CM Chandrababu : ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం సీఎం చంద్రబాబు
పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు అందరూ శ్రమించాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది.
- By Latha Suma Published Date - 06:00 PM, Sat - 15 February 25

CM Chandrababu : సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దూబగుంటలో ‘‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’’ కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 64 లక్షల మందికి పింఛన్ ఇస్తున్నాం. ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. సంపద సృష్టిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. నేరస్థుల పట్ల కఠినంగా ఉంటాం. వారి గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తాం. ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టం అని చంద్రబాబు హెచ్చరించారు.
Read Also: Tollywood : చిత్రసీమకు ‘బాయ్‌కాట్’ బ్యాచ్‌ల తలనొప్పి..!
ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని చంద్రబాబు తెలిపారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. పరిసరాలు శుభ్రంగా ఉండేందుకు అందరూ శ్రమించాలి. పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేస్తేనే రాష్ట్రానికి మేలు జరుగుతుంది. పట్టణాల్లో 85లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అక్టోబరు 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్‌శాఖకు అప్పగించాం. పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒకరోజు కేటాయించాలి. ప్రజలు మంచిగా ఆలోచిస్తే రాష్ట్రానికి తిరుగులేదు. చెత్తను పునర్వినియోగం చేసి.. సంపద సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాం అన్నారు. ప్రతినెలా పేదల సేవలో ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి రూ.33 వేలకోట్ల పెన్షన్లు ఇస్తున్నమని తెలిపారు.
దీపం పథకం కింద మహిళలకు ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం. ప్రజల కోసం ఇంకా ఎంతో చేయాలని ఉంది. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదనే.. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. సెల్‌ఫోన్ ద్వారానే సేవలు పొందేలా ఏర్పాట్లు చేశాం. ఒక్క మెసేజ్ పెడితే చాలు సర్టిఫికెట్ వచ్చేస్తుంది. యువత ఉద్యోగం చేయడం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఎన్టీఆర్ హయాంలో మండల వ్యవస్థలు తీసుకువస్తే.. ప్రస్తుతం ప్రజల వద్దకే పాలన మేము తీసుకొచ్చామని చెప్పారు. గత ఐదేళ్లుగా రోడ్లపై తట్టెడు మట్టి కూడా వైసీపీ సర్కార్ వేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోడ్లపై గుంతలన్నీ పూడ్చి వేశాం. కేవలం 8 నెలల్లోనే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం..అని సీఎం తెలిపారు.