CM Naidu: రెండు ఘటనలపై సీఎం చంద్రబాబు సీరియస్ – అధికారులకు ఆదేశాలు
కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ఘటనపై మంత్రి సంధ్యారాణితో సీఎం టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
- By Dinesh Akula Published Date - 02:02 PM, Sun - 5 October 25

అనంతపురం, అక్టోబర్ 5: (CM Chandrababu Naidu)అనంతపురం, కురుపాం ప్రాంతాల్లో చోటు చేసుకున్న రెండేరు సంఘటనలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ఘటనపై మంత్రి సంధ్యారాణితో సీఎం టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. బాధిత విద్యార్థులకు చికిత్స అందుతున్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సంధ్యారాణి పరామర్శించనున్నట్లు సీఎం తెలిపారు. అలాగే పార్వతీపురం ఆస్పత్రిలో ఉన్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు అక్కడికి వెళ్లనున్నట్లు మంత్రికి సీఎంకు సమాచారం ఇచ్చారు.
Also Read:CBN New Look : నయా లుక్ లో సీఎం చంద్రబాబు
ఇక అనంతపురం శిశు సంరక్షణ కేంద్రంలో పసిబిడ్డ మృతి కేసుపైనా సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ విషయంలో కూడా మంత్రి సంధ్యారాణితో చర్చించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ రెండు ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు మెరుగైన చికిత్స, అవసరమైన సహాయం అందించాలన్నారు.