి అన్ని జిల్లాల పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారు. జనవరి 31 వరకు సమావేశాలు కొనసాగుతాయి అని ఏపీ కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ప్రతి రోజు మూడు జిల్లాలు కవర్ కవర్ చేయనున్నారు. ఈ జిల్లాలో పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్ లో చేరడం జరుగుతుందని ఆమె తెలిపారు.

సోమవారం ఏపీసీసీ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం షర్మిల మంగళవారం ఒడిశా సరిహద్దులోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి తన పర్యటనను ప్రారంభించి జనవరి 31న కడప జిల్లా ఇడుపులపాయలో ముగించనున్నారు. ఆమె ప్రతిరోజూ రెండు మూడు జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో మొత్తం 25 జిల్లాలను కవర్ చేయనున్నారు. జనవరి 24న విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలతోపాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, 25న పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. జనవరి 26న తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో, జనవరి 27న కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో, జనవరి 28న బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో షర్మిల పర్యటించనున్నారు. జనవరి 29న తిరుపతి, చిత్తూరు, అన్నమయ జిల్లాలు, ఆ తర్వాత జనవరి 30న శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో, 31న నంద్యాల, కడప జిల్లాల్లో ఆమె పర్యటిస్తారు

గత 10 సంవత్సరాలుగా పార్టీకి దూరంగా ఉన్న ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులను తిరిగి పార్టీలోకి ఆకర్షిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ నూతన అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అనేక ఆరోపణలు చేసిన షర్మిల ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

Also Read: Mahesh Babu-Rajamouli: రాజమౌళి సినిమాకు మహేశ్ రెడీ, ఇదిగో క్రేజీ అప్డేట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 175 constituencies
  • candidates
  • cm jagan
  • congress
  • tdp
  • ys sharmila
  • ysrcp

Related News

Indiramma Houses

CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ సోమ‌వారం ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండవ దశను ప్రారంభించనున్నారు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. ఈ పథకం మొదటి దశ కింద కేరమేరి మండలం, కొత్తారి గ్రామంలో కోలం తెగకు చెందిన ఆదివాసుల కోసం నిర్మించిన 28 ఇందిరమ్మ ఇళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గృహప్రవేశం చేస్తారు. ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం రెండ

  • Dk Shivakumar

    Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • CM Revanth

    CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • CM Revanth Reddy

    Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd