HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababus Efforts Paid Off Krishnamma Traveled 738 Km To Kuppami

CM Chandrababu: ఫలించిన చంద్రబాబు కృషి.. 738 కిమీ ప్రయాణించి కుప్పానికి కృష్ణమ్మ!

215 క్యూసెక్కుల సామర్ధ్యంతో 123 కి.మీ. పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. రూ.197 కోట్లతో కాలువ లైనింగ్ పనులు చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఈ కాలువ వెళ్తుంది.

  • By Gopichand Published Date - 05:59 PM, Fri - 29 August 25
  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu

CM Chandrababu: రాయలసీమను సస్య శ్యామలం చేసేందుకు నాడు ఎన్టీఆర్ వివిధ ప్రాజెక్టులకు శ్రీకారం చుడితే.. ఆయన కలను చంద్రబాబు (CM Chandrababu) సాకారం చేస్తున్నారు. సీమ పల్లెల్లోకి నీళ్లు పారించారు. సీమకు పూర్తి స్థాయిలో కృష్టా జలాలు అనేవి ఇన్నేళ్లూ కల.. కానీ ఇప్పుడు అది నిజం. ఈ కలను చంద్రబాబు నిజం చేశారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది మొదటి నుంచి తెలుగు దేశం పార్టీ సంకల్పం. సీమలో ప్రాజెక్టులు మొదలుపెట్టింది ఎన్టీఆర్ అయితే…వాటిని ముందుకు తీసుకువెళ్లి ఆ కలను నిజం చేసింది చంద్రబాబు నాయుడు. అతి తక్కువ వర్ష పాతం ఉండే సీమ జిల్లాల్లో నీళ్లతోనే సీమ ప్రజల స్థితిగతులు మారుతాయని ఇరిగేషన్ కు అత్యంత ప్రధాన్యం ఇచ్చారు. ఈ క్రమంలో హంద్రీ నీవాకు ఉమ్మడి రాష్ట్రంలో 1999 జులై 9 చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ రోజు బీడు భూముల్లో నీళ్లు పారేలా చేశారు. ఇదంతా రాత్రికి రాత్రి ఇది జరగలేదు. 2014 నుంచి నేటి వరకు ప్రభుత్వం భారీఎత్తున సాగునీటి ప్రాజెక్టులపై నిథులు ఖర్చు చేయడం వల్లనే నేడు హంద్రీనీవా నీళ్లు చిత్తూరు జిల్లాలో చివరి భూములకు చేరాయి.

నాడు అత్యంత ప్రాధాన్యం

హంద్రీనీవా ప్రాజెక్టుపై 2014-19 మధ్య రూ.4,183 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును పరుగులు పెట్టించారు. 2019లో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు గ్రహణం పట్టించింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సీజన్‌లో ఎలాగైనా నీళ్లు ఇవ్వాలని లక్ష్యంతో పనుల్లో వేగం పెంచారు. రికార్డు స్థాయిలో కేవలం 100 రోజుల్లో మెయిన్ కెనాల్ విస్తరణ, లైనింగ్ పనులు పూర్తి చేసి ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3850 క్యూసెక్కులకు పెంచారు.

సాగు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది

సాగు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ చెబుతారు. చెప్పడమే కాదు.. దాన్ని చేసి చూపించాలన్న సంకల్పంతో రికార్డు స్థాయిలో చేపట్టిన హంద్రీ-నీవా కాల్వ విస్తరణ పనులతో సీమకు జలకళ వచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తంగా 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతోంది. విస్తరించిన కాల్వల ద్వారా పరుగులు పెడుతోన్న కృష్ణమ్మ 19 నియోజకవర్గాలను తాకింది… 10 రిజర్వాయర్లలను నింపుతోంది. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపురం జిల్లాలో జీడిపల్లి, పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లు నిండాయి. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి… అన్నమయ్య జిల్లాలోని శ్రీనివాసాపురం, అడవిపల్లి రిజర్వాయర్లు నిండుతున్నాయి. అలాగే గాజులదిన్నెకు నీరు చేరింది.

Also Read: Reliance Intelligence : భారత్‌లో కృత్రిమ మేధ..’రిలయన్స్ ఇంటెలిజెన్స్’ రూపంలో కొత్త విప్లవం: ముకేశ్ అంబానీ

చిత్తూరు సస్యశ్యామలం

హంద్రీనీవా ఆయకట్టులో చిట్టచివరి జిల్లా చిత్తూరు. చిత్తూరు జిల్లాలో 16 లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నా… కేవలం 6 లక్షల ఎకరాలకే సాగునీరు అందుతోంది. మిగిలిన 10 లక్షల ఎకరాలకు సాగునీరిస్తే…రైతన్నకు లోటు ఉండదు. హంద్రీనీవా రెండో దశ పనులు పూర్తి చేసి జిల్లాలోని 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తారు. చిత్తూరు జిల్లాలో సాగు అంతా బోర్లపైనే ఆధారపడి ఉంది. 565 కి.మీ. మేర ఉన్న పుంగనూరు, నీవా, తంబళ్లపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయల్పాడు, సదుం బ్రాంచ్ కాలువలతో 1,86,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. పీలేరు, పుంగనూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడీ నెల్లూరు నియోజకవర్గాల ప్రజలకు దీంతో ప్రయోజనం కలుగుతుంది.

పరమ సముద్రానికి కృష్ణా జలాలు

గత నెల 17వ తేదీన కర్నూలు జిల్లా మాల్యాల ఎత్తిపోతల నుంచి నీటిని విడుదల చేశారు. నాటి నుంచి హంద్రీనీవా కాలువల్లో ప్రవహించిన కృష్ణమ్మ 738 కి.మీ ప్రయాణించి కుప్పానికి చేరింది. పరమ సముద్రంలో సిఎం చంద్రబాబు కృష్ణా జలాలకు హారితి ఇవ్వనున్నారు. తరలి వచ్చిన కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

కుప్పం బ్రాంచ్ కెనాల్

215 క్యూసెక్కుల సామర్ధ్యంతో 123 కి.మీ. పొడవున కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మించారు. రూ.197 కోట్లతో కాలువ లైనింగ్ పనులు చేశారు. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో ఈ కాలువ వెళ్తుంది. ఈ కాలువ ద్వారా 4 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వడమే కాకుండా.. 110 చెరువులు నింపడం ద్వారా 6,300 ఎకరాల స్థిరీకరణ జరుగుతుంది. ప్రభుత్వం చిత్తశుద్ది సంకల్పం కారణంగా 40 టిఎంసిల నీటిని ఒక్క హంద్రీనీవా ద్వారా రాయల సీమ జిల్లాలు వినియోగించుకోనున్నాయి. చెరువుల అన్ని నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దీంతో సీమలో భూగర్భ జలాలు పెరగనున్నాయి. హార్టికల్చర్ పంటల ఉత్పత్తులు పెంచేందుకు సాగునీటి సౌకర్యం ఎంతో దోహదం చేయనుంది. ఈ ప్రాంత రైతుల జీవన ప్రమాణాలు పెంచే స్థాయిలో ఫలితాలు ఉండనున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Handri-Neeva Project
  • kuppam
  • telugu news
  • water

Related News

Group-1 Candidates

Group-1 Candidates: గ్రూప్-1 అభ్యర్థులకు శుభవార్త.. ఈనెల 27న నియామక పత్రాలు అంద‌జేత‌!

ఈ సందర్భంగా సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. నియామక పత్రాలు పొందే అభ్యర్థులు రాబోయే 30 సంవత్సరాల పాటు ప్రభుత్వ సేవలో ఉంటారని, కాబట్టి వారికి ఉత్సాహపూరితమైన వాతావరణంలో నియామక పత్రాలు అందజేయాలని సూచించారు.

  • Liquor Shops

    Liquor Shops: తెలంగాణలో మద్యం దుకాణాల నోటిఫికేషన్ విడుదల!

  • Dating App

    Dating App: షాకింగ్ ఘటన.. డేటింగ్ యాప్ ద్వారా క‌లుసుకున్న ఇద్ద‌రు యువ‌కులు!

  • CM Chandrababu

    Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌

  • Bathukamma Kunta

    Bathukamma Kunta: ఎల్లుండి బతుక‌మ్మ కుంటను ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి!

Latest News

  • Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశ ప్రభుత్వానికి.. ఎల్‌అండ్‌టీ నుంచి పూర్తిస్థాయి స్వాధీనం

  • Man Ate Spoons: స్పూన్లు, టూత్‌ బ్రష్‌లు మింగిన వ్యక్తి: రిహాబ్‌ సెంటర్‌పై కోపంతో అర్థంలేని పని

  • Parijata: పారిజాత పూల రహస్యం: ఈ పుష్పాలను ఎవరు కోయకూడదో ఎందుకు తెలుసా?

  • SKY: పహల్గాం వ్యాఖ్యలపై ఐసీసీ వార్నింగ్ లేదా జరిమానా ప్రమాదంలో సూర్యకుమార్

  • Car Brands Logo: సుజుకి కొత్త లోగో.. డిజిటల్ యుగంలో ఆటోమొబైల్ బ్రాండ్ల కొత్త వ్యూహం!

Trending News

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

    • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    • Gold Rate Hike: బంగారం ధ‌ర‌లు త‌గ్గుతాయా? పెరుగుతాయా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd