AP: గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సీఎం…అందరికీ పెన్షన్లు పెంపు..!!!
ఏపీలో పెన్షన్ దారులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచుతున్నారు ప్రకటించారు. ఈ
- By hashtagu Published Date - 02:29 PM, Fri - 23 September 22

ఏపీలో పెన్షన్ దారులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచుతున్నారు ప్రకటించారు. ఈ పెన్షన్ను వచ్చే జనవరి నుంచి లబ్దిదారులకు అందించనున్నట్లు తెలిపారు. తాజాగా పెరిగిన దానితో మొత్తం 2,750రూపాయలు కానుంది. దీంతోపాటుగా రానున్నరోజుల్లో మూడు వేల వరకు పెన్షన్ పెంచుతామన్నారు. అయితే ఈ శుభవార్తను కుప్పం వేదిక నుంచి ప్రకటించారు జగన్.
టీడీపీ అధినేత నియోజకవర్గం మీద స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. అందులో భాగంగానే నియోజవర్గ డెవలప్ మెంట్ పలు హామీలు కూడా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పంలో పర్యటించడం ఇదే తొలిసారి. అందులో భాగంగానే కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిపించారు సీఎం జగన్.