Tollywood : చిత్రసీమకు ‘బాయ్‌కాట్’ బ్యాచ్‌ల తలనొప్పి..!
Tollywood : కోట్లు పెట్టి సినిమా ప్రమోషన్ చేసిన కానీ ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించలేకపోతున్నారు
- By Sudheer Published Date - 05:41 PM, Sat - 15 February 25

ఒకప్పుడు సినిమా బాగున్నా బాగాలేకపోయిన థియేటర్ కు వెళ్లి సినిమా చూసేవారు. కానీ ఇప్పుడు ఆలా కాదు సినిమా బాగుంది అని టాక్ వస్తే తప్ప థియేటర్ కు వెళ్లడం లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా సినిమా విజయం వెనుక కీలక పాత్ర పోషిస్తుంది. కోట్లు పెట్టి సినిమా ప్రమోషన్ చేసిన కానీ ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పించలేకపోతున్నారు. కానీ సోషల్ మీడియా లో మాత్రం ఒక్క పోస్ట్ థియేటర్ కు వెళ్లేలా చేస్తున్నాయి. ఇదే సోషల్ మీడియా బాగున్నా సినిమాను సైతం డిజాస్టర్ చేసే సత్తా ఉంది. అదేలా అనుకుంటున్నారా..? కొంతమంది యాంటీ ఫ్యాన్స్ వల్ల. ఈ మధ్య సినీ పరిశ్రమలో కొత్తగా ‘బాయ్‌కాట్’ (#Boycott trend) బ్యాచ్‌లు తయారై, సినిమాలను టార్గెట్ చేయడం ఫ్యాషన్‌గా పెట్టుకున్నారు. బాలీవుడ్‌లో గతంలో ఎక్కువగా ఇలా చేసేవారు. ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. కొన్ని ప్రత్యేక బ్యాచ్ లు సినిమాలపై నెగెటివ్ ప్రచారం చేసి వాటి వసూళ్లపై ప్రభావం చూపాలని చూస్తున్నారు.
Food Subsidies: కేంద్రం సబ్సిడీలపై సంచలన నివేదిక.. హైరేంజులో ఆహార సబ్సిడీలు
ఇటీవల రాజకీయ పార్టీలు కూడా ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌ను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. ఉదాహరణకు వైసీపీ సోషల్ మీడియా మద్దతుదారులు కొన్ని సినిమాలను హిట్ చేశామని, మరికొన్నింటిని డిజాస్టర్ చేశామని ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా మారింది. అల్లు అర్జున్ ‘పుష్ప-2’కు వారు మద్దతు ఇచ్చి పెద్ద హిట్ చేశామని చెప్పుకుంటున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ ‘మట్కా’, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాలను తాము బాయ్‌కాట్ చేసి డిజాస్టర్ చేశామని గర్వపడుతున్నారు. కాకపోతే కొన్ని సినిమాల్లో ఇది వర్క్ అవుట్ అయినప్పటికీ అన్ని సినిమాలకు ఆలా వర్క్ అవుట్ కాదని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. సినిమా విజయాన్ని ప్రేక్షకుల అభిరుచి, హైప్, కంటెంట్ ఆధారంగా నిర్ణయించాలి. ‘మట్కా’ సినిమా విడుదలకు ముందు నుంచే అంతగా హైప్ లేదు, పైగా నవంబర్‌లో అన్‌సీజన్‌లో రిలీజ్ కావడంతో, కంటెంట్ కూడా బలహీనంగా ఉండటంతో డిజాస్టర్ అయ్యింది. అదే విధంగా, ‘గేమ్ చేంజర్’ ఆలస్యం కావడంతో హైప్ తగ్గిపోయింది. ఈ తరహా విషయాలను బాయ్‌కాట్ ట్రెండ్‌తో ముడిపెట్టడం సమంజసం కాదని అంటున్నారు.
ప్రేక్షకులు ఎప్పుడూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు మద్దతు ఇస్తారు. కాబట్టి సినిమాను బహిష్కరించాలంటూ ట్రెండ్లు నడిపే బ్యాచ్‌లు కేవలం తాత్కాలిక ప్రభావం చూపగలవు కానీ, సినిమా విజయం లేదా పరాజయాన్ని పూర్తిగా నిర్దేశించలేవు.