Chandrababu Gift: మద్యం షాపు యజమానులకు సీఎం చంద్రబాబు న్యూఇయర్ గిఫ్ట్
ఏపీలోని మద్యం షాపు యజమానులకు సీఎం చంద్రబాబు కమీషన్ శాతాన్ని పెంచేందుకు ఆమోదం తెలిపారు. తాజాగా మద్యం విధానంపై అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని తెలిపారు.
- Author : Gopichand
Date : 01-01-2025 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu Gift: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖల అభివృద్ధి దిశగా కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే పలు విభాగాల్లో ఉద్యోగుల జీతాలు పెంచిన కూటమి ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మద్యం షాపు యజమానులకు కొత్త సంవత్సరం ఊహించని శుభవార్త (Chandrababu Gift) అందింది. మద్యం షాపు యజమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న గుడ్ న్యూస్‌ను నూతన సంవత్సరం సందర్భంగా ఏపీ ప్రభుత్వం వినిపించింది. ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా మధ్యం విధానంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మద్యం షాపు యజమానుకులకు కమీషన్ పెంచుతూ న్యూ ఇయర్ గిఫ్ట్ అందించారు.
కమీషన్ 10 నుంచి 14 శాతం
ఏపీలోని మద్యం షాపు యజమానులకు సీఎం చంద్రబాబు కమీషన్ శాతాన్ని పెంచేందుకు ఆమోదం తెలిపారు. తాజాగా మద్యం విధానంపై అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయాన్ని తెలిపారు. అయితే గతంలో మద్యం షాపు యజమానులు తమకు మద్యం అమ్మకం ద్వారా వచ్చే కమీషన్ శాతాన్ని పెంచమని ఎక్సైజ్ శాఖ అధికారులను కోరారు. వారి విజ్ఞప్తిని తాజా సమీక్షలో సీఎంకు అధికారులు వివరించారు. అయితే వారి అవసరాన్ని గుర్తించిన సీఎం చంద్రబాబు 10 నుంచి 14 శాతానికి కమీషన్ ను పెంచారు. దీంతో మద్యం షాపు యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం తొలుత 20 శాతం ఇస్తానని ఒప్పుకున్నట్లు కొందరు యజమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: New Year: మరికాసేపట్లో కొత్త సంవత్సరం.. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి
మద్యం అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్ శాఖ నిన్న (డిసెంబర్ 30 వరకు) లెక్కలు విడుదల చేసింది. ఈ గణంకాల ప్రకారం కొత్త మద్యం షాపులు అందుబాటులోకి వచ్చిన తర్వాత మద్యం విక్రయాలు భారీగా జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. గత 75 రోజుల్లో ఏకంగా రూ. 6 వేల 312 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ పేర్కొంది. బార్లు, వైన్స్‌ల ద్వారా జరిగిన మద్యం అమ్మకాలను అధికారులు ప్రకటించారు.