HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Colours Of The Coromandel Coast

మచిలీపట్నం గతమెంత వైభవమో మీకు తెలుసా?

మచిలీపట్నం గురించి చెప్పాలంటే.. తుపానుకు ముందు తుపాన్ తర్వాత అని చెప్పుకోవాలి. ఒకప్పుడు ఓడరేవులకు ప్రసిద్ధి అయిన మచిలీపట్నం ఇప్పుడు మురికిరోడ్లతో, సేమ్ సీన్ తో మార్కెట్లు, బస్ స్టాప్ తో కనిపిస్తుంది.

  • By Hashtag U Published Date - 12:10 PM, Wed - 27 October 21
  • daily-hunt

మచిలీపట్నంలో అభివృద్ధి చెందిన వస్త్ర వ్యాపారం, వజ్రాల వ్యాపారుల కాలం పోయింది.అంతెందుకు ప్రసిద్ధ ఓడరేవు కూడా ఇప్పుడు మత్స్యకార కుగ్రామంగా మారిపోయింది. కానీ ఇప్పటికీ అక్కడ ఇప్పటికీ చాలా అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. గోల్కొండ రాజ్యపు ఓడరేవుగా మచిలీపట్నపోర్టుకు ఎంతో గుర్తింపు ఉండేది. ఒకే ఒక తుపాన్ మచిలీపట్నం ఓడరేవు రూపురేఖల్ని మార్చేసింది. కానీ దాని గతవైభవాన్ని చరిత్ర పేజీల్లోంచి ఎవరూ తీసేయలేరన్నది పచ్చి నిజం.

ఓడరేవు పట్టణం..
భూగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రజ్ఞుడు, ఖగోళ శాస్త్రవేత్త అయిన టోలెమీ రాసిన బుక్ లో మచిలీ పట్నం గొప్పతనాన్ని వివరించారు. ముందుగా పడవలు, ఎడ్లబండి మీదే చాలా వ్యాపారాలు సాగించేవారని చెప్పారు. ఐరోపా, ఆగ్నేయ పశ్చిమాసియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న ఆంధ్రాలోకి ఈస్ట్ ఇండియా వ్యాపారులు ఎంటర్ అయ్యారు. చివరకు కోరమండల్ తీరంలోనే వారి మకాం వేసి.. ఆఫీస్ లు కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. ఈ సమయంలో ఈస్ట ఇండియా కంపెనీ వాళ్లు.. డచ్, పోర్చుగీస్, ఫ్రెంచి వారితో పోరాడవలసి వచ్చింది, గోల్కొండ రాజుతో పాటు అధికారులను మచ్చిక చేసుకుని శాంతి మంత్రాన్ని జపించారు. ఏదేమైనప్పటికీ, సంవత్సరాలు గడిచేకొద్దీ, మద్రాసు, కోల్ కతా, మచిలీపట్నంలో వ్యాపారాలు బాగా తగ్గిపోయినా.. రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగాయన్న గుర్తింపు పొందాయి.
ఇప్పుడు బందర్ అని పిలువబడే ఓడరేవు, రైల్వే స్టేషన్‌కు అటువైపు ఉన్న విస్తారమైన బంజరు భూమిలో ఉంది. 1863 వరకూ బాగా ఉన్న ఓడరేవు 1864 లో వచ్చిన తుపాన్ అక్కడ శిధిలాలను మిగిల్చింది. మచిలీపట్నం తీరం బీచ్‌ సరిగా లేకపోవడంతో.. పాత ఓడరేవు ఈస్ట్యూరీని ఆక్రమించింది. సముద్రం అక్కడే ఉంది. కానీ అక్కడ కాలు తడుపుకోవడానికి కూడా పనికిరాదు. అక్కడ నుంచి 11కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫేమస్ ప్లేస్ అయిన మంగినపూడికి వెళ్లాలి. 1864 నవంబర్ 1న వచ్చిన తుపాన్ వల్ల 30వేలమంది కెరటాలలో కొట్టుకుపోయి చనిపోయారు. దీంతో మచిలీపట్నం నిర్వీర్వంగా మారిపోయింది. ఆ తుపాన్ నుంచి బయటపడిన 17వ శతాబ్దపు వ్యక్తి చెప్పినట్లుగా మచిలీపట్నంలో హోలీక్రాస్ చర్చి, సెయింట్ ఆండ్రూ చర్చి మాత్రం చెక్కుచెదరలేదు.

రంగులతో కూడిన బ్రష్
ఇక్కడ కొన్ని చిత్రాలు మాత్రం అద్భుతమైన రంగుల వస్త్రాల కంటే కూడామచిలీపట్నం జ్ఞాపకాలను తిరిగి తెచ్చాయని చరిత్రకారులు చెబుతుంటారు. ఆంధ్రా తీరంలో యూరోపియన్లతో గుంపులు గుంపులుగా దిగిన ప్రింటెడ్ కాటన్లు మచిలీపట్నం మూలాధారాలుగా నిలిచాయి. కలంకారి అంటే పిట్టను ఉపయోగించడంలో నైపుణ్యం అని అర్ధం. ఇది మచిలీపట్నంతో పాటు శ్రీ కాళహస్తిలో మాత్రమే కనిపించే కళ. శ్రీ కాళహస్తిలో డిజైన్ గీసి మైనం ద్వారా రంగులు నింపుతారు. మచిలీపట్నంలో చెక్కిన చెక్క దిమ్మెలతో ప్రింట్ వేస్తారు. ఇవి ఎక్కువగా వాల్ హ్యాంగింగ్‌లు..తరువాత బెడ్‌స్ప్రెడ్‌లు, కర్టెన్‌లు కుషన్ కవర్‌లుగా కనిపిస్తాయి. మచిలీపట్నం చుట్టుపక్కల చాలా గ్రామాలలో ప్రింటెడ్ కాటన్ల ఉత్పత్తిలో పేరుగాంచింది. అయితే 18వ శతాబ్దంలో మెషీన్‌తో తయారు చేసిన వస్త్రాలు వాటి మనుగడకు ముప్పు తెచ్చాయి. దీనివల్ల కలంకారీల మనుగడ కష్టంగా మారింది. మచిలీపట్నం నుండి 7 కి.మీ దూరంలో ఉన్న పెడన గ్రామంలో.. మచిలీపట్నం కలంకారి ప్రక్రియలో బ్లాక్, పెన్ అనే రెండు 10 దశల్లో తయారుచేస్తారు. కలంకారిలో ఉపయోగించే రంగులు మొక్కల నుండి తీసుకుంటారు. తర్వాత వాటిని ఎండలో ఆరబెట్టాలి. కలంకారి డిజైన్‌లు ఆకర్షణీయమైన ఎరుపు, నలుపు , పసుపు రంగులలో ఉంటాయి. అక్కడ, బెడ్‌స్ప్రెడ్‌లు, దిండు కవర్లు, బట్టల సంచులు లుంగీలను తయారుచేస్తారు.

ఎ గ్లింప్స్ ఆఫ్ బెజవాడ

మచిలీపట్నంలో పర్యాటకులు బస చేయడానికి మంచి ప్రదేశాలు లేవు.కాబట్టి విజయవాడ నుంచి 68 కి.మీ దూరంలో వెళ్లి మచిలీపట్నం చేరుకోవచ్చు. పూర్వం బెజవాడగా పిలువబడే విజయవాడ ఇప్పుడు తీరప్రాంత ఆంధ్ర యొక్క వాణిజ్య కేంద్రంగా ఉంది. ఈ నగరం కృష్ణానది ఒడ్డున ఉన్న సుసంపన్నమైన తీర డెల్టాలో విస్తరించి ఉంది.మూడు వైపులా ఇంద్రకీలాద్రి కొండలతో అందంగా ఉంటుంది. నదికి అడ్డంగా ఉన్న 4,014 అడుగుల పొడవైన ప్రకాశం బ్యారేజ్, ఒక పురాతన ఆనకట్ట ఉన్న ప్రదేశంలో ఉంది. అక్కడ ఉన్న బౌద్ధ ఉండవల్లి గుహలు, భవానీ ద్వీపం, దుర్గమ్మ టెంపుల్ పర్యాటకంగా పేరు గాంచాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandar port
  • kalamkari
  • machilipatnam
  • tourism
  • vijayawada

Related News

Ap Liquor Scam Case

ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

నిందితులు ఇప్పటికే అనేకసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ, కోర్టు వాటిని తిరస్కరించింది. చివరికి శనివారం విచారణలో ముగ్గురికీ బెయిల్ మంజూరవ్వడం కేసులో కీలక పరిణామంగా నిలిచింది. ఈ కేసులో ధనుంజయ్ రెడ్డి ఏ31, కృష్ణమోహన్ రెడ్డి ఏ32, బాలాజీ గోవిందప్ప ఏ33 నిందితులుగా ఉన్నారు.

  • Vijayawada-Bengaluru flight narrowly misses major danger

    Vijayawada : విజయవాడ, బెంగళూరు విమానానికి తప్పిన పెను ప్రమాదం

  • Glass bridge ready for tourists on Kailashgiri in Visakhapatnam..Here is the video of the glass bridge!

    Glass Bridge : పర్యాటకుల కోసం విశాఖ కైలాసగిరిపై గాజు వంతెన సిద్ధం..అద్దాల వంతెన వీడియో ఇదిగో!

  • Everest

    Everest : ఇక సింగిల్ గా ఎవరెస్ట్ ఎక్కడం కుదరదు..ఎందుకంటే !!

Latest News

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Team India Jersey: టీమిండియా న్యూ జెర్సీ చూశారా? స్పాన్సర్‌షిప్ లేకుండానే బ‌రిలోకి!

  • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

  • BCCI: డ్రీమ్ 11తో ముగిసిన ఒప్పందం.. బీసీసీఐ రియాక్ష‌న్ ఇదే!

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd