HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Come With Investments Seize Opportunities Cm Chandrababu

CM Chandrababu: పెట్టుబడులతో రండి.. అవకాశాలు అందుకోండి: సీఎం చంద్ర‌బాబు

పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హెల్డింగ్స్ సంస్థకు చెందిన పొర్ట్ ఫొలియో డెవలప్మెంట్, కార్పోరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు.

  • Author : Gopi Date : 30-07-2025 - 5:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అపార వనరులున్నాయని, వ్యాపార అభివృద్ధికి పెద్ద ఎత్తున అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) నాయుడు సింగపూర్‌లోని వివిధ దిగ్గజ సంస్థల ప్రతినిధులను కోరారు. సింగపూర్ పర్యటన చివరి రోజున పలు కంపెనీలకు చెందిన ప్రముఖులతో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం రూపొందించుకున్న ప్రణాళికలను ఆయా సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. వివిధ రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి… కీలక కంపెనీలుగా ఉన్న కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్, టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు వేర్వేరుగా భేటీ అయ్యారు. రియలెస్టేట్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీయల్ పార్కులు, డేటా సెంటర్లు, గ్రీన్ బిల్డింగ్స్, డిజటల్ టౌన్ షిప్స్ వంటి అంశాలపై కెపిటాల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్ (ఇండియా) ప్రతినిధులు సంజీవ్ దాస్ గుప్తా, గౌరీశంకర్ నాగభూషణంలతో సీఎం చర్చించారు.

అమరావతి, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లో ఐటీ పార్కులు, ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలతో కూడిన వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు వారికి వివరించారు. రాష్ట్రంలో పోర్టులు, ఎయిర్ పోర్టుల ద్వారా అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నామనే అంశాన్ని సీఎం చర్చించారు. హైదరాబాద్-బెంగళూరు-అమరావతి-చెన్నైల మధ్య ఎయిర్ పోర్టు ఎకనమిక్ కారిడార్ గురించి సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం ఐటీ పార్కుల్లో 30-35 శాతం ఐటీ పార్కుల్లో తాము పెట్టుబడులు పెట్టామని ఆ సంస్థ ప్రతినిధులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. రియల్ ఎస్టేట్ సహా పారిశ్రామిక రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కెపిటాల్యాండ్ ఇండియా ప్రతినిధులు ఆసక్తి కనబరిచారు.

డాల్ఫిన్ సిటీ… బొటానికల్ గార్డెన్

మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సంస్థతో జరిగిన సమావేశంలో వైల్డ్ లైఫ్ పార్కులు, ఎకో టూరిజం, బయో డైవర్శిటీ కాంప్లెక్సులు, వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియెన్స్ జోన్ల ఏర్పాటు వంటి అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు. వైజాగ్, తిరుపతి వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజం రంగంలో భాగస్వామ్యంతో వెళ్తే మంచి చక్కటి అభివృద్ధి సాధించవచ్చని ఆ గ్రూప్ సీఈఓ మైక్ బార్క్‌లేకు సీఎం సూచించారు. సింగపూర్ గార్డెన్ సిటీ, జూ పార్క్ మోడళ్లను ఏపీలో అమలు చేసే అంశంపై సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. వైజాగ్‌లో డాల్ఫిన్ సిటీ, అమరావతిలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలతో వెళ్తున్నామని.. వాటిల్లో మందాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేయాలని కోరారు.

Also Read: Cardamom Milk : రాత్రిపూట యాలకుల పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

ఈ మేరకు ఆయా రంగాల్లో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు బార్క్ లే సుముఖత వ్యక్తం చేశారు. ఇక పరిశ్రమలు, మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, నగరాభివృద్ధి వంటి రంగాల్లో పెట్టుబడులపై జపాన్‌కు చెందిన సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పోరేషన్-SMBC మేనేజింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజీవ్ కన్నన్‌తో ముఖ్యమంత్రి సమాలోచనలు జరిపారు. లేపాక్షి, ఓర్వకల్లు ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న డ్రోన్ సిటీ, డిఫెన్స్, సివిల్ ఎరో స్పేస్ కారిడార్ వంటి ప్రాజెక్టుల గురించి రాజీవ్ కన్నన్‌కు సీఎం వివరించారు. ఓర్వకల్లు, లేపాక్షిల్లోని ప్రాజెక్టులకు అవసరమైన మేరకు ఫైనాన్సింగ్ చేసే అంశంపై కన్నన్‌తో కీలక చర్చ జరిగింది. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, పారిశ్రామి కారిడార్ల ప్రణాళికలకూ సహకారం అందించాలని సీఎం కోరారు. ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ లెండింగ్, క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని రాజీవ్ కన్నన్ చెప్పారు.

ఎంఎస్ఎంఈలు… ఏపీఐఐసీ… జాయింట్ వెంచర్లు

పెట్టుబడుల రంగంలో దిగ్గజ కంపెనీగా ఉన్న టెమాసెక్ హెల్డింగ్స్ సంస్థకు చెందిన పొర్ట్ ఫొలియో డెవలప్మెంట్, కార్పోరేట్ స్ట్రాటజీ విభాగం జాయింట్ హెడ్ దినేష్ ఖన్నాతో సీఎం చంద్రబాబు కీలక చర్చలు జరిపారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఆ సంస్థ నుంచి సహకారం కోరారు. ఎంఎస్ఎంఈ రంగంలో ఏపీ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు భాగస్వాములుగా ఉండేందుకు టెమాసెక్ హెల్డింగ్స్ ఆసక్తి కనబరిచింది. అలాగే ఏపీఐఐసీతో కలిసి పనిచేస్తే అభివృద్ధికి మరింత ఉపయుక్తంగా ఉంటుందని సీఎం సూచించారు. దీంతోపాటు వివిధ రంగాల్లో జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు చేపట్టే అంశంపైనా చంద్రబాబు-దినేష్ ఖన్నా మధ్య జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, వైద్యారోగ్యం, టెక్నాలజీ, సుస్థిర మౌలిక వసతుల కల్పన వంటి రంగాల్లో ఏపీలో ఉన్న అవకాశాలను దినేష్ ఖన్నాకు సీఎం వివరించారు. ఈ మేరకు వివిధ రంగాల్లో ఎంఓయూలు కుదుర్చుకునే అంశాన్ని పరిశీలిస్తామని ఖన్నా చెప్పారు. ఈ వరుస సమావేశాల్లో మంత్రులు నారాయణ, టీజీ భరత్, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • CM Chandrababu
  • Investments
  • singapore

Related News

A Royal Dream for Seema... The Roar of the AMCA in Puttaparthi

Puttaparthi: సీమకు రాయల్ కల…. పుట్టపర్తిలో AMCA గర్జన!

పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది. కొంతకాలంగా భారీ పెట్టుబడులు ఒక్కొక్కటిగా రాయలసీమలో అడుగుపెడుతున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ దిగ్గజం రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకతో సీమ రూపురేఖలు మారబోతుండగా, మరోవైపు పుట్టపర్తి వేదికగా దేశ రక్షణ రంగంలోనే అత్యంత కీలకమైన AMCA ప్రాజెక్టుకు అడుగులు పడుతుండటం సంచలనంగా మారింది. రాయలసీమను ఆటోమొబైల్ హబ్‌గా మార్చాలన్న లక్ష్యం దిశగా ప్రభుత్

  • IT Minister Nara Lokesh Receives Grand Welcome At Singapore

    Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

  • Free Mineral Water Plant Inaugurated in Lakshmipuram

    Lakshmipuram: లక్ష్మీపురంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం..

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd